అబ్దుల్ లతీఫ్
స్వరూపం
అబ్దుల్ లతీఫ్ | |||
అబ్దుల్ లతీఫ్ | |||
నియోజకవర్గం | నల్గొండ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1919 గుడిబండ, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | మహమూద్ ఆలీ | ||
జీవిత భాగస్వామి | సయ్యదా అక్తర్ జహాన్ | ||
సంతానం | ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు |
అబ్దుల్ లతీఫ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు.[1] భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1977 నుండి 1980 వరకు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[2][3]
జననం, విద్య
[మార్చు]అబ్దుల్ లతీఫ్ 1919లో మహమూద్ ఆలీ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో జన్మించాడు. మెట్రిక్యులేషన్, లా కోర్సులో ఉత్తీర్ణత సాధించాడు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అబ్దుల్ లతీఫ్ కు సయ్యదా అక్తర్ జహాన్ తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు.
రాజకీయ జీవితం
[మార్చు]1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటిచేసి 2,08,892 ఓట్లు సాధించి గెలుపొందాడు.[5]
నిర్వహించిన పదవులు
[మార్చు]- వైస్ ప్రెసిడెంట్, నల్గొం జిల్లా కాంగ్రెస్ కమిటీ
- అధ్యక్షుడు, అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషనల్ సొసైటీ, నల్గొండ
- అధ్యక్షుడు, నల్గొండ జిల్లా అంజుమన్-తారకి ఉర్దూ శాఖ
- లైఫ్ మెంబర్, నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ
- ఎంపీల జీతాలు- అలవెన్సులపై జాయింట్ కమిటీ సభ్యుడు
మూలాలు
[మార్చు]- ↑ "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2021-11-12.
- ↑ "6th Loksabha Members". www.loksabha.nic.in. Archived from the original on 2021-10-03. Retrieved 2021-11-12.
- ↑ Staff (2019-04-01). "లోక్‌సభ ఎన్నికలు 2019: నల్గొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి". www.telugu.oneindia.com. Archived from the original on 2021-11-12. Retrieved 2021-11-12.
- ↑ "Members Bioprofile". www.loksabhaph.nic.in. Archived from the original on 2021-10-12. Retrieved 2021-11-12.
- ↑ "Nalgonda Lok Sabha Election Result - Parliamentary Constituency". www.resultuniversity.com. Archived from the original on 2021-11-07. Retrieved 2021-11-12.