మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రపంచ తెలుగు మహాసభలను మొదటిసారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1975 సంవత్సరం నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగు భాషా, సంస్కృతుల అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1975ను తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా నిర్ణయించారు.[1] ఇవి ఉగాది పర్వదినాలలో ఏప్రిల్ 12 నుండి 18 వరకు లాల్ బహదూర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ప్రారంభసభకు మా తెలుగు తల్లికి మల్లె పూదండ ప్రార్థనగీతాన్ని పాడేందుకు లండన్ నుండి టంగుటూరి సూర్యకుమారిని ప్రత్యేకంగా పిలిపించారు. ఈ సభలకు ప్రతిరోజు సుమారు లక్ష మంది ప్రజలు వచ్చివుంటారని అంచనా.
సదస్సులు
[మార్చు]వివిధ సదస్సులు నాగార్జున పీఠంలో ప్రతిరోజు 8 గంటల చొప్పున దాదాపు 40 గంటల సేపు జరిగాయి. 28 వివిధ అంశాలకు చెందిన సుమారు 100 వ్యాసాలు సమర్పించబడ్డాయి. దాదాపు 1500 మంది ఈ గోష్ఠులలో పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
[మార్చు]శ్రీకృష్ణదేవరాయల దర్బారులో ప్రతిరాత్రి 10 గంటలసేపు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ప్రతిరోజు 12-15 దాకా మొత్తం సుమారు 100 కార్యక్రమాలు ఆహూతుల్ని అలరించాయి. ప్రతిరోజు సుమారు 2 లక్షల మంది ప్రజలు వీటిని తిలకించారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]వనరులు
[మార్చు]- తెలుగు అధికారభాష - వావిలాల గోపాలకృష్ణయ్య ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా అధికారభాషా కమిషన్ ప్రచురణ
- తెలుగు వాక్యం- చేకూరి రామారావు , 1975, ప్రపంచ తెలుగుమహాసభ ప్రచురణ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైద్రాబాదు
మూలాలు
[మార్చు]- ↑ రామానుజరావు, దేవులపల్లి (17 మార్చి 1975). తెలుగు నవల (ముందుమాట). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. p. iii. Retrieved 7 March 2015.