మోన్
మోన్ | |
---|---|
Coordinates: 26°45′N 95°06′E / 26.75°N 95.1°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
జిల్లా | మోన్ |
Elevation | 655 మీ (2,149 అ.) |
జనాభా (2001) | |
• Total | 16,119 |
భాషలు | |
• అధికారిక | ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎన్ఎల్ |
మోన్, నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లా ముఖ్య పట్టణం, పట్టణ ప్రాంత కమిటీ.
భౌగోళికం
[మార్చు]మోన్ పట్టణం 26°45′N 95°06′E / 26.75°N 95.1°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] ఇది సముద్రమట్టానికి 655 మీటర్ల (2,148 అడుగుల) ఎత్తులో ఉంది.
ఈ పట్టణం, కోహిమా నుండి దీమాపూర్ మీదుగా 357 కి.మీ.ల దూరంలో, దీమాపూర్ నుండి 280 కి.మీ.ల దూరంలో, కోహిమా నుండి మొకొక్‌ఛుంగ్ మీదుగా 275 కి.మీ.ల దూరంలో ఉంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] మోన్ పట్టణంలో 16,590 జనాభా ఉంది. ఇందులో 9,138 మంది పురుషులు, 7,452 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 71% కాగా, ఇది జాతీయ సగటు 76% కన్నా కొద్దిగా తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 75% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఇక్కడ కొన్యాక్స్, అయోస్ రెండు తెగలు నివాసితులుగా ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Falling Rain Genomics, Inc - Mon
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2021-01-05.