లేళ్ల అప్పిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లేళ్ల అప్పిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
14 జూన్ 2021 - ప్రస్తుతం
నియోజకవర్గం గవర్నర్ కోట ఎమ్మెల్సీ

వ్యక్తిగత వివరాలు

జననం (1985-01-22) 1985 జనవరి 22 (వయసు 39)
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
నివాసం గుంటూరు , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

లేళ్ల అప్పిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు.[1][2][3]

జననం[మార్చు]

లేళ్ల అప్పిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు రురల్ మండలం, అంకిరెడ్డిపాలెం గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

లేళ్ల అప్పిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి, పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్‌ఎస్‌యూఐలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన ఆరేళ్ల పాటు గుంటూరు జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 2003లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా, 2007లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 2006లో గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా, 2011 నుండి 17వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. అప్పిరెడ్డి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెదేపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆయన 2018లో వైకాపా గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

అప్పిరెడ్డి 2020 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవితోపాటు పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. లేళ్ల అప్పిరెడ్డి 2021 జూన్ 14న గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 2021 జూన్ 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[6]

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (14 June 2021). "AP Governor Quota MLC: గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఆమోదం.. ప్రకటన విడుదల చేసిన రాజ్ భవన్ - AP governor approves nominated governor quota mlc four names". TV9 Telugu. Archived from the original on 14 June 2021. Retrieved 14 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (15 June 2021). "విధేయతకు పట్టం". EENADU. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
  3. Andhrajyothy (15 June 2021). "ఎమ్మెల్సీల ఫైలుకు ఆమోదం". www.andhrajyothy.com. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
  4. Sakshi (15 June 2021). "కొత్త ఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఆమోదం". Sakshi. Archived from the original on 16 June 2021. Retrieved 16 June 2021.
  5. Suryaa (14 June 2021). "పట్టు'వదిలిన' విక్రమార్కుడు… అప్పిరెడ్డి!". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  6. Sakshi (21 June 2021). "ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు". Sakshi. Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.