మోదుగుల వేణుగోపాల్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
ముందు కన్నా లక్ష్మీనారాయణ
తరువాత మద్దాల గిరి
నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజవర్గం

ఎంపీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
ముందు మేకపాటి రాజమోహన రెడ్డి
తరువాత రాయపాటి సాంబశివరావు
నియోజకవర్గం నరసరావుపేట పార్లమెంట్‌

వ్యక్తిగత వివరాలు

జననం 29 మే 1966
పెదపరిమి గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పాపిరెడ్డి, ఆదిలక్ష్మీ
జీవిత భాగస్వామి మాధవికృష్ణ
సంతానం సాకేత్‌ రామిరెడ్డి, ప్రణవ్‌ సుబ్బారెడ్డి

మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యుడిగా, 2014లో గుంటూరు పశ్చిమ నియోజవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి 29 మే 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం, పెదపరిమి గ్రామంలో మోదుగుల పాపిరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులకు జన్మించాడు.[1] ఆయన బీకాం, ఎల్‌ఎల్‌బీ వరకు చదువుకున్నాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్‌ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] వేణుగోపాల్‌ రెడ్డి 5 మార్చి 2019న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 8 మార్చి 2019న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాడు.[4][5] ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (5 April 2019). "తాడికొండతో...తరాల అనుబంధం". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  2. Members : Lok Sabha (2021). "Modugula Venugopala". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (5 March 2019). "టీడీపీకి మరో భారీ షాక్‌..! ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి మోదుగుల రాజీనామా". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  5. HMTV (5 March 2019). "టీడీపీకి మరో భారీ షాక్‌." Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.