Jump to content

ఇందుకూరి రఘురాజు

వికీపీడియా నుండి
ఇందుకూరి రఘురాజు
ఇందుకూరి రఘురాజు


శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 డిసెంబర్ 2021 - ప్రస్తుతం
నియోజకవర్గం విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 18 జులై 1973
బొడ్డవర ,ఎస్‌.కోట మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రామరాజు, రాణి
జీవిత భాగస్వామి సుధారాణి
సంతానం రామరాజు, పూజిత

ఇందుకూరి రఘురాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల నుంచి శాశనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఇందుకూరి రఘురాజు 18 జూలై 1973లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, ఎస్‌.కోట మండలం, బొడ్డవర గ్రామంలో రామరాజు, రాణి దంపతులకు జన్మించాడు. ఆయన బీఏ వరకు చదువుకున్నారు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఇందుకూరి రఘురాజు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా, శృంగవరపుకోట మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 32 వేల ఓట్లు పొందారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 31 వేల ఓట్లు పొందారు. మొత్తం రాష్ట్రంలో అధిక ఓట్లు పొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో రఘురాజు మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఆయన అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి విజయనగరం జిల్లా ప్లానింగ్‌ కమిటీ సభ్యుడిగా, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. రఘురాజు 2018 సెప్టెంబరు 5న భారతీయ జనతా పార్టీని నుంచి బయటకు వచ్చేసారు.

అనంతరం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరి[2] రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడై పార్టీ బలోపేతానికి పనిచేశారు. శృంగవరపు కోట నియోజకవర్గంతో పాటు విజనయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషమైన సేవలు అందించారు.

ఇందుకూరి రఘురాజు సేవలను గుర్తించి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2021 నవంబరు 12న వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ప్రకటించింది.[3][4] ఆయన 2021 నవంబరు 20నన నామినేషన్ దాఖలు చేశారు.[5] రఘురాజు 2021 నవంబరు 26న ఏకగ్రీవంగా ఎన్నికై, [6] 2021 డిసెంబరు 8న శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు.[7]

ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతులు

వివాదం

[మార్చు]

ఇందుకూరి రవిరాజు వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ మండలి విప్ పాలవలస విక్రాంత్ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయడంతో వైసీపీ ఫిర్యాదుతో 2023 జూన్‌ 3న మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌ రాజు ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేశాడు.[8] దీంతో ఇందుకూరి రవిరాజు తనపై వేసిన అనర్హత వేటుపై హైకోర్టును ఆశ్రయించగా, ఈ విచారణలో తుది వాదనలు విన్న హైకోర్టు మండల చైర్మన్ మోషన్ రాజు వేసిన అనర్హత వేటు చెల్లదని, తిరిగి ఎమ్మెల్సీగా రఘురాజు కొనసాగేలా ఆర్డర్ ఇచ్చింది.[9]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Sakshi (5 September 2018). "వైఎస్సార్ సీపీలో చేరిన రఘురాజు". Archived from the original on 5 September 2018. Retrieved 1 January 2022.
  3. Andhrajyothy (12 November 2021). "వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడికి ఎట్టకేలకు అదృష్టం!". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  4. Eenadu (13 November 2021). "వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  5. Prajasakti (20 November 2021). "ఎంఎల్‌సి స్థానానికి రఘురాజు నామినేషన్‌ | Prajasakti". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  6. Prajasakti (26 November 2021). "ఎంఎల్‌సిగా రఘురాజు ఏకగ్రీవం". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  7. Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  8. Sakshi (4 June 2024). "ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  9. Andhrajyothy (7 November 2024). "ఎమ్మెల్సీ రఘురాజుకు ఊరట". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.