రామ్ నాయక్
రామ్ నాయక్ | |
---|---|
ఉత్తర ప్రదేశ్ 19వ గవర్నరు | |
In office 2014 జులై 22 – 2019 జులై 28 | |
ముఖ్యమంత్రి | అఖిలేష్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ |
అంతకు ముందు వారు | అజీజ్ ఖురేషి (తాత్కాలిక) |
తరువాత వారు | ఆనందిబెన్ పటేల్ |
పార్లమెంటు సభ్యుడు లోక్‌సభ | |
In office 1989–2004 | |
అంతకు ముందు వారు | అనూప్చంద్ షా |
తరువాత వారు | గోవింద అహుజా |
నియోజకవర్గం | ముంబై నార్త్ |
భారత రైల్వే మంత్రి | |
In office 6 ఆగస్టు 1999 – 12 అక్టోబరు 1999 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి |
అంతకు ముందు వారు | నితీష్ కుమార్ |
తరువాత వారు | మమతా బెనర్జీ |
పెట్రోలియం, సహజ వాయువు మంత్రి | |
In office 1999–2004 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి |
తరువాత వారు | మణిశంకర్ అయ్యర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | సాంగ్లీ, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1934 ఏప్రిల్ 16
జాతీయత | భారతీయ |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | కుందా నాయక్ |
సంతానం | 2 కుమార్తెలు |
నైపుణ్యం | రాజకీయ నాయకుడు[1] |
పురస్కారాలు | పద్మ భూషణ్ (2024) |
రామ్ నాయక్ (జననం:1934 ఏప్రిల్ 17) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ముంబై నార్త్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేసి, 2014 జూలై 22 నుండి 2019 జూలై 28 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]రామ్ నాయక్ 13వ లోక్‌సభ సభ్యుడు. అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో (1999-2004) చమురు, సహజ వాయువు మంత్రిగా ఉన్నారు. పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ప్రవేశపెట్టడంలో అతను కీలక పాత్ర పోషించారు. అతను 14వ లోక్‌సభకు ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరుపున ఎన్నికలకు బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు, కానీ భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద చేతిలో ఓడిపోయాడు
చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వాలంటీర్,[4] అతను న్యాయ పట్టా కలిగి ఉన్నాడు.[5] అతను 1964లో భారతీయ జనసంఘలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1969–1977 – ఆర్గనైజింగ్ సెక్రటరీ, భారతీయ జన్ సంఘ్ , ముంబై
- 1977–1978 – జనరల్ సెక్రటరీ, జనతా పార్టీ , ముంబై
- 1978–1989 – ఎమ్మెల్యే, మహారాష్ట్ర శాసనసభ (3 పర్యాయాలు)
- 1979–1980 – జనతా పార్టీ , ముంబై అధ్యక్షుడు
- 1980–1986 – ముంబై బీజేపీ అధ్యక్షుడు
- 1986–1989 – మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు
- 1989 – 9వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1991 - 10వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1999 – 13వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1999–2004 – కేంద్ర క్యాబినెట్ మంత్రి, పెట్రోలియం & సహజ వాయువు
- 2004 నుండి - బిజెపి ఆల్ ఇండియా డిసిప్లినరీ కమిటీ అధ్యక్షుడు
- 2014–2019 ఉత్తరప్రదేశ్ గవర్నర్
మూలాలు
[మార్చు]- ↑ "Ram Naik to be sworn-in as UP Governor on July 22". Timesofindia Journal. PTI. 18 July 2014. Retrieved 28 July 2018.
- ↑ "BJP veteran Ram Naik to take oath as UP Governor on 22nd July". News18 India. 17 July 2014. Retrieved 20 July 2018.
- ↑ "Former Petroleum Minister Ram Naik not to contest LS elections". Zeenews.india.com. PTI. 25 September 2013. Retrieved 20 July 2018.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 25 అక్టోబరు 2017. Retrieved 18 జూలై 2018.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "A Dialogue with Ram Naik | the Analyst World". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 2 నవంబరు 2015.