Jump to content

తవాంగ్ జిల్లా

వికీపీడియా నుండి
తవాంగ్ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ పటంలో తవాంగ్ జిల్లా స్థానం
అరుణాచల్ ప్రదేశ్ పటంలో తవాంగ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంతవాంగ్
విస్తీర్ణం
 • మొత్తం2,085 కి.మీ2 (805 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం49,950
 • జనసాంద్రత24/కి.మీ2 (62/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత60.6%[1]
 • లింగ నిష్పత్తి701[1]
Websiteఅధికారిక జాలస్థలి
సెలా వద్ద తవాంగ్ జిల్లా స్వాగత తోరణం

తవాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2] జిల్లా ముఖ్యపట్టణం తవాంగ్. చారిత్రాత్మకంగా ఈ ప్రాంతం టిబెట్కు చెందింది. కానీ, తవాంగ్ మాదేనంటూ చైనా, తైవాన్ లు ప్రకటించాయి.[3][4] ఈ జిల్లా దేశంలో అత్యల్ప జనసంఖ్య కలిన జిల్లాలలో 8వ స్థానంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

తవాంగ్ జిల్లాలో మొంప ప్రజలు అధికంగా ఉన్నారు. సా.శ.పూ 500-600 నుండి ఈ ప్రాంతం లోమన్ లేక మోన్యుల్ పాలనలో ఉండేది.[5] తరువాత మోన్యుల్ రాజ్యాన్ని పొరుగున ఉన్న టిబెట్, భూటాన్లు క్రమంగా వశపరచుకున్నాయి. 1681లో తవాంగ్ సామ్రాజ్యాన్ని " మెరాక్ లామా గ్యాస్టో " స్థాపించాడు. ఈ సామ్రాజ్య స్థాపనకు 5వ దలైలామా " న్గవాంగ్ లాబ్సాంగ్ గ్యాస్టో " ప్రోత్సహించాడు. 6వ దలైలామా త్సంగ్‌యంగ్ గ్యాస్టో తవాంగ్‌లో జన్మించాడు. తవాంగ్ అంటే "అశ్వం ఎన్నిక చేసిన భూమి" అన్న ఆసక్తికరమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది.

చారిత్రకంగా తవాంగ్ టిబెట్లో భాగంగా ఉంటూ వచ్చింది. 1914లో బ్రిటిష్ ఇండియా, టిబెట్‌ల మద్య సరిహద్దు నిర్ణయం జరిగింది. ఈ ఒప్పందం కారణంగా టిబెట్ తవాంగ్‌తో సహా కొన్ని ప్రాంతాలను బ్రిటన్ ప్రభుత్వానికి వదిలింది. ఈ ఒప్పందానికి చైనా వ్యతిరేకత తెలియజేసింది.[6] అయినప్పటికీ బ్రిటన్ తవాంగ్‌ను స్వాధీనపరచుకోలేదు. పన్ను వసూలును టిబెట్ కొనసాగిస్తూనే ఉంది. 1935లో టిబెట్ అనుమతి లేకుండా బ్రిటిష్ బొటానిస్ట్ " ఫ్రాంక్ కింగ్డన్ - వార్డ్ " సెలా పాస్‌ను దాటిన సమయంలో టిబెట్ ప్రభుత్వం ఆయనను కొంత సమయం ఖైదు చేసింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించింది. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి పరిశీలించి టిబెట్ తవాంగ్‌ను బ్రిటిష్ ఇండియాకు వదులుకున్న విషయం గ్రహించింది. అయినప్పటికీ సిమ్లా ఒప్పందాన్ని తవాంగ్‌ను ఒప్పగించడానికి టిబెట్ నిరాకరించింది. 1938లో అప్రమత్తమై తమ సార్వభౌమత్వాన్ని తెలియజేయడానికి టిబెట్ మీదకు కేప్టన్ జి.ఎస్ లైట్ ఫూట్ " నాయకత్వంలో చిన్న సైన్యాన్ని పంపింది.[7] లైట్ ఫూట్ రాయభారం సుముఖమైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ భూసంబంధ మార్పులు ఏమీ జరగలేదు. 1941 లో జపాన్ యుద్ధం ఆరంభించిన తరువాత అస్సాం ప్రభుత్వం తమ ఆధీనంలో ఉన్న ఈశాన్యభూభాగం సరిహద్దుల విషయంలో జాగరూకత వహించి సరిహద్దులను సరిచూసుకుంది. తరువాత అదే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా మారింది. 1944 లో పి.ఎం మిల్స్ రేంజర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత అధికారిక సరిహద్దులను తవాంగ్ వరకు విస్తరించి, టిబెట్ పన్నువసూలుదారులను వెనుకకు పంపాడు.[8] స్వాతంత్ర్యం తరువాత కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. 1950 లో చైనా టిబెట్ ను స్వాధీనం చేసుకుంది. తరువాత అస్సాం ప్రభుత్వం తవాంగ్ మార్గంలో ఉన్న మిగిలిన టిబెటన్లను పంపి ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.[9][10] 1962 సినో- ఇండియన్ యుద్ధంలో తవాంగ్ ప్రాంతాన్ని చైనా సైన్యాలు స్వాధీనం చేసుకున్నాయి. అయినప్పటికీ చైనా సైన్యం తమంతటతామే తవాంగ్‌ను వదిలి వెళ్ళాయి.[11]

1989 లో వెస్ట్ కమెంగ్ జిల్లా నుండి కొంతభాగం వేరుచేసి తవాంగ్ జిల్లా రూపుదిద్దబడింది.[12]

దలైలామా విజయం

[మార్చు]

1959 లో ప్రస్తుత దలైలామా (14 వ దలైలామా) టిబెట్ నుండి పారిపోయి మార్చి 30న ఇండియాలోకి ప్రవేశించాడు. దలైలామా అస్సాం లోని తేజ్పూర్ వెళ్ళే దారిలో కొన్ని రోజులు తవాంగ్ ఆరామంలో నివసించాడు.[13]2003 లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ లో ఒక భాగమని చెప్పాడు.[14]2009 లో నవంబరు 8న దలైలామా తవాంగ్‌కు వెళ్ళాడు. అతను ఒక కార్యక్రమంలో చేసిన మత ప్రసంగానికి పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్‌ల నుండి దాదాపు 30,000 మంది హాజరయ్యారు.[15]

భౌగోళికం

[మార్చు]
మేఘాలు ఏర్పడిన నేపథ్యంలో తవాంగ్ పట్టణ దృశ్యచిత్రం.

తవాంగ్ జిల్లా వైశాల్యం 2,172 చ.కి.మీ.[16] జిల్లా 27° 45’ ఉత్తర ఆక్షాంశం, 90° 15’ తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. ఇది టిబెట్ కు దక్షిణంగా ఉంది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 6000-22000 ఎత్తులో ఉంటుంది.ఆహ్లాదకరంగా ఉండే దిగువ ప్రాంతాలలో మాత్రమే ప్రజల ఆవాసాలు ఉన్నాయి. తవాంగ్ జిల్లా పశ్చిమ కమెంగ్ జిల్లాలో కొంతభాగం వేరుచేయడం ద్వారా ఏర్పడింది. జిల్లా తూర్పు, దక్షిణ సరిహద్దుల్లో పశ్చిమ కమెంగ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో భూటాన్, ఉత్తర సరిహద్దులో టిబెట్ ఉన్నాయి. జిల్లా జనసంఖ్య 38,924. వీరిలో 75% మొంపా, భొటియా, ఆది మొదలైన జాతులకు చెందిన గిరిజనులున్నారు.[17] సరిహద్దు జిల్లాగా తవాంగ్ జిల్లాలో సైకులు భారీగా కనిపిస్తుంటారు. శీతాకాలంలో తవాంగ్‌జిల్లాలో హిమపాతం సంభవిస్తుంది.

జనాభా గణాంకాలు (2011)

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో మొత్తం జనాభా 49,977. వీరిలో 29,151 మంది పురుషులు కాగా, 20,826 మంది స్త్రీలు ఉన్నారు. జిల్లాలో మొత్తం 10,062 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.[18] జిల్లా సగటు లింగ నిష్పత్

జిల్లా మొత్తం జనాభాలో 22.4% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 77.6% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 90.9% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 49.1% ఉంది. పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 340 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 865 ఉంది..

జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5788, ఇది మొత్తం జనాభాలో 12%గా ఉంది. 0-6 ఏళ్లలోపు మగ పిల్లలు 2914 మంది ఉండగా, ఆడ పిల్లలు 2874 మంది ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 986, ఇది తవాంగ్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (714) కంటే ఎక్కువ.

జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 59%. పురుషుల అక్షరాస్యత రేటు 60.79%, స్త్రీల అక్షరాస్యత రేటు 40.11%.

జిల్లాలో మొంపా ప్రజలు అధికంగా ఉన్నారు. జిల్లాలో 163 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో స్వల్పసంఖ్యలో టిబెటన్లు ఉన్నారు. జిల్లా పశ్చిమ, ఉత్తర భూభాగంలో స్వల్పంగా తగ్పా ప్రజలు నివసిస్తున్నారు.[19][20][21]

పాలనా విభాగాలు

[మార్చు]

విభాగాలు

[మార్చు]
  • తవాంగ్ జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- తవాంగ్, లుమ్లా, జాంగ్.

ఉప విభాగాలు

[మార్చు]
  • తవాంగ్ ఉపవిభాగం 2 అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడింది:-తవాంగ్, కిట్పి.
  • లుమ్లా ఉపవిభాగం 4 అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడింది:- బొంగ్ఖర్, డుడంఘర్, లుమ్లా, జెమితంగ్.
  • జంగ్ ఉపవిభాగం 4 అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడింది:- జంగ్, ముక్తొ, తింగ్బు, ల్హౌ.

శాసన వ్యవస్థ

[మార్చు]

జిల్లాలోని మొంపా, తగ్పా, టిబెటన్లు టిబెటన్ బుద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. జిల్లాలో ప్రతిసంవత్సరం ప్రి - బుద్ధిస్ట్ (బాన్), షమనిజం కూడా స్వల్పంగా ఉంది. లోసర్, చొస్కర్, తొంగ్యా ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. తవాంగ్ ఆరామంలో డంగ్యూర్, టొర్గ్యా పండుగలను ఉత్సాహంగానూ సంప్రదాయ సహితంగానూ జరుపుకుంటుంటారు.

ఆర్ధికం

[మార్చు]

తవాంగ్ జిల్లాలోని గిరిజనప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు. తవాంగ్ లోని శీతలవాతావరణం యాక్‌లు, గొర్రెల పంపకానికి అనుకూలంగా ఉంటుంది. దిగువ భూములలో పంటలు అధికంగా పండుతుంటాయి.

పర్యాటకం

[మార్చు]
సెలా టాప్‌లో చివరిగా కరుగుతున్న మంచులో ఆడుకుంటున్న అబ్బాయిలు

తవాంగ్ పట్టణంలో సురక్షితంగా ఉన్న "తవాంగ్ ఆరామం" ప్రముఖ యాత్రాస్థలం గాను, పర్యాటక కేంద్రంగానూ గుర్తింపు పొందింది. నిటారుగా ఉన్న సెలా పాస్ సంవత్సరంలో అత్యధిక కాలం హిమమయంగా ఉంటుంది. పర్యాటక ఆకర్షణలలో జాంగ్ జలపాతం ఒకటి. తవాంగ్ జిల్లా హస్థకళలు ప్రజలకు అధికంగా ఉపాధి కల్పిస్తుంది. తవాంగ్‌లో ప్రవేశించడానికి పర్యాటకులకు ప్రత్యేక అనుమతి కావాలి. ఈ అనుమతి తీసుకోవడానికి కొలకత్తా, గౌహతి, తేజ్‌పూర్, ఢిల్లీలో కార్యాలయాలు ఉన్నాయి. ప్రయాణ మార్గంలో సెలా పాస్‌ను దాటుతూ అధికంగా ఎత్తైన పర్వత మార్గంలో ప్రయాణించాలి. పర్యాటకులు అస్సాం రాష్ట్రంలోని తేజ్‌పూర్ రోడ్డులో ప్రయాణించి తవాంగ్ చేరుకోవాలి. గౌహతి (అస్సాం) ప్రయాణం 16 గంటలు ఉంటుంది. 2008 నుండి గౌహతి నుండి దినసరి హెలికాఫ్టర్ సేవలు లభ్యమౌతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుతో తేజ్పూరుకు కొలకత్తా నుండి విమానసేవలు లభిస్తున్నాయి. తేజ్పూర్ (అస్సాం) నుండి బసులు, ప్రైవేట్ టాక్సీలు, షేర్ ఆటోలు లభిస్తాయి. ఇది ఒక కఠినమైన ప్రయాణం. అధికంగా టర్మాక్, గ్రావెల్ నిండి ఉన్న ఈ మార్గంలో పలు చోట్ల అక్కడక్కడా మట్టిరోడ్లు దర్శనం ఇస్తాయి. 12 గంటలు అతి సుందరమైన ఈ ప్రయాణంలో 2,438 మీ ఎత్తైన బొమ్‌దిలా పాస్, 4.176 మి ఎత్తైన సెలాపాస్, జస్వంత్ ఘర్ ద్వారా తవాంగ్ చేరుకోవచ్చు. ప్రభుత్వ బసులు తరచుగా బ్రేక్‌డౌన్ ఔతుంటాయి కనుక ప్రయాణీకులు ప్రైవేట్ కార్లు, టాక్సీలను ఎంచుకుంటుంటారు. దారి పొడవునా శాకాహార, మాంసాహార మామోలు, క్రీం బ్రెడ్ వంటి ఆహారాలు లభిస్తుంటాయి. 2013లో తవాంగ్‌లో " 2వ అంతర్జాతీయ టూరిజం మార్ట్ " నిర్వహించబడింది.[23]

  • నామ్గ్యాల్ స్థూపం: 40 అడుగుల నామ్గ్యాల్ స్థూపం తవాంగ్ పట్టణం నుండి 1 కిమీ దూరములో ఉంది. ఇది 1962 చైనా - ఇండియన్ యుద్ధంలో చనిపోయన 2420 అమరవీరుల త్యాగానికి గుర్థు.
  • పంగంగ్ టంగ్ త్సో సరస్సు: ఈ సరస్సు తవాంగ్ పట్టణప్రాంతం నుండి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. తవాంగ్ సందర్శించే పర్యాటకులకు ఈ సరస్సు ఎల్లప్పుడూ ఆకర్షణ కేంద్రగా ఉంటుంది. ఇది విహారకేంద్రంగా కూడా ఉంది. శీతాకాలంలో ఈ సరస్సు గడ్డకట్టి, పరిసరప్రాంతాలు స్కీయింగ్ కి అనువుగా ఏర్పడతాయి.
  • షుంగాట్సర్ సరస్సు (మాధురి సరస్సు) : తవాంగ్ జిల్లాలోని పర్యాటక స్థలాల్లో ఇది ఒకటి. కొన్ని దశాబ్దాల కిందట వచ్చిన భూకంపం కారణంగా ఈ సరస్సు ఏర్పడింది. మాధురి దీక్షిత్ నటించిన సినిమా ఇక్కడ షూటింగ్ చేఉకున్న తరువాత ఈ సరస్సును ఆమె పేరుతో పిలవడం మొదలైంది.
  • జాంగ్ జలపాతం: జాంగ్ వద్ద ఉన్న ఈ జలపాతాన్ని నూరనాంగ్ జలపాతం అని కూడా పిలుస్తారు.

చరిత్ర

[మార్చు]

తవాంగ్ ఆరామం

[మార్చు]

తవాంగ్ ఆరామం 5వ దలైలామా (నాగ్వంగ్ లాబ్సాంగ్ గ్యాస్టో) కోరికపై మెర లామా లొడ్రె గ్యాస్టో చేత స్థాపినచబడింది. ఈ ఆరామం " జెలుగ్ప సెక్ట్ "కు చెందినది. భారతదేశంలో ఇది అతిపెద్ద బౌద్ధ ఆరామంగా గుర్తింపు పొందింది. ఇది ల్హసలోని డ్రెపంగ్ ఆరామంతో సంబంధం ఉంది.[24] తవాంగ్ ఆంటే " అశ్వం ఎన్నుకున్న " అని అర్ధం. దీనికి " గాల్డెన్ నంగే ల్హత్సే " అనే మరొక పేరు కూడా ఉంది. దీనికి అర్ధం" " స్వచ్ఛమైన రాత్రిలో ఒక ఖగోళభవనం " అని అర్ధం.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  3. Maxwell, Neville (1970). India's China War. New York: Pantheon. p. 65. ISBN 9780224618878. Archived from the original on 2012-01-12. Retrieved 2014-07-15.
  4. J Michael Cole (November 27, 2012). "China's New Passport Sparks Controversy". The Diplomat. Retrieved May 25, 2013.
  5. Andrea Matles Savada (1993). Nepal and Bhutan: Country Studies. Federal Research Division, Library of Congress. p. 21. ISBN 0-8444-0777-1.
  6. Shakya (1999), p. 279.
  7. A History of Modern Tibet, 1913–1951, by M.C.Goldstein (University of California Press,1989), pp. 299–307.
  8. India's China War by Neville Maxwell (Anchor Books, 1972), pp.50–51.
  9. India's China War by Neville Maxwell (Anchor Books, 1972),page 66
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-29. Retrieved 2014-07-15.
  11. India's China War by Neville Maxwell (Anchor Books, 1972),pp.384–502
  12. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  13. Richardson (1984), p. 210
  14. "Tawang is part of India: Dalai Lama". TNN. 4 June 2008. Retrieved 20 August 2012.
  15. "Thousands flock to see Dalai Lama in Indian state". Archived from the original on 2016-03-04. Retrieved 2014-07-15.
  16. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  17. http://www.censusindia.gov.in/Dist_File/datasheet-1201.pdf
  18. "Tawang District Population Religion - Arunachal Pradesh, Tawang Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Retrieved 2023-09-21.
  19. "About Tawang". Archived from the original on 2008-03-02. Retrieved 2014-07-15.
  20. Injustice in India's east
  21. PHED Map
  22. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
  23. "International Tourism Mart begins today at Tawang in Arunachal Pradesh". Archived from the original on 23 అక్టోబరు 2013. Retrieved 18 October 2013.
  24. Footprint Tibet Handbook with Bhutan, p. 200. Gyume Dorje. (1999) Footprint Handbooks, Bath, England. ISBN 0-8442-2190-2.

భౌగోళిక స్థితి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]