కలగర సాయి లక్ష్మణరావు
| కె.ఎస్. లక్ష్మణ రావు | |||
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 30 మార్చి 2019 - 2025 మార్చి 29[1] | |||
| తరువాత | ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కృష్ణా జిల్లా -గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం | ||
2007 - 2010
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం ఎమ్మెల్సీ | |||
| నియోజకవర్గం | కృష్ణా జిల్లా -గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 18 ఆగష్టు 1956 ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | ||
| తల్లిదండ్రులు | వెంకటేశ్వర రావు, జయలక్ష్మి | ||
| జీవిత భాగస్వామి | విజయ కుమారి | ||
| పూర్వ విద్యార్థి | సి.ఆర్.రెడ్డి కళాశాల | ||
కలగర సాయి లక్ష్మణరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కృష్ణా జిల్లా -గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి 14 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ప్రాతినిద్యం వహించి, 2025లో పదవీ విరమణ చేసాడు.[2][3] కేఎస్‌గా సుపరిచితుడైన ఆయన, పాతికేళ్లపాటు గుంటూరు హిందూ కాలేజీలో పాలిటికల్ సైన్స్ బోధించాడు.[4]
రాజకీయ జీవితం
[మార్చు]కె.ఎస్.లక్ష్మణరావు మొదటిసారి 2007లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[5] ఆయన తిరిగి 2014లో పోటీ చేసి ఓడిపోయాడు. లక్ష్మణరావు 2019 మార్చిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నూతలపాటి అంజయ్యపై ఎమ్మెల్సీగా గెలిచాడు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం1,49,319 ఓట్లు పోలైతే లక్ష్మణ రావుకు 80,670 ఓట్లు రాగా, నూతలపాటి అంజయ్య 12,550 ఓట్ల వచ్చాయి దీనితో ఆయన 68,120 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికయ్యాడు.[6]
కలగర సాయి లక్ష్మణరావు 2025లో శాసనమండలికి జరిగిన ఎన్నికలలో గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గాల నుండి తెలుగుదేశం తరపున ఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతిలో ఓడిపోయాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల". Andhrajyothy. 3 February 2025. Archived from the original on 3 February 2025. Retrieved 3 February 2025.
- ↑ The Hindu (29 March 2019). "Lakshmana Rao wins council poll" (in Indian English). Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.
- ↑ "అరుదైన ప్రజాప్రతినిధి కెఎస్ లక్ష్మణరావు - Prajasakti". Prajasakti -. 2025-04-04. Archived from the original on 2025-04-09. Retrieved 2025-05-25.
- ↑ "నిరసన తెలిపే హక్కునూ కాలరాస్తున్న ప్రభుత్వం | Those who Leave Dharna Chowk in Vijayawada are Forcibly Taken Away From There | Sakshi". www.sakshi.com. Retrieved 2025-05-25.
- ↑ "Lakshmana Rao is winner in teachers' constituency". The Hindu. 26 March 2007. Archived from the original on 4 November 2012. Retrieved 12 June 2021.
- ↑ The Hans India (28 March 2019). "K.S.Lakshmana Rao elected from Guntur-Krishna districts Graduates MLC constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.
- ↑ "ఆలపాటి రాజా విజయభేరి". Eenadu. 4 March 2025. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.