Jump to content

మోన్ జిల్లా

వికీపీడియా నుండి
మోన్ జిల్లా
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా
"Shangnyu Village, Mon district, Nagaland"
షాంగ్న్యు గ్రామం, మోన్ జిల్లా, నాగాలాండ్
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
Seatమోన్
జనాభా
 (2011)
 • Total2,50,671
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://mon.nic.in/

నాగాలాండ్ రాష్ట్రంలోని 11 జిల్లాలలో మోన్ జిల్లా ఒకటి.

భౌగోళికం

[మార్చు]

నాగాలాండ్ రాష్ట్రం ఈశాన్యభూభాగంలో ఉన్న జిల్లా మోన్ జిల్లా. జిల్లా ఉత్తర సరిహద్దులో అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం, పడమర సరిహద్దులో అస్సాం రాష్ట్రం, తూర్పు సరిహద్దులో మయన్మార్ దేశం, ఆగ్నేయ సరిహద్దులో లాంగ్‌లెంగ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో తుఏన్‌సాంగ్ జిల్లా జిల్లా ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]

2001లో పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మోన్ ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న నాగాలాండ్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 250,671, [2]
ఇది దాదాపు వనౌటు దేశ జనసంఖ్యకు సమానం [3]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 582వ స్థానంలో ఉంది [2]
1చ.కి.మీ జనసాంద్రత
2001-11 కుటుంబనియంత్రణ శాతం
స్త్రీ పురుష నిష్పత్తి 898:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాస్యత శాతం 56.6%.[2]
జాతియ సరాసరి (72%) కంటే అల్పం

సంస్కృతి

[మార్చు]

మోన్ జిల్లా కొన్యాక్ నాగాలాకు పుట్టినిల్లు. కొన్యాక్ నాగాలు పచ్చబొట్లు పొడిచిన ముఖాలు, ఈకలను ధరించి విచిత్రంగానూ ఆసక్తికరంగానూ ఉంటారు.కొన్యాక్ నాగాలు కళాత్మకమైన హస్తకళా నైపుణ్యం కలిగి ఉంటారు. ఇక్కడ కళాత్మకంగా చెక్కిన అద్భుతమైన కొయ్యసామాగ్రి, ఖడ్గాలు, తుపాకులు, తుపాకి పొడి, కుంచలు, శీరోభూషణాలు, పూసలు, లోహాలతో చేసిన హారాలు, పలు విధములైన వస్తువులను తయారుచేసే కళాకారులను చూడవచ్చు. కొన్యాక్ నాగాల వర్ణరంజితమైన పండుగలలో ఏప్రిల్ మాసంలో జరుపుకునే ఆవోలింగ్ మొన్యూ ప్రధానమైనది. ఈ ఉత్సవాలను తిలకించేవారు అధుభుతమైన అనుభూతికి గురౌతారు. నాగాలలో కొన్యాక్ నాగాలు అధికసంఖ్యాకులని అంచనా. నాగాలు ప్రస్తుతం క్రైస్తవమతావలంబకులుగా ఉన్నారు. క్రైస్తవం నిరంతరం పరస్పరం కలహించుకునే నాగాల మద్య అనుకూలమైన అనుబంధం ఏర్పడడానికి కారణమైంది. సాధారణంగా అధికంగా శత్రువుల పుర్రెలు ఎవరివద్ద ఉంటాయో వారిని అత్యున్నత వీరులుగా పరిగణించడం ఆచారంగా ఉంటూవచ్చింది. ఇపాటికీ కొన్యాక్ నాగాలు వారి నివాసాలను శత్రువుల పుర్రెలతో అలకరించుకుంటారు.

కొన్యాక్ నాగాలకు అంఘ్ అనే వారసత్వ రాజప్రతినిధులు పాలకులుగా ఉండేవారు. అంఘ్ పదవి నగాలలో విశేషాధికారం కలిగినది. చుయి, మోన్, షెయంగా, చింగ్యూ, వాక్‌చింగ్, జబోకాలలో అంఘ్ ప్రముఖుల నివాసాలను చూడడడం ఆసక్తి కలిగించే అనుభవం. గ్రామంలో అంఘ్ నివాసం వైశాల్యంలో పెద్దదిగా ఉంటుంది. వారి నివాసాలలో శత్రువుల పుర్రెలు ప్రదర్శించబడుతూ ఉంటాయి. కోన్యాక్ నాగాలశరీరమంతా పచ్చబొట్లు ఉంటాయి. మగవారిలో పెద్దవారు అడవిపంది ఎముకలతో చేసిన కర్ణాభరణాలను ధరిస్తుంటారు. ఆడవారిలో పెద్దవారు నడుముకు చిన్న వస్త్రం చుట్టుకుంటారు. ఆడవారు వారి వీపులకు వెదురు బుట్టలను తగిలించుకుని అందులో పిల్లలను మోసుకుపోతుంటారు. వారు చేతితో అల్లిన అనదమైన షాల్స్ ధరిస్తున్యారు. ఉత్సవాల సమయంలో పురుషులు ఈకలతో చేసిన తలపాగాలు, షాల్స్ ధరిస్తుంటారు. అలాగే నాగాలు మంత్రాలను పఠిస్తూ నృత్యాలు చేస్తూ ఉంటారు. అరణ్యాలను తగులబెట్టి వ్యవసాయభూములుగా మార్చుకుంటారు. వారు గృహాలలో బియ్యం నుండి మద్యం తయారుచేసుకుంటారు. స్వాతంత్ర్యానికి ముందు కోన్యాకులలో తలలను వేటాడే ఆచారం ఉన్నప్పటికీ ప్రస్తుతం యువత మాత్రం వారి సంప్రదాయ జీవనసర్రళిని విడిచి ఆధునిక జీవనసరళిని అలవరచుకుంటుంది.

ప్రముఖ ఆకర్షణలు

[మార్చు]
Ceremonial basket of the Konyak Naga
షంగ్‌న్యూ గ్రామం

చీఫ్ అంగ్ పాలనలో కొనసాగుతున్న షంగ్యూ గ్రామం మోన్ జిల్లాలోని గ్రామాలలో ప్రధానమైనది. ఈ గ్రామంలో ఉన్న 8 అడగుల ఎత్తు 12 అడుగుల వెడల్పైన అద్భుతమైన ఙాపక చిహ్నం ఉంది. ఇది స్వర్గంలో దేవతలచేత నిర్మితమైనదని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ ఙాపక చిహ్నంలో మనుష్యులు, ఇతర ప్రాణుల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. షంగ్యూ, అహోం రాజుల మద్య ఉన్న చక్కని స్నేహసంబంధాలకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

చుయి గ్రామం (బస్తి)

జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న చుయి గ్రామానికి జిల్లాలో ప్రత్యేకత ఉంది. ఈ గ్రామాన్ని చుయి బస్తీ పాలిస్తుంది. అంగ్స్ నివాసం గ్రామంలో ఇతర నివాసాలసకంటే విశాలంగా ఉంటుంది. ఈ నివాసంలో గ్రామనాయకుడైన అంగ్ చేత సంహరించబడినవి, వారి పూర్వీకుల చేత సంహరించబడిన శత్రువుల పుర్రెలు ప్రదర్శించబడుతుంటాయి. 19వ శతాబ్దంలో కొన్యాకులు తలలను వేటాడే సంప్రదాయం కలిగి ఉండే వారని భావిస్తున్నారు.

లాంగ్వా గ్రామం

మోన్ జిల్లాలోని అతిపెద్ద గ్రామమే లాంగ్వ. ఇది అత్యంత ఆసక్తికరమైన ప్రదేశం. నాయన్మార్ దేశ సరిహద్దులను కలిగి ఉన్న ఈ గ్రామపాలన అంగ్, విలేజ్ కౌంసిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నప్పటికీ గ్రామనాయకుడైన అంగ్ నివాసం మాత్రం సగభాగం భారతదేశం లోనూ మిగిలిన సగభాగం మయన్మార్ దేశంలోనూ ఉండండం విశేషం. మరొక ఆసక్తికరమైన విశేషం నాయకుడైన అంగ్ 60 మంది భార్యలను కలిగిఉండడం, అంగ్ న్యాయాధికారం మయన్మార్, అరుణాచల ప్రదేశ్ వరకు విస్తరించి ఉండడం.

వేదా పీక్

మోన్ జిల్లాకు దాదాపు 70కి.మీ దూరంలో వేదా పీక్ శిఖరం ఉంది. ఆకాశం నిర్మలంగా ఉన్న సమయంలో ఈ శిఖరం నుండి బ్రహ్మపుత్ర, చింద్విన్ నదుల ప్రవాహదృశ్యాలను చూడగలిగే అవకాశం ఉంది. కోన్యాక్ గ్రామాలలో ఇది అత్యంత మనోహర ప్రదేశమని భావిస్తున్నారు. ఈ శిఖరంలో ఒక జలపాతం కూడా ఉంది.

నాగనిమోరా

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Vanuatu 224,564 July 2011 est.

వెలుపలి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.