కొయ్యే మోషేన్‌రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొయ్యే మోషేన్‌రాజు
కొయ్యే మోషేన్‌రాజు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 నవంబర్ 2021 - ప్రస్తుతం
నియోజకవర్గం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
14 జూన్ 2021 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 10 ఏప్రిల్ 1965
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సుందర రావు, మరియమ్మ
సంతానం 2
నివాసం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

కొయ్యే మోషేన్‌రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు.[1] కొయ్యే మోషేన్‌రాజు 19 నవంబర్ 2021న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

మోషేన్‌రాజు 10 ఏప్రిల్ 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించాడు. ఆయన బీఏ వరకు చదువుకున్నాడు

రాజకీయ జీవితం[మార్చు]

మోషేన్‌రాజు అతిపిన్న వయస్సులో 1987లో భీమవరం పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన వరుసగా నాలుగు పర్యాయాలు కౌన్సిలర్‌గా ఎన్నికైయ్యాడు. మోషేన్‌రాజు 2009లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా వివిధ హోదాల్లో పని చేశాడు.మోషేన్‌రాజు 2010లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడిన మరుసటి రోజే డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆయనకు మద్దతు ప్రకటించాడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి ఉండి అసెంబ్లీ నియోజక వర్గం ఇన్‌చార్జీగా పని చేశాడు. వైసీపీలోఎస్సీ, ఎస్టీ సెల్‌ విభాగంలో పలు హోదాల్లో పని చేశాడు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా పని చేస్తున్నాడు. మోషేన్‌రాజు 14 జూన్ 2021న గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[3][4]ఆయన 21 జూన్ 2021న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[5]కొయ్యే మోషేన్‌రాజు 19 నవంబర్ 2021న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు.[6]

మూలాలు[మార్చు]

  1. Eenadu (15 June 2021). "వార్డు నుంచి మండలి వరకు." EENADU. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  2. NTV (19 November 2021). "ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజు రాజకీయ ప్రస్థానం". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  3. Andhrajyothy (15 June 2021). "కౌన్సిలర్‌ నుంచి ఎమ్మెల్సీ వరకు మోషేన్‌రాజు ప్రస్థానం". www.andhrajyothy.com. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  4. Andhrajyothy (15 June 2021). "ఎమ్మెల్సీల ఫైలుకు ఆమోదం". www.andhrajyothy.com. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  5. Sakshi (21 June 2021). "ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు". Sakshi. Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
  6. Andhrajyothy (19 November 2021). "మండలి చైర్మన్‌గా మోషేన్‌రాజు". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.