భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి
భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి | |||
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 30 మార్చి 2023 - 29 మార్చి 2029 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 14 ఆగస్ట్ 1969 కాంబల్లె గ్రామం, సింహాద్రిపురం మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | వీరారెడ్డి, లక్ష్మీదేవమ్మ | ||
జీవిత భాగస్వామి | ఉమాదేవి | ||
పూర్వ విద్యార్థి | బీఎస్సీ బీఇడీ | ||
మతం | హిందూ మతము |
భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]రామగోపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, సింహాద్రిపురం మండలం, కాంబల్లె గ్రామంలో 1969 ఆగస్టు 14న వీరారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించాడు.అతను బీఎస్సీ, బీఇడీ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విద్యార్థి దశలో విద్యార్థి సంఘం నాయకుడిగా పని చేశాడు. అతను ఆ తరువాత 1990 నుండి 94 వరకు ఉదయం విలేకరిగా పనిచేశాడు. రామగోపాల్ రెడ్డి 1996లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కడప జిల్లా కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అతను 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం (కడప, కర్నూలు అనంతపురం జిల్లాలు) నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7543 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (18 March 2023). "పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విక్టరీ". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
- ↑ Eenadu (18 March 2023). "వైకాపా కోటకు బీటలు.. పశ్చిమ రాయలసీమలో తెదేపా ఘన విజయం". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
- ↑ Andhra Jyothy (19 March 2023). "పశ్చిమ రాయలసీమ టీడీపీదే". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.