సిపాయి సుబ్రమణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. సిపాయి సుబ్రమణ్యం

శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 మే 02 - 01 మే 2029
నియోజకవర్గం స్థానిక సంస్థల కోటా - ఉమ్మడి చిత్తూరు జిల్లా

వ్యక్తిగత వివరాలు

జననం 29 జనవరి 1959
మోపిరెడ్డిపల్లె గ్రామం, పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు పార్వతమ్మ, గోవింద రెడ్డి
జీవిత భాగస్వామి శాంతి
సంతానం కీర్తి సాగర్ రెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు, వైద్యుడు

సిపాయి సుబ్రమణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగే ఎన్నికలకు స్థానిక సంస్థల నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1][2] సిపాయి సుబ్రమణ్యం మార్చి 17న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి అడుగు పెట్టి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పోరేషన్ ఛైర్మన్‌గా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పని చేసి ఫిబ్రవరి 2023లో తన పదవికి & టిడిపికి రాజీనామా చేసి[4] వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

సిపాయి సుబ్రమణ్యం ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు స్థానిక సంస్థల నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించగా[5], మార్చి 17న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికై[6], మే 15న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (21 February 2023). "వైసీపీ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిపాయి సుబ్రమణ్యం". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  2. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  3. Sakshi (17 March 2023). "'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  4. Sakshi (16 February 2023). "టీడీపీకో దండం! కన్నీటిపర్యంతమైన సిపాయి.. పదవికి రాజీనామా". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  5. Sakshi (21 February 2023). "సిపాయి ఎంపికపై హర్షం". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  6. Andhra Jyothy (28 February 2023). "స్థానిక ఎమ్మెల్సీగా 'సిపాయి' ఏకగ్రీవ ఎన్నిక". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  7. 10TV Telugu (15 May 2023). "ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)