ఆర్. సురేంద్రరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్. సురేంద్రరెడ్డి
ఆర్. సురేంద్రరెడ్డి

ఆర్. సురేంద్రరెడ్డి


పదవీ కాలం
1967-1971, 1989-1996
ముందు బకర్ అలీ మిర్జా
తరువాత అజ్మీరా చందులాల్
నియోజకవర్గం వరంగల్ లోకసభ నియోజకవర్గం

పదవీ కాలం
1962-1967
ముందు ఇటికాల మధుసూదనరావు
తరువాత పోరిక బలరాం నాయక్
నియోజకవర్గం మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1931-10-10)1931 అక్టోబరు 10
ఖమ్మం, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి జయమాల
సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
మతం హిందూ మతం

ఆర్. సురేంద్రరెడ్డి (జననం 10 అక్టోబరు 1931), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 3వ లోక్‌సభ, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 4వ, 9వ, 10వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్య[మార్చు]

సురేంద్రరెడ్డి 1931, అక్టోబరు 10న తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలో జన్మించాడు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో చదువుకున్నాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

రవీంద్రరెడ్డికి 1956, నవంబరు 28న జయమాలతో వివాహం జరిగింది. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయదారుడిగా కొంతకాలం పనిచేసి, పారిశ్రామికవేత్తగా ఎదిగాడు.

రాజకీయ జీవితం[మార్చు]

భారత జాతీయ కాంగ్రెస్ 1965లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 3వ లోక్‌సభకు,[3] 1967లో వరంగల్ లోకసభ నియోజకవర్గం నుండి 4వ లోక్‌సభకు[4] ఎన్నికయ్యాడు. 1974 నుండి 1979 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1989-1991 మధ్యకాలంలో వరంగల్ లోకసభ నియోజకవర్గం నుండి 9వ లోక్‌సభ,[5] 1991-1996 మధ్యకాలంలో 10వ లోకసభకు[6] పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[7]

నిర్వర్తించిన పదవులు[మార్చు]

  • 1980-1982: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి
  • 1988: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్
  • 1990: పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీ సభ్యుడు
  • 1990: పరిశ్రమల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు

ఇతర వివరాలు[మార్చు]

క్యూబా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, మెక్సికో, యుఎస్ఏ, సింగపూర్‌, హాంకాంగ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, థాయిలాండ్, న్యూజిలాండ్, టర్కీ దేశాలు సందర్శించాడు.

మూలాలు[మార్చు]

  1. "Lok Sabha Members Bioprofile-". Retrieved 13 December 2017.
  2. "Members Bioprofile (Tenth Lok Sabha Members Bioprofile REDDY, SHRI SURENDRA)". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.
  3. "Third Lok Sabha State wise Details Andhra Pradesh". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.
  4. "Fourth Lok Sabha State wise Details Andhra Pradesh". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.
  5. "Ninth Lok Sabha State wise Details Andhra Pradesh". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.
  6. "Tenth Lok Sabha State wise Details Andhra Pradesh". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.
  7. "Shri Surendra Reddy MP biodata Warangal | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-28. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.