తుఏన్‌సాంగ్
తుఏన్‌సాంగ్ | |
---|---|
Coordinates: 26°16′18″N 94°49′53″E / 26.271559°N 94.831384°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
జిల్లా | తుఏన్‌సాంగ్ |
Elevation | 1,371 మీ (4,498 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 36,774 |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎన్ఎల్ |
తుఏన్‌సాంగ్, నాగాలాండ్ రాష్ట్రంలోని తుఏన్‌సాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ పట్టణంలో 36,774 జనాభా ఉంది.[1] 1947లో ఈ పట్టణం ఏర్పాటుబడింది.
చరిత్ర
[మార్చు]1902లో ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. గిరిజన ప్రాంతంగా పిలువబడ్డ ఈ ప్రాంతాన్ని భారత గవర్నర్ జనరల్ పరిపాలించాడు. 1948లో, తుఏన్‌సాంగ్ అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ అనే ప్రత్యేక విభాగం ఏర్పాటుబడింది.[2]
భౌగోళికం
[మార్చు]ఈ పట్టణం 26°17′N 94°50′E / 26.28°N 94.83°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[3] ఇది 1,371 మీటర్ల (4,498 అడుగుల) ఎత్తులో ఉంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 36,774 జనాభా ఉంది.[1] 2001లో 29,654 నుండి 2011కి 24% పెరిగింది.[4] ఈ జనాభాలో 56% మంది పురుషులు, 44% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 71% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 74% కాగా, స్త్రీ అక్షరాస్యత 67% గా ఉంది. మొత్తం జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
దీమాపూర్, కోహిమా, మొకొక్‌ఛుంగ్ మొదలైన వాటితోపాటు నాగాలాండ్ రాష్ట్రంలో ఇది కూడా ఒకటి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Tuensang City Population Census 2011 - Nagaland". www.census2011.co.in. Retrieved 2021-01-05.
- ↑ Ved Prakash (2007). Encyclopaedia Of North-east India Vol# 5. Atlantic. p. 1922. ISBN 978-81-269-0707-6.
- ↑ Falling Rain Genomics, Inc - Tuensang
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2021-01-05.