ఎం. రఘుమారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. రఘుమారెడ్డి
ఎం. రఘుమారెడ్డి

ఎం. రఘుమారెడ్డి


నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1964-05-24) 1964 మే 24 (వయసు 60)
మల్లారెడ్డిపల్లి, చింతపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నర్సింహారెడ్డి
జీవిత భాగస్వామి మణి
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
మతం హిందూ, భారతీయ

మల్‌రెడ్డి రఘుమారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. తెలుగుదేశం పార్టీ తరపున 1984 నుండి 1989 వరకు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

జననం, విద్య

[మార్చు]

రఘుమారెడ్డి 1946, జూన్ 27న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రిపేరు నర్సింహారెడ్డి. అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ పూర్తిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రఘుమారెడ్డికి 1964, మే 24న మణితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ఉద్యోగ వివరాలు

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ అధికారిగా పనిచేశాడు. వ్యవసాయ అధికారుల సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన రఘుమారెడ్డి, 1984లో జరిగిన 8వ లోక్‌సభ ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి గెలుపొందాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "8th Loksabha Members". www.loksabha.nic.in. Archived from the original on 2021-09-29. Retrieved 2021-11-08.
  2. Sakshi (14 October 2023). "ఎమ్మెల్యేలయ్యారు.. ఎంపీలూ అయ్యారు!". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  3. "Loksabha Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  4. "Shri M. Raghuma Reddy | ENTRANCEINDIA" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  5. "ఎమ్మెల్యే అయ్యారు.. ఎంపీ అయ్యారు !". Sakshi. 2018-11-05. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.