పల్లా సింహాచలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్లా సింహాచలం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 1999
నియోజకవర్గం విశాఖపట్నం-II

వ్యక్తిగత వివరాలు

జననం 1940
గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
సంతానం పల్లా శ్రీనివాసరావు
నివాసం డో.నెం. 9-1-177, హై స్కూల్ రోడ్, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్షుడు
వృత్తి రాజకీయ నాయకుడు

పల్లా సింహాచలం యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో విశాఖపట్నం- II శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఆయన కుమారుడు పల్లా శ్రీనివాసరావు రెండుసార్లు గాజువాక నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

పల్లా సింహాచలం కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి వాసుదేవరావు ఈశ్వరపుపై ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పెందుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గుడివాడ గురునాథరావు చేతిలో 19,903 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

పల్లా సింహాచలం 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో విశాఖపట్నం- II శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మరియదాస్ యండ్రపుపై 21773 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 1999లో ఎన్నికలలో పోటీ చేయలేదు, ఆయన తిరిగి 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో విశాఖపట్నం- II శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సారిపల్లి రంగరాజు చేతిలో 51010 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. Eenadu (17 June 2024). "తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. 10TV Telugu (1 April 2024). "గుడివాడ వర్సెస్ పల్లా.. గాజువాకలో గెలుపెవరిది?" (in Telugu). Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. BBC News తెలుగు (29 April 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకసారి గెలిచిన వారికి మరో చాన్స్ ఇవ్వని నియోజకవర్గం, ఇక్కడే ఎందుకిలా జరుగుతోంది?". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.