Jump to content

2014 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ ఎన్నికలు కాబోయే రెండు తెలుగు రాష్ట్రాల పురపాలక ఎన్నికలకు సంబంధించినవి. వీటికి 2014 మార్చి 3 న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించింది.[1]

నేపథ్యం

[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ లో నగరపాలక సంస్థల విజేతలు
  తెలుగుదేశం
  వై.కా.పా
  తె.రా.స
  కాంగ్రెస్
  ఇతరులు

స్థానిక ఎన్నికలకు గడువు పూర్తయినా నిర్వహిచంకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని న్యాయస్థానాలు తప్పుపట్టడంతో శాసన సభ, లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌గా మారి సార్వత్రక, శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నందున స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయాలని వివిధ రాజకీయ పక్షాలు వేసిన పిటిషన్‌లను న్యాయస్థానం తిరస్కరించింది. అయితే స్థానిక ఎన్నికల ఫలితాలను సార్వత్రక ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే దాకా వెలువరించరాదని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశం ప్రకారం మున్సిపల్ ఎన్నికల్ని మార్చి 30న, సుప్రీంకోర్టు జారీ చేసిన హుకుం మేరకు స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్‌పీటీసి) ఎన్నికల్ని ఏప్రిల్ 6, 11 తేదీలలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది.

ఎన్నికల షెడ్యూలు

[మార్చు]
  • ఎన్నిక షెడ్యూలు ప్రకటన : 86/SEC-F2/2014, 03.03.2014[2]
  • నామినేషన్ దాఖలుకు చివరి తేదీ: 14.03.2014
  • నామినేషన్ ఉపసంహరణ తేదీ : 18.03.2014
  • ఎన్నికల తేదీ : మార్చి 30 2014
  • లెక్కింపు తేదీ : మే 12 2014

ఫలితాలు

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ పధిలో పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు తే.12.5.2014 న జరిగింది. కాబోయే రెండు తెలుగు రాష్ట్రాల పురపాలక ఎన్నికల ఫలితాలు సంచలనాత్మకంగా ఉన్నాయి. రాష్ట్రంలోని పది నగరపాలక సంస్థలు, 145 మున్సిపాలిటీల్లో వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు మే 5, 2013 న వెలవడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో చివరి స్థానిక ఎన్నికలు పూర్తిగా భిన్నమైన రాజకీయ వాతావరణంలో జరగడంతో ఫలితాలు కూడా విభిన్నంగానే ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు, సీమాంధ్ర ప్రజలు టీడీపీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టారు. సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. వైఎస్ఆర్‌సీపీ రెండవ స్థానంలో నిలిచింది. తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య జరిగిన పోటీలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. అందరూ ఊహిస్తున్నట్లుగానే సీమాంధ్రలో కాంగ్రెస్ ఒక్క మున్సిపాలిటీని కూడా సొంతం చేసుకోలేకపోయింది. కాగా తెలంగాణలో టీడీపీ పది స్థానాలను సాధించి రెండో స్థానంలో నిలిచింది.

పార్టీల వారీగా పొందిన పురపాలక సంఘాలు

[మార్చు]
ప్రాంతం కాంగ్రెస్ తెలుగుదేశం వై.కా.పా తె.రా.స భా.జ.పా హంగ్ ఇతరులు
సీమాంధ్ర 62 17 - - 13 -
తెలంగాణ 21 3 - 8 2 18 1

ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో

[మార్చు]
శ్రీకాకుళం జిల్లాలో పార్టీల బలాబలాలు
విజయనగరం జిల్లాలో పార్టీల బలాబలాలు
విశాఖపట్నం జిల్లాలో పార్టీల బలాబలాలు
తూర్పు గోదావరి జిల్లాలో పార్టీల బలాబలాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీల బలాబలాలు
కృష్ణా జిల్లాలో పార్టీల బలాబలాలు
గుంటూరు జిల్లాలో పార్టీల బలాబలాలు
ప్రకాశం జిల్లాలో పార్టీల బలాబలాలు
నెల్లూరు జిల్లాలో పార్టీల బలాబలాలు
చిత్తూరు జిల్లాలో పార్టీల బలాబలాలు
కడప జిల్లాలో పార్టీల బలాబలాలు
కర్నూలు జిల్లాలో పార్టీల బలాబలాలు
అనంతపురం జిల్లాలో పార్టీల బలాబలాలు
సీమాంధ్రలో పార్టీల బలాబలాలు
జిల్లాలు కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం పార్టీ వై.కా.పా వామపక్షాలు ఇతరులు
శ్రీకాకుళం జిల్లా
 ఆమదాలవలస (23) 3 8 10    2
 ఇచ్చాపురం (23) 8 13 2
 పలాస (25) 17 8
 పాలకొండ (20) 12 3 5
విజయనగరం జిల్లా
 విజయనగరం (40) 5 32 2 1
 బొబ్బిలి (30) 2 13 15
 పార్వతీపురం (30) 14 10 6
 సాలూరు (29) 3 17 9
విశాఖపట్నం జిల్లా
నర్సీపట్నం (27) 1 19 5 1 1
 యలమంచిలి (24) 21 3
తూర్పుగోదావరి జిల్లా
 అమలాపురం (30) 22 7 1
 తుని (30) 2 17 11
 సామర్లకోట (30) 24 6
 రామచంద్రాపురం (27) 17 9 1
పిఠాపురం (30) 23 6 1
 మండపేట (29) 18 11
 పెద్దాపురం (28) 21 4 1 2
గొల్లప్రోలు (20)    10 10   
ముమ్ముడివరం (20) 8 8 4
 ఏలేశ్వరం (20) 1 10 9
పశ్చిమ గోదావరి జిల్లా
 భీమవరం (39) 26 11 2
 పాలకొల్లు (31) 24 6 1
 తాడేపల్లిగూడెం (35) 24 7 4
 నర్సాపురం (31) 14 14 3
నిడదవోలు (28) 18 9 1
 తణుకు (34) 30    4
 కొవ్వూరు (23) 22 1
 జంగారెడ్డిగూడెం (20) 16 2 2
కృష్ణాజిల్లా
 మచిలీపట్నం (42) 1 29 11
గుడివాడ (36) 15 21
 జగ్గయ్యపేట (27) 10 16 1
 నూజివీడు (30) 7 22 1
పెడన (23) 12 11
 తిరుపూరు (20) 12 7 1
 ఉయ్యూరు (20)    10 8 2
 నందిగామ (20) 10 7 3
గుంటూరు జిల్లా
 తెనాలి (40) 1 31 8
 నరసరావుపేట (34) 18 15 1   
 బాపట్ల (34) 1 19 13 1
 రేపల్లె (28) 3 16 9
 చిలకలూరి పేట (34) 18 15 1
 పొన్నూరు (31) 18 13
 మంగళగిరి (32) 1 14 8 6 3
 మాచర్ల (29) 20 8 1
 సత్తెనపల్లి (30) 1 15 13    1
వినుకొండ (26) 3 6 8 4 5
పిదుగురాళ్ళ (30) 18 12
తాడేపల్లి (23) 1 3 18 1
ప్రకాశం జిల్లా
చీరాల (33) 12 15 6
 మార్కాపురం (32) 19 10 2 1
 అద్దంకి (20) 15 5
 గిద్దలూరు (20) 11 9
 చీమకుర్తి (20) 12 8
కనిగిరి (20) 11 8 1
నెల్లూరు జిల్లా
 గూడూరు (33) 16 15 1 1
 కావలి (40) 2 16 20 2
వెంకటగిరి (25) 1 21 2 1
 ఆత్మకూరు (23) 8 4 10 1
 సూళ్ళూరుపేట (23) 2 9 10 2
 నాయుడుపేట (20) 14 6
చిత్తూరు జిల్లా
మదనపల్లె (35) 16 17 2
శ్రీకాళహస్తి (35) 4 18 11 2
పుంగనూరు (24) 7 17
 పలమనేరు (24) 6 17 1
 నగరి (27) 13 11 3
పుత్తూరు (24) 13 11
కడప జిల్లా
ప్రొద్దుటూరు (40) 22 18
 పులివెందుల (26) 25 1
జమ్మలమడుగు (20) 11 9
 రాయచోటి (31) 12 18 1
బద్వేల్ (26) 1 23 2
మైదుకూరు (23) 17 5 1
ఎర్రగుంట్ల (20) 2 18
కర్నూలు జిల్లా
 నంధ్యాల (42) 29 13
ఆదోని (41) 14 21 6
ఎమ్మిగనూరు (33) 25 8
డోన్ (20) 13 7
ఆత్మకూరు (20) 9 11
ఆళ్ళగడ్డ (20) 2 18
నందికొట్కూరు (23)    5 15 3
 గూడూరు (20) 2 6 11 1
అనంతపురం జిల్లా
హిందూపురం (38) 19 16 1 2
గుంతకల్లు (37) 22 12 2 1
 తాడిపత్రి (34) 32 2
 ధర్మవరం (40) 26 11 1 2
కదిరి (36) 22 14
రాయదుర్గం (31) 27 3 1
మడకశిర (20) 2 16 1 1
 పుట్టపర్తి (20) 1 15 4
గుత్తి (24) 8 11 5
పామిడి (20) 10 5 5
 కళ్యాణదుర్గం (23) 1 20 1 1

తెలంగాణ ప్రాంతంలో

[మార్చు]
ఆదిలాబాదు జిల్లాలో పార్టీల బలాబలాలు
కరీంనగర్ జిల్లాలో పార్టీల బలాబలాలు
వరంగల్ జిల్లాలో పార్టీల బలాబలాలు
ఖమ్మం జిల్లాలో పార్టీల బలాబలాలు
నల్గొండ జిల్లాలో పార్టీల బలాబలాలు
నజామాబాద్ జిల్లాలో పార్టీల బలాబలాలు
మెదక్ జిల్లాలో పార్టీల బలాబలాలు
రంగారెడ్డి జిల్లాలో పార్టీల బలాబలాలు
మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీల బలాబలాలు
తెలంగాణ లో పార్టీల బలాబలాలు
జిల్లాలు కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి వామపక్షాలు ఇతరులు
ఆదిలాబాదు జిల్లా
ఆదిలాబాదు (36) 7    15    14
బెల్లంపల్లి (34) 14 5 10 2 3
 మంచిర్యాల (32) 18 14
 నిర్మల్ (36) 5 3 28
 కాగజ్ నగర్ (28) 5 13 10
భైంసా (23) 2 2    19
కరీంనగర్ జిల్లా
 జగిత్యాల (38) 24 5 5 4
సిరిసిల్ల (33) 10 1 15 7
 కోరుట్ల (31) 13 8 10
మెట్ పల్లి (24) 9 12 3
 జమ్మికుంట (20) 1 14 5
వేములవాడ (20) 3 3 14
పెద్దపల్లి (20) 6 3 6 5
హుజూరాబాద్ (20) 6 1 9 4
హుస్నాబాద్ (20) 6 11 3
వరంగల్ జిల్లా
జనగామ (28) 14 6 1 7
పరకాల (20) 6 8 6
 నర్సంపేట (20) 12 1 6 1
మహబూబాబాద్ (28) 7 3 7 8 3
 భూపాలపల్లి (20) 7 2 7 1 3
ఖమ్మం జిల్లా
 కొత్తగూడెం (33) 12 4 1 8 8
 ఇల్లందు (24) 8 4 3 5 4
 సత్తుపల్లి (20) 17 3
మధిర (20) 4 6 6 4
నల్గొండ జిల్లా
నల్గొండ (40) 22 4 2 2 10
 సూర్యాపేట (34) 9 12 4 3 6
 మిర్యాలగూడ (36) 30 2 2 2
 భువనగిరి (30) 8 7 1 14
కోదాడ (30) 14 13 3
హుజూర్ నగర్ (20) 10 3 3 4
దేవరకొండ (20) 11 3 3 3
నిజామాబాద్ జిల్లా
కామారెడ్డి (33) 17 5    11
బోధన్ (35) 15 1 9 10
అర్మూర్ (23) 11 1 10 1
మెదక్ జిల్లా
సంగారెడ్డి (31) 10 2 1 18
 సదాశివపేట (23) 13 2 5 3
 జహీరాబాద్ (24) 12 3 5 4
 మెదక్ (27) 6 5 11 5
గజ్వేల్ (20) 1 10 9
ఆందోల్-జోగిపేట (20) 13 2 4 1
రంగారెడ్డి జిల్లా
 తాండూర్ (31) 8 2 10 11
 వికారాబాద్ (28) 14 7 5 2
 పెద్ద అంబర్ పేట (20) 6 9 1 4
బడంగ్ పేట (20) 15 1 4
ఇబ్రహీం పట్నం (20) 4 10 1 0 5
మహబూబ్ నగర్ జిల్లా
మహబూబ్ నగర్ (41) 14 3 7 17
గద్వాల్ (33) 23 9 1
 నారాయణపేట (23) 3 3 2 15
 వనపర్తి (26) 7 8 2 9
 షాద్ నగర్ (23) 15 1 7
నాగర్ కర్నూలు (20) 6 6 8
ఐజ (20) 4 16
 కల్వకుర్తి (20) 6 5 9

జిల్లాల వారీగా మొత్తం ఫలితాలు

[మార్చు]

సీమాంధ్ర ప్రాంతంలో

[మార్చు]

సీమాంధ్రలో పార్టీల బలాబలాలు

  కాంగ్రెస్ (2.06%)
  తెలుగుదేశం (55.87%)
  వై.కా.పా (36.34%)
  వామపక్షాలు (0.81%)
  ఇతరులు (4.92%)
జిల్లాలు కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం పార్టీ వై.కా.పా వామపక్షాలు ఇతరులు
శ్రీకాకుళం జిల్లా 3 45 34 0 9
విజయనగరం జిల్లా 10 77 36 0 6
విశాఖపట్నం జిల్లా 1 40 8 1 1
తూర్పు గోదావరి జిల్లా 3 170 81 1 9
పశ్చిమ గోదావరి జిల్లా 0 174 49 0 18
కృష్ణా జిల్లా 1 105 103 1 7
గుంటూరు జిల్లా 11 196 140 11 13
ప్రకాశం జిల్లా 0 69 57 2 17
నెల్లూరు జిల్లా 13 80 63 1 7
చిత్తూరు జిల్లా 4 73 84 0 8
కడప జిల్లా 1 87 95 0 3
కర్నూలు జిల్లా 2 103 104    10
అనంతపురం జిల్లా 4 217 80 4 18
మొత్తం 53 1436 934 21 126

తెలంగాణా ప్రాంతంలో

[మార్చు]

తెలంగాణ లో పార్టీల బలాబలాలు

  కాంగ్రెస్ (37.6%)
  తెలంగాణ రాష్ట్ర సమితి (22.4%)
  తెలుగుదేశం (11.5%)
  వామపక్షాలు (3.14%)
  ఇతరులు (25.36%)
జిల్లాలు కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి వామపక్షాలు ఇతరులు
ఆదిలాబాద్ జిల్లా 51 5 57 2 74
కరీం నగర్ జిల్లా 78 10 83 0 55
వరంగల్ జిల్లా 46 6 34 10 20
ఖమ్మం జిల్లా 24 31 4 19 19
నల్గొండ జిల్లా 104 42 11 11 42
నిజామాబాద్ జిల్లా 43 2 24 0 22
మెదక్ జిల్లా 55 22 36 1 31
రంగారెడ్డి జిల్లా 47 29 16 1 26
మహబూబ్ నగర్ 78 14 48 0 66
మొత్తం 526 161 313 44 355

నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు

[మార్చు]
నగరపాలక సంస్థ రాజమండ్రి ఏలూరు విజయవాడ నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కరీంనగర్ రామగుండం నిజామాబాద్
కాంగ్రెస్ 1 0 0 1 0 0 0 14 19 16
తెలుగుదేశం పార్టీ 34 41 37 19 36 8 32 1 0 0
వై.కా.పా 8 8 19 30 4 42 11 - - -
తెలంగాణ రాష్ట్ర సమితి - - - - - - - 24 14 10
ఇతరులు 7 1 3 4 10 - 7 11 17 24
మొత్తం 50 50 59 54 50 50 50 50 50 50

విశ్లేషణ

[మార్చు]

రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో జనాదరణ తుడిచిపెట్టుకుపోగా, మొదట్లో తెలంగాణలో టీఆర్ఎస్ కంటే అధికంగా ఉన్న మాట వాస్తవం. తెలంగాణ విషయంలో రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచేందుకు టీడీపీ తీసుకున్న వైఖరి కారణంగా ఆ పార్టీకి ప్రజాదరణ బాగా తగ్గింది. స్థానిక ఎన్నికల అనంతరం ఏర్పడిన రాజకీయ వాతావరణంలో పార్టీల బలాబలాల్లో తేడాలో వచ్చాయి. కాంగ్రె స్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనతో తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి కాంగ్రెస్ కంటే మెరుగుపడింది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2021-03-15. Retrieved 2024-03-06.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2024-03-07. Retrieved 2024-03-06.

ఇతర లింకులు

[మార్చు]