Jump to content

తిరప్ జిల్లా

వికీపీడియా నుండి
తిరప్ జిల్లా
అరుణాచల ప్రదేశ్ పటంలో తిరప్ జిల్లా స్థానం
అరుణాచల ప్రదేశ్ పటంలో తిరప్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల ప్రదేశ్
ముఖ్య పట్టణంఖోన్సా
విస్తీర్ణం
 • మొత్తం2,362 కి.మీ2 (912 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం1,11,997[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత52.2%[1]
 • లింగ నిష్పత్తి931[1]
Websiteఅధికారిక జాలస్థలి

తిరప్ జిల్లా, భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2] ఈ జిల్లా సరిహద్దులో నాగాలాండ్, అస్సాం, అంతర్జాతీయంగా మయన్మార్, రాష్ట్రంలోని ఛంగ్‌లంగ్, లంగ్‌డంగ్ జిల్లాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

తిరప్ ప్రాంతంలో పూర్వం స్థానిక గిరిజనులు నివసిస్తూ ఉండేవారు. 16వ శతాబ్దంలో అహోం పాలనా కాలంలో ఇక్కడకు నొక్టే ప్రజలు వచ్చి స్థిరపడ్డారు.1945లో ఈ ప్రాంతం జపానీయుల ఆక్రమితప్రాంతంగా కొంతకాలం ఉంది. జపనీయుల సామ్రాజ్యం పతనం అయ్యే వరకు ఇది కొనసాగింది. తరువాత " సుమన్ గోప్ " పాలన మొదలైంది. తరువాత తిరప్ నాగా తిరుగుబాటు దారుల లక్ష్యంగా మారింది. గ్రేటర్ నాగాలాండ్ లక్ష్యంగా సైనికపరంగా ఈ దాడులు సాగాయి. నాగా తిరుగుబాటు దారులకు బాప్టిస్ట్ మిషనరీలు సహాయం అందించారు.[3]

1887 నవంబరు 14 న తిరప్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఛంగ్‌లంగ్ జిల్లా రుఇపొందించబడింది. 2013లో తిరప్ లోని మరికొంత భూభాగం వేరుచేసి లంగ్‌డింగ్ జిల్లా రూపొందించబడుంది .[4]

భౌగోళికం

[మార్చు]

తిరప్ జిల్లా వైశాల్యం 2,362 చ.కి.మీ.[5] ఇది కెనడా లోని కార్న్‌వాల్ ద్వీపం వైశాల్యానికి సమానం.[6] ఈ ప్రాంతం సముద్రమట్టానికి 200 నుండి 4,000 మీటర్ల (పత్కై కొండలు) ఎత్తులో ఉంది.

విభాగాలు

[మార్చు]

తిరప్ జిల్లాలో అరుణాచల్ ప్రదేశం లెజిస్లేటివ్ శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి: నాంసాంగ్, తూర్పు ఖొంస, పశ్చిమ ఖొంస, బోర్డురియ-బోగాపని.

ఇవి అరుణాచల్ ఈస్ట్ పార్లమెంటరీ విభాగంలో భాగంగా ఉన్నాయి.[7]

జనాభా గణాంకాలు (2011)

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరాప్ జిల్లాలో మొత్తం జనాభా 111,975. వీరిలో 57,604 మంది పురుషులు కాగా, 54,371 మంది స్త్రీలు ఉన్నారు.[8] జిల్లాలో మొత్తం 20,611 కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో సగటు లింగ నిష్పత్తి 944.

జిల్లా మొత్తం జనాభాలో 18.6% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 81.4% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 80.8% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 45.1% ఉంది. అలాగే తిరప్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 822 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 974 ఉంది.

జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 20,045, ఇది మొత్తం జనాభాలో 18% ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 10223 మంది మగ పిల్లలు ఉండగా, 9822 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా పిల్లల లింగ నిష్పత్తి 961, ఇది తిరాప్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (944) కంటే ఎక్కువ.

తిరప్ జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 52.19%. తిరప్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 50.89% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 34.32% ఉంది.

మతాలు

[మార్చు]

తిరప్ జిల్లాలో నాగాగిరిజన జాతికి చెందిన నొక్టే ప్రజలు అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో నొక్టే ప్రజలతో నాగాలకు చెందిన కొన్యాక్, వింకో ప్రజలు కూడా ఉన్నారు. వీరు సంప్రదాయకంగా హిందూయిజం, అనిమిజం ఆచరిస్తుంటారు. ప్రస్తుతం వీరంతా క్రైస్తవ మతం అనుసరిస్తున్నారు. అల్పసంఖ్యాకులు అయిన తుస్తా, తంగ్సా, సింగ్పొ ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు, పండుగ సందర్భాలలో నొక్టే ప్రజలు లోకు, వింకో ప్రజలు ఒరియా, తుస్తా ప్రజలు పొంగ్తు ఉత్సవాలు అత్యుత్సాహంగా నిర్వహిస్తుంటారు. వీటితో దుర్గా పూజ కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు.

అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవ మతం ప్రచారం తిరప్ జిల్లా నుండి మొదలైంది. బోర్డురియా గ్రామం మొదటగా 2004లో కాథలిక్ చర్చి సిల్వర్ జూబ్లి ఉత్సవం జరుపుకుంది. గుర్తించతగిబంత మంది హిందూ నొక్టేలు క్రమంగా క్రైస్తవమతానికి మారుతున్నారు. ప్రత్యేకంగా ఖొంసా ప్రాంతంలో ఇది అధికంగా జరిగింది.

విద్య

[మార్చు]

తిరప్ జిల్లాలో " రామక్రిష్ణా మిషన్ స్కూల్ " ఉంది. ఇది తిరప్ వాసులు విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in.
  2. "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Retrieved 2023-09-21.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-14. Retrieved 2014-07-15.
  4. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  5. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  6. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Cornwall Island 2,358km2
  7. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
  8. "Tirap District Population Religion - Arunachal Pradesh, Tirap Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Retrieved 2023-09-21.

భౌగోళిక స్థితి

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]