ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్‌లోని నగరపాలక సంస్థలను, పురపాలకసంఘాలను, నగర పంచాయతీలను కలుపుకొని అన్ని పట్టణ స్థానిక సంస్థల వివరాలను తెలుపుతుంది. సంచాలకులు,పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 120 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇందులో 16 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు 77, నగర పంచాయతీలు 27 ఉన్నాయి. [1]77 పురపాలక సంఘాలలో 6 ఎంపిక, 7 ప్రత్యేక,16 మొదటి, 30 రెండవ 18 మూడవ స్థాయిని కలిగి ఉన్నాయి.

నగరపాలక సంస్థలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లోని నగరపాలక సంస్థలు (మునిసిపల్ కార్పొరేషన్లు)

2019 నవంబర్ నాటికి, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 16 నగరపాలక సంస్థలు ఉన్నాయి.తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో రెండు చొప్పున కార్పొరేషన్లు ఉన్నాయి.మిగతా జిల్లాలన్నింటిలో ఒకటి మాత్రమే ఉన్నాయి.మహా విశాఖ నగరపాలక సంస్థ 540 చ.కి (208 చ.మైళ్లు) విస్తీర్ణం కలిగిన అతిపెద్ద నగరపాలక సంస్థగా ఉంది.అన్ని నగరపాలక సంస్థలలో 13 నగరపాలక సంస్థలకు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి మినహా మిగిలినవి అన్నీ జిల్లా ప్రధాన కార్యాలయాలు. [2]

మచిలీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సంస్థలు 2015 డిశెంబరు 9 న పురపాలక సంఘాలు స్థాయి నుండి, మునిసిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.అయితే అప్పటి ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగిసే వరకు విజయనగరం, మచిలీపట్నం మునిసిపాలిటీలుగా కొనసాగేపద్దతిలో ఉత్తర్వులు వెలువడ్డాయి. [3] [4]

జిల్లా మునిసిపల్ కార్పొరేషన్లు మొత్తం మూలం
అనంతపురం అనంతపురం నగరపాలక సంస్థ 1
చిత్తూరు చిత్తూరు నగరపాలక సంస్థ

తిరుపతి నగరపాలక సంస్థ

2
తూర్పు గోదావరి రాజమండ్రి నగరపాలక సంస్థ

కాకినాడ నగరపాలక సంస్థ

2
గుంటూరు గుంటూరు నగరపాలక సంస్థ 1
వైఎస్‌ఆర్ జిల్లా కడప నగరపాలక సంస్థ 1
కృష్ణా విజయవాడ నగరపాలక సంస్థ

మచిలిపట్నం నగరపాలక సంస్థ

2
కర్నూలు కర్నూలు నగరపాలక సంస్థ 1
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరపాలక సంస్థ 1
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ 1
శ్రీకాకుళం శ్రీకాకుళం నగరపాలక సంస్థ 1
విశాఖపట్నం మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ 1
విజయనగరం విజయనగరం నగరపాలక సంస్థ 1
పశ్చిమ గోదావరి ఏలూరు నగరపాలక సంస్థ 1
మొత్తం 16

పురపాలక సంఘాలు[మార్చు]

రాష్ట్రంలో పురపాలక సంఘాలు 65 ఉన్నాయి.అందులో 4 సెలెక్షన్ గ్రేడ్, 7 స్పెషల్ గ్రేడ్, 12 ఫస్ట్ గ్రేడ్, 25 సెకండ్ గ్రేడ్,17 థర్డ్ గ్రేడ్ గా వర్గీకరించారు.గుంటూరు జిల్లాలో అత్యధిక మునిసిపాలిటీలు12 ఉన్నాయి. [5] విశాఖపట్నం జిల్లాలో లోగడ పురపాలక సంఘాలుగా ఉన్న అనకాపల్లి, భీముని పట్నం (భీమిలీ) మునిసిపాలిటీలను గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు.

జిల్లా పురపాలక సంఘాలు మొత్తం మూలం
అనంతపురం ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, 7
చిత్తూరు మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు 6
తూర్పు గోదావరి అమలాపురం, మండపేట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, సామర్లకోట, తుని 7
గుంటూరు బాపట్ల, చిలకలూరిపేట, మాచర్ల, మంగళగిరి, నరసరావుపేట, పిడుగురాళ్ల, పొన్నూరు, రేపల్లె, సత్తెనపల్లి, తాడేపల్లి, తెనాలి, వినుకొండ 12
వైఎస్ఆర్ జిల్లా బద్వేలు, , ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి 4
కృష్ణా గుడివాడ, జగ్గయ్యపేట, నూజినీడు, పెడన 4
కర్నూలు అదోని, నందికొట్కూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, 4
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు, కావలి, వెంకటగిరి 3
ప్రకాశం చీరాల, కందుకూరు, మార్కాపురం 3
శ్రీకాకుళం ఆమదాలవలస, ఇచ్చాపురం, పలాస-కాశిబుగ్గ 3
విశాఖపట్నం నర్సిపట్నం, ఎలమంచిలి 2
విజయనగరం బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు 3
పశ్చిమ గోదావరి భీమవరం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు 7
పురపాలక సంఘాలు సంఖ్య 65

నగర పంచాయితీలు[మార్చు]

రాష్ట్రంలో మొత్తం 29 నగర పంచాయతీలు ఉన్నాయి.వైఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా నగర పంచాయతీలు నాలుగు ఉన్నాయి. చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల నందు నగర పంచాయితీలు ఏవీ లేవు.

జిల్లా పురపాలక మొత్తం మూలం
అనంతపురం మడకసిర, పామిడి, పుట్టపర్తి, శ్రీకాళహస్తి, 4
తూర్పు గోదావరి గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం 3
కృష్ణా నందిగామ, తిరువూరు, ఉయ్యూరు 3
కర్నూలు ఆత్మకూరు, డోన్, ఆళ్లగడ్డ,గూడూరు 4
వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు, జమ్మలమడుగు, రాజంపేట, యర్రగుంట్ల 4
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు 3
ప్రకాశం అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి 4
శ్రీకాకుళం పాలకొండ, రాజాం 2
విజయనగరం నెల్లిమర్ల 1
పశ్చిమ గోదావరి జంగారెడ్డి గూడెం 1
నగర పంచాయితీల సంఖ్య 29

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://dtcp.ap.gov.in/dtcpweb/ULBS.html
  2. "Municipal Corporation Status for All District HQs in AP". The New Indian Express. Hyderabad. 17 February 2015. Retrieved 7 February 2016.
  3. "Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations". The Hindu. Vijayawada. 10 December 2015. Archived from the original on 9 April 2016. Retrieved 10 December 2015.
  4. Correspondent, Special. "Vizianagaram, Masula to continue as municipalities". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 3 May 2017.
  5. Error on call to మూస:cite web: Parameters url and title must be specified

వెలుపలి లంకెలు[మార్చు]