కంచర్ల రామకృష్ణారెడ్డి
కంచర్ల రామకృష్ణారెడ్డి | |||
కంచర్ల రామకృష్ణారెడ్డి | |||
పదవీ కాలం 1971 - 1977 | |||
నియోజకవర్గం | నల్గొండ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మునుగోడు, మునుగోడు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ | 1918 మార్చి 16||
రాజకీయ పార్టీ | తెలంగాణ ప్రజా సమితి | ||
తల్లిదండ్రులు | రామారెడ్డి | ||
జీవిత భాగస్వామి | ద్రౌపతి దేవి | ||
సంతానం | ఒక కుమారుడు | ||
మతం | హిందూ, భారతీయ |
కంచర్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. తెలంగాణ ప్రజా సమితి తరపున 1971 నుండి 1977 వరకు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]
జననం, విద్య
[మార్చు]రామకృష్ణారెడ్డి 1918, మార్చి 16న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, మునుగోడులో జన్మించాడు. తండ్రిపేరు రామారెడ్డి. హైదరాబాద్ హైకోర్టు నుండి లీగల్ డిప్లొమా (1వ గ్రేడ్ ప్లీడర్‌షిప్) పొందాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రామకృష్ణారెడ్డికి ద్రౌపతి దేవితో వివాహం జరిగింది. ఈ దంపతులు ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]కాంగ్రెస్ పార్టీతో అనుబంధమున్న రామకృష్ణారెడ్డి తరువాత తెలంగాణ ప్రజా సమితి పార్టీలో చేరాడు. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టిపిఎస్ పార్టీ నుండి పోటిచేసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెదిరే నరసింహారెడ్డిపై 5,398 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4]
సామాజిక సేవ
[మార్చు]- విద్య, సామాజిక సేవను ప్రోత్సహించడంకోసం మునుగోడు విద్యా కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు.
- భూదానోద్యమంకు 1/4వ వంతు ఆస్తిని విరాళంగా ఇచ్చాడు.
- జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణలోని దేశ్‌ముఖగిరిని వదులుకున్న మొదటి దేశ్‌ముఖ్ గా నిలిచాడు.[5]
నిర్వహించిన పదవులు
[మార్చు]- కార్యదర్శి, నల్గొండ తాలూకా కాంగ్రెస్ కమిటీ
- అధ్యక్షుడు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ
- కార్యనిర్వాహక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, హైదరాబాద్
- అధ్యక్షుడు, తెలంగాణ ప్రజాసమితి, నల్గొండ జిల్లా
- అధ్యక్షుడు, మునుగోడు పంచాయతీ సమితి
- అధ్యక్షుడు, నల్గొండ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ
- చైర్మన్, నల్గొండ జిల్లా పరిషత్
మూలాలు
[మార్చు]- ↑ "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-10-04. Retrieved 2021-11-17.
- ↑ Staff (2019-04-01). "లోక్‌సభ ఎన్నికలు 2019: నల్గొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి". www.telugu.oneindia.com. Archived from the original on 2021-11-12. Retrieved 2021-11-17.
- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2020-11-29. Retrieved 2021-11-17.
- ↑ "Nalgonda Lok Sabha Election Result - Parliamentary Constituency". resultuniversity.com. Archived from the original on 2021-11-12. Retrieved 2021-11-17.
- ↑ "Shri Kancherla Ramkrishna Reddy MP biodata Nalgonda | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-28. Archived from the original on 2021-11-17. Retrieved 2021-11-17.