సి.రామచంద్రయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.రామచంద్రయ్య

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చ్ 2021 - 2024 మార్చి 12
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 27 మే 1948
గుడ్లవారిపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలానికి , వైఎస్‌ఆర్ జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ , ప్రజారాజ్యం పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
తల్లిదండ్రులు శ్రీరాములు
జీవిత భాగస్వామి కస్తూరిభాయి
నివాసం కడప

చెన్నంశెట్టి రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. అతను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రామచంద్రయ్య 1948 మే 27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్‌ఆర్ జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలానికి, గుడ్లవారిపల్లె గ్రామంలో జన్మించాడు. బీకామ్ వరకు చదువుకున్నాడు. అనంతరం చార్టర్ అకౌంటెంట్‌గా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రామచంద్రయ్య 1981లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం. చంద్రశేఖరరెడ్డిపై 8197 ఓట్ల మెజారితో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో 1986 నుండి 1988 వరకు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ అమలు మంత్రిగా పనిచేశాడు.[1] సి.రామచంద్రయ్య తర్వాత రెండు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, 1999 నుండి 2004 వరకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్స్‌ చైర్మన్‌గా పనిచేశాడు. అతను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశాడు.

రామచంద్రయ్య 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో అతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ తరపున 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికై కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో 2012లో దేవదాయ శాఖ మంత్రిగా నియమితుడై, 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అతను 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు. సి.రామచంద్రయ్య 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేశాడు.[2][3][4] అతను శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్లు 2021 మార్చి 8న ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా తెలిపాడు.[5] రామచంద్రయ్య శాసనసభ్యుడిగా 2021 ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేశాడు.[6][7]

సి.రామచంద్రయ్య 2023 జనవరి 03న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరాడు.[8] వైసిపి నుండి టీడీపీ పార్టీలోకి ఫిరాయించడంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైసిపి నేత, మండలిలో చీఫ్‌ విప్‌ మేరిగ మురళీధర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేయగా అతనిని నుండి వివరణ తీసుకొని, సమగ్ర విచారణ అనంతరం రామచంద్రయ్యపై అనర్హత వేటు వేసినట్లు 2024 మార్చి 12న శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రకటించాడు.[9]

అతనిని జూలై 12న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన పేరును జూలై 1న టీడీపీ అధిష్టానం ప్రకటించింది.[10][11]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 March 2019). "కడప.. మంత్రుల గడప". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
  2. News18 Telugu. "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ ఆరుగురే ఎందుకు? ఎవరి నేపథ్యం ఏంటి?". Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. TV9 Telugu (25 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే! - Political history of YCP MLC candidates". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (26 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో వైఎస్సార్‌సీపీ ప్రత్యేకత". Sakshi. Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  5. Outlook India (8 March 2021). "Six ruling YSR Congress candidates elected unopposed to AP Legislative Council". outlookindia.com/. Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  6. The Times of India (1 April 2021). "Six newly elected Andhra Pradesh MLCs take oath" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
  7. Prajashakti (1 April 2021). "ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 2 April 2021. Retrieved 18 July 2021.
  8. Eenadu (4 January 2024). "జగన్‌ ఇలాకాలో వైకాపాకు ఝలక్‌". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  9. NT News (12 March 2024). "పార్టీ ఫిరాయింపు.. ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  10. "ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే, జనసేనకు ఛాన్స్". 1 July 2024. Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
  11. Eenadu (2 July 2024). "ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.రామచంద్రయ్య". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.