Jump to content

రాయపాటి సాంబశివరావు

వికీపీడియా నుండి
రాయపాటి సాంబశివరావు
దస్త్రం:Sri Rayapati Sambasivarao.jpg
నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు
In office
16 మే 2014 – 23 మే 2019
అంతకు ముందు వారుమోదుగుల వేణుగోపాలరెడ్డి
తరువాత వారులావు శ్రీ కృష్ణ దేవరాయలు
నియోజకవర్గంనరసరావుపేట
గుంటూరు పార్లమెంటు సభ్యుడు
In office
2004–2014
అంతకు ముందు వారుయెంపర్ల వెంకటేశ్వరరావు
తరువాత వారుగల్లా జయదేవ్
గుంటూరు పార్లమెంటు సభ్యుడు
In office
1996–1999
అంతకు ముందు వారుఎస్.ఎం.లాల్ జాన్ భాషా
తరువాత వారుయెంపరాల వెంకటేశ్వర రావు
రాజ్యసభ సభ్యుడు
In office
1982–1988
వ్యక్తిగత వివరాలు
జననం (1943-06-07) 1943 జూన్ 7 (age 82)
ఉంగుటూరు, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ2014 నుండి తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్ (1982-2014)
జీవిత భాగస్వామిలీలాకుమారి
సంతానంరాయపాటి రంగారావు, మర్రి దేవికారాణి, ముత్తవరపు లక్ష్మి
నివాసంగుంటూరు
As of 16 సెప్టెంబరు, 2006

రాయపాటి సాంబశివరావు: (జ: 1943 జూన్ 7) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 11వ, 12వ, 14వ, 15వ, 16వ లోక్‌సభలకు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం , నరసరావు పేట లోక్ సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అతను 39 సంవత్సరాల వయస్సులో రాజ్యసభకు ఎన్నికైన అతి పిన్న వయస్కులలో ఒకడు.

జననం

[మార్చు]

సాంబశివరావు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని ఉంగుటూరులో రాయపాటి వెంకట రంగారావు, సీతారామమ్మ దంపతులకు 1943 జూన్ 7న జన్మించారు. ఏడుగురు పిల్లలలో సాంబశివరావు పెద్దవాడు. వీరిది రైతు కుటుంభం. శైవ మతాన్ని అనుసరించేవాడు.

సాంబశివరావు తాడికొండ లో సెకండరీ విద్యను పూర్తి చేసి హైదరాబాద్ లోని న్యూ సైన్స్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు

రాజకీయ జీవితం

[మార్చు]

సాంబశివరావు రాజకీయ ప్రవేశం 1972 లో వారి మేనమామ గోగినేని కనకయ్య ద్వారా జరిగింది. కాంగ్రెసు పార్టీ లో ఉన్న కనకయ్య తాడికొండ సర్పంచ్ గాను, కోపరేటివ్ రూరల్ బ్యాంక్ అధ్యక్షునిగా, తాడికొండ పంచాయతీ సమితి అధ్యక్షునిగా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టిని ఆకర్షించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ లో ఒక ప్రముఖ నాయకుడిగా రూపొందారు.

1982 లో ఆంధ్రప్రదేశ్ నుండి మొదటిసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 39 సంవత్సరాల వయస్సులో రాజ్యసభకు ఎన్నికైన అతి పిన్న వయస్కులలో రాయపాటి ఒకడు.

1996 లో జరిగిన 11వ ,1998 లో జరిగిన 12వ, 2004 లో జరిగిన 14వ, 2009 లో జరిగిన 15వ, లోక్‌సభలకు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి జాతీయ కాంగ్రెస్ అభ్యర్దిగా ఎన్నికైనారు.

2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను పార్లమెంట్ లో తీవ్రంగా వెతిరేకించి కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

2014 లో జరిగిన 16వ లోక్సభకు నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్దిగా ఎన్నికైనారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సాంబశివరావు లీలా కుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, రాయపాటి రంగారావు, ఇద్దరు కుమార్తెలు దేవిక రాణి, లక్ష్మి ఉన్నారు.

సాంబశివరావు వారి తండ్రి పేరుతో 'రాయపాటి వెంకట రంగారావు అండ్ జాగర్లమూడి చంద్రమౌళి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల స్థాపనలో తోడ్పడ్డారు.[1]

రాయపాటి సాంబశివరావు సోదరుడు గోపాలకృష్ణ కుమార్తె రాయపాటి శైలజ అమరావతి మహిళా ఐకాస కన్వీనర్‌గా పనిచేసి 2025 మే 11న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "RVR & JC College of Engineering".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "విదేయతకు 'నామినేటెడ్‌' కిరీటం". Eenadu. 12 May 2025. Archived from the original on 12 May 2025. Retrieved 12 May 2025.


బయటి లింకులు

[మార్చు]