టి. దామోదర్ రెడ్డి
టి. దామోదర్ రెడ్డి | |||
ఎం. టి. దామోదర్ రెడ్డి | |||
నియోజకవర్గం | నల్గొండ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అజ్మాపూర్, పెద్ద అడిసర్లపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ | 1939 జూలై 10||
మరణం | 2024 మే 13 సంతోష్ నగర్, హైదరాబాద్ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | చంద్రారెడ్డి | ||
జీవిత భాగస్వామి | సులోచన | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
మతం | హిందూ, భారతీయ |
తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1980 నుండి 1984 వరకు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]
జననం, విద్య
[మార్చు]దామోదర్ రెడ్డి 1939, జూలై 10న చంద్రారెడ్డి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, పెద్ద అడిసర్లపల్లి మండలంలోని అజ్మాపూర్ గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ నుండి బిఎస్సీ ఎల్.ఎల్.బి. చదివాడు. న్యాయవాదిగా కూడా పనిచేశాడు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]దామోదర్ రెడ్డి 1959, మే 10న సులోచనతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటిచేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షంపై 53,669 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4]
మరణం
[మార్చు]తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతూ 2024 మే 13న హైదరాబాద్ సంతోష్ నగర్‌లోని ఆయన స్వగృహంలో మరణించాడు.[5][6]
పదవులు
[మార్చు]- 1969-1971: తెలంగాణ ప్రజా సమితి సభ్యుడు
- 1970-1976: దేవరకొండ పంచాయతీ సమితి వైస్ ప్రెసిడెంట్
- 1978: దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
మూలాలు
[మార్చు]- ↑ "7th Loksabha Members". www.loksabha.nic.in. Archived from the original on 2021-10-01. Retrieved 2021-11-10.
- ↑ "Members Bioprofile". www.loksabhaph.nic.in. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
- ↑ "Shri T. Damodar Reddy MP biodata Nalgonda | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-28. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
- ↑ "T. DAMODAR REDDY - NALGONDA - Lok Sabha Election Results 1980". www.electiontak.in. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
- ↑ Andhrajyothy (14 May 2024). "నల్లగొండ మాజీ ఎంపీ దామోదర్‌రెడ్డి మృతి". Archived from the original on 14 May 2024. Retrieved 14 May 2024.
- ↑ EENADU (14 May 2024). "మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి కన్నుమూత". Archived from the original on 14 May 2024. Retrieved 14 May 2024.