పెండెం దొరబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెండెం దొరబాబు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - 3 జూన్ 2024
ముందు ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ
తరువాత పవన్ కళ్యాణ్
నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 జనవరి 1959
సర్పవరం గ్రామం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ
తల్లిదండ్రులు వీరరాఘవరావు, వీరరాఘవమ్మ
జీవిత భాగస్వామి అన్నపూర్ణ
సంతానం సత్య అనంత లక్ష్మీదేవి (అర్షిత)

పెండెం దొరబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పెండెం దొరబాబు 12 జనవరి 1959లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[[తూర్పు గోదావరి జిల్లా]],కాకినాడ సమీపంలోని [సర్పవరం|సర్పవరం గ్రామం]]లో వీరరాఘవరావు, రాఘవమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

పెండెం దొరబాబు భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయి, 2004లో బీజేపీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొప్పన మోహనరావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. పెండెం దొరబాబు వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 14992 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.