ప్రపంచ తెలుగు మహాసభలు

వికీపీడియా నుండి
(ప్రపంచ తెలుగు మహాసభ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెలుగు భాష పోస్టు స్టాంపు

ప్రపంచ తెలుగు మహాసభలు [1] మొదటిసారిగా హైదరాబాదులో 1975 నిర్వహించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమైన పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది.

జాబితా[మార్చు]

మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు (1975)[మార్చు]

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు (1981)[మార్చు]

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు (1990)[మార్చు]

మారిషస్ లోమూడవ ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబరు 8వ తేదీ నుండి మూడు రోజుల పాటు వైభవంగా జరిగాయి. మారిషస్ ప్రభుత్వ సహకారంతో అక్కడి తెలుగు కల్చరల్ ట్రస్టు, తెలుగు విశ్వవిద్యాలయం కలిసి, ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రంలో వీటిని నిర్వహించారు.[2]

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (2012)[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఖర్చుతో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు [3] డిసెంబరు 27,28, 29, 2012లో తిరుపతిలో జరప నిశ్చయించింది. అయితే తెలుగు భాషోద్యమ సమాఖ్య, సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించ నిర్ణయించాయి [4]

చిహ్నం[మార్చు]

ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం తెలుగుజాతిని వివిధ కొణాలలో ఆవిష్కరిస్తున్నది. ఇందులోని రెండు సర్పాలు తెలుగువారి విజ్ఞానానికి సంకేతాలు. నౌక శాతవాహన కాలంలోనే ఆంధ్రుల నౌకా నైపుణ్యానికి చిహ్నం. పూర్ణకుంభం బౌద్ధయుగంలోను, ఓరుగల్లు ద్వారం కాకతీయయుగంలోను తెలుగువారి ప్రాభవాన్ని తెలియజేస్తుంది. దీనిలోని హంస క్షీరనీర న్యాయానికి, భారతీయుల ఆత్మతత్త్వానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, రాజధాని హైదరాబాదు నగరం భారతదేశపు రేఖాచిత్రంలో నిక్షిప్తమై తెలుగుజాతి మనుగడను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశపు త్రిభాషా సూత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీషు లిపులలో అక్షరరూపం దాల్చింది.

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017[మార్చు]

తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ప్రపంచ తెలుగు మహాసభలు - 2017ను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది.

ఇతర సభలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ప్రపంచ తెలుగుమహాసభల జాలస్థలి
  2. మారిషస్ లో తెలుగు వైభవం, ఆంధ్రప్రదేశ్, జనవరి 2012 సంచికలో కిలారు ముద్దుకృష్ణ వ్యాసం ఆధారంగా.
  3. తెలుగుకి పునరుజ్జీవనం, సేవ వార్త ఆగష్టు 28, 2012[permanent dead link]
  4. "తెలుగు మహాసభలకు ఇదా సమయం? ఆంధ్రభూమి వార్త 2-12-2012". మూలం నుండి 2012-12-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2012-12-08. Cite web requires |website= (help)
  5. "ఐదవ ప్రపంచ తెలుగు మహాసభలు జాలస్థలి". మూలం నుండి 2009-08-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-08-15. Cite web requires |website= (help)