లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా
దిగువ దిబాంగ్ లోయ జిల్లా | |
---|---|
![]() అరుణాచల్ ప్రదేశ్ పటంలో దిగువ దిబాంగ్ లోయ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | రోయింగ్ |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 53,986[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70.4%[1] |
• లింగ నిష్పత్తి | 919[1] |
అరుణాచల ప్రదేశ్ రాష్ట్రలోని 17 జిల్లాలలో దిగువ దిబాంగ్ జిల్లా ఒకటి. దేశంలో అత్యల్పజనసాధ్త్రత కలిగిన జిల్లాలలో ఇది 10వ స్థానంలో ఉంది. [2]
చరిత్ర[మార్చు]
1980లో లోహిత్ జిల్లాలోని కొంతభూభాగం వేరిచేసి దిబాంగ్ లోయ జిల్లా రూపొందించబడింది.[3]2001 డిసెంబరు 16న దిబాంగ్ లోయ జిల్లా దీబాంగ్ లోయ జిల్లా, దిగువ దిబాంగ్ లోయ జిల్లాగా విభజించబడింది.[3]
భౌగోళికం[మార్చు]
దిగువ దిబాంగ్ లోయ జిల్లా కేంద్రంగా రోయింగ్. 2001 డిసెంబరున ఈ జిల్లా రూపొందించక ముందు అనిని జిల్లా కేంద్రంగా ఉందెది.[4]
విభాగాలు[మార్చు]
దిగువ దిబాంగ్ లోయ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :- డంబక్, రోయింగ్. ఇవి రెండు అరుణాచల్ ఈస్ట్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగ ఉన్నాయి. [5]
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 53,986, [1] |
ఇది దాదాపు. | సెయుంట్ కిట్స్, నెవిస్ దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 630వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 14 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 7.01%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 909:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 70.38%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు[మార్చు]
దిగువ దిబాంగ్ లోయ జిల్లా ఇడు మిష్మి, ఆది, సినో-టిబెటన్ (అంతరించిపోతున్న భాధలలో ఒకటి) భాషలు వాడికలో ఉన్నాయి.[7]
వృక్షజాలం, జంతుజాలం[మార్చు]
దిగువ దిబాంగ్ జిల్లా వన్యమృగాలతో సుసంపన్నమై ఉంది. ఈ అరణ్యాలలో మిష్మి టాకిన్, రెడ్ గోరల్, ఏనుగులు, అడవి నీటి దున్న, మౌంట్జాక్ వంటి వన్యమృగాలు ఉన్నాయి. స్క్లటర్ మోనల్, బ్లిత్స్ ట్రాగోపన్, రుఫోర్స్ - నెక్డ్ హార్న్‌బిల్, బెంగాల్ ఫ్లోరికన్, వైట్ - వింగ్డ్ వుడ్ డక్ వంటి పక్షులు ఉన్నాయి.[8] సైన్సు ప్రపంచానికి సరికొత్త ప్రాణి అయిన మిష్మి హిల్స్ జైంట్ ఎగిరే ఉడుత " పెటౌరిస్టా మిష్మింసిస్ " ఈ ప్రాంతంలో కనిపిస్తుంది.[9] 1980లో దిగువ దిబాంగ్ లోయ జిల్లాలో 282 చ.కి.మీ వైశాల్యంలో " మెహయో విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటుచేయబడింది.[10]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "districtcensus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ 3.0 3.1 Law, Gwillim (25 September 2001). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ "Official Website of the Lower Dibang Valley District". Archived from the original on 2011-05-26. Retrieved 2014-05-25.
- ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Saint Kitts and Nevis 50,314 July 2011 est.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ Choudhury, Anwaruddin (2008) Survey of mammals and birds in Dihang-Dibang biosphere reserve, Arunachal Pradesh. Final report to Ministry of Environment & Forests, Government of India. The Rhino Foundation for nature in NE India, Guwahati, India. 70pp.
- ↑ Choudhury,Anwaruddin (2009).One more new flying squirrel of the genus Petaurista Link, 1795 from Arunachal Pradesh in north-east India. The Newsletter and Journal of the RhinoFoundation for nat. in NE India 8: 26–34, plates.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
ఎగువ జియాంగ్ జిల్లా | Upper Dibang Valley district | చైనా | ![]() |
తూర్పు సియాంగ్ జిల్లా | ![]() |
లోహిత్ జిల్లా | ||
| ||||
![]() | ||||
తిసుకియా జిల్లా, అస్సాం రాష్ట్రం. |