కొప్పన మోహనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొప్పన మోహనరావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1983
నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989 - 1994
నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
మల్లం గ్రామం, పిఠాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ

కొప్పన వెంకట చంద్ర మోహనరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన పిఠాపురం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అటవీ శాఖ మంత్రిగా పని చేశాడు.

జననం[మార్చు]

కొప్పన మోహనరావు 1955లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం మండలం, మల్లం గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కొప్పన మోహనరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో పిఠాపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 1983లో ఓడిపోయాడు. ఆయన తిరిగి 1989లో పిఠాపురం నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశాడు. కొప్పన మోహనరావు 14 ఫిబ్రవరి 2017న కాంగ్రెస్ పార్టీని వీడి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

మరణం[మార్చు]

కొప్పన మోహనరావు అనారోగ్యంతో బాధపడుతూ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 30 జులై 2020న మరణించాడు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. HMTV (30 July 2020). "మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు కన్నుమూత". Archived from the original on 24 December 2021. Retrieved 24 December 2021.
  2. Sakshi (30 July 2020). "మాజీ మంత్రి కొప్పన మోహనరావు మృతి". Archived from the original on 24 December 2021. Retrieved 24 December 2021.
  3. The Hindu (31 July 2020). "Ex-Minister Koppana Mohana Rao dies of COVID-19" (in Indian English). Archived from the original on 24 December 2021. Retrieved 24 December 2021.