గీట్ల ముకుందారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గీట్ల ముకుందారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గానికి మాజీ శాసన సభ్యులు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లో మే 15 1944 న జన్మించారు[2]. ఆయన పెద్దపల్లి నియోజక వర్గం నుంచి మూడుసార్లు శాసన సభ్యులుగా గెలుపొందారు. 1970లో రాజకీయ ప్రవేశం చేసిన గీట్ల కూనారం గ్రామం నుంచి 1970, 1976లో రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం 1981లో స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి సమితి అధ్యక్షుడిగా విజయకేతనం ఎగురవేశారు. ఎన్టీఆర్‌ ప్రభంజనం వీస్తున్న 1983లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పెద్ద పల్లి నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా పోటీ చేసి గోనె ప్రకాశరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మొదటిసారి విజయం సాధించి అప్పటీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అభిమానాన్ని చూరగొన్నారు. అప్పటి నుంచి ఆయన ఏడుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా, ఒకసారి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయగా ఆయనను మూడు సార్లు మాత్రమే విజయం వరించింది.[3] ఆయన సతీమణి కమలారెడ్డి. ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె.

మరణం[మార్చు]

ఆయన క్యాన్సర్తో సికింద్రాబాద్ యశోధ అస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 19 2014 న మరణించారు.[4]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]