Jump to content

ఛంగ్‌లంగ్ జిల్లా

వికీపీడియా నుండి
ఛంగ్‌లంగ్ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ పటంలో ఛంగ్‌లంగ్ జిల్లా స్థానం
అరుణాచల్ ప్రదేశ్ పటంలో ఛంగ్‌లంగ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంఛంగ్‌లంగ్
విస్తీర్ణం
 • మొత్తం4,662 కి.మీ2 (1,800 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం1,47,951[1] (2,011)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత61.9%[1]
 • లింగ నిష్పత్తి914[1]
Websiteఅధికారిక జాలస్థలి
చాంగ్లాంగ్ జిల్లాకు చెందిన తుట్సా నృత్యకారులు

ఛంగ్‌లంగ్ జిల్లా, భారతదేశం, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో చంగ్‌లంగ్ జిల్లా ఒకటి.[2] 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలో రెండవదిగా ఇది గుర్తింపు పొందింది. మొదటి స్థానంలో పపుమ్‌ పరే జిల్లా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో లోహిత్, దక్షిణ సరిహద్దులో తిరప్ జిల్లాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

స్వంతంత్రానికి తరువాత

[మార్చు]

1987 నవంబరు 14 న తిరప్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేయుటద్వాలా చంగ్‌లంగ్ జిల్లా రూపుదిద్దుకుంది.[3]

భౌగోళికం

[మార్చు]

చంగ్‌లంగ్ జిల్లా వైశాల్యం 4,662చ.కి.మీ.[4] జిల్లా వైశాల్యపరంగా ఇండోనేషియాలోని లంబోక్ ద్వీపం వైశాల్యంతో సమానం.[5] ఈ జిల్లా అత్యధిక వర్షపాతం కలిగి ఉన్న ప్రాంతంలో ఉంది.ఈ ప్రాంతం వృక్ష, జంతు సంపదలో సుసంపన్నమై ఉంది. జిల్లాలో మైదానాలు, ఎగువభూములు ఉన్నాయి. అత్యధికమైన మైదానాలున్న వ్యాలీ డిహింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో వరదలు అధికంగా వస్తుంటాయి.

జాతీయ అభయారణ్యం

[మార్చు]

ఆర్ధికం

[మార్చు]

ప్రాంతీయ వాసులకు డీహింగ్ వద్ద పుష్కలంగా చేపలు లభిస్తుంటాయి. ఇక్కడ లభించే మంచినీటి చేపలకు సమీపంలో ఉన్న తింసుకి, డూమ్‌ డూమా, డిగ్‌బొయి, డిబ్రూఘర్ వంటి నగరాలలో గిరాకీ అధికం.

పరిపాలనా విభాగాలు

[మార్చు]

ఉప విభాగాలు

[మార్చు]

జిల్లా 4 ఉపవిభాగాలుగా విభజించబడింది.[6]

  • చంగ్‌లంగ్ ఉపవిభాగం 4 అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడింది:- చంగ్‌లంగ్ జనసంఖ్య (14,718 ), కిమియంగ్ జనసంఖ్య (3,506), నంతక్ జనసంఖ్య (3,085), యాత్డం జనసంఖ్య (3,988).
  • మియావో ఉపవిభాగం 3 అడిమినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడింది:- మియావొ జనసంఖ్య ( 20,266), కర్సంగ్ జనసంఖ్య (9,509), విజీయ్నగర్ జనసంఖ్య (3,988).
  • జైరాంపూర్ ఉపవిభాగం 4 అడిమినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడింది:- నంపాంగ్ జనసంఖ్య ( 4,424), మన్మావొ జనసంఖ్య (3,814), జైంరాంపూర్ జనసంఖ్య (7,836), ృ
  • బోర్డంస ఉపవిభాగం 2 అడిమినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడింది:- బోర్డంస జనసంఖ్య ( 25,369), డియున్ జనసంఖ్య (28,907).

తాలూకాలు

[మార్చు]

పరిపాలనను సులభతరం చేయడానికి, చాంగ్లాంగ్ జిల్లా 17 సర్కిల్‌లుగా విభజించబడింది (తాలూకా/తహసిల్/తహశీల్) ఇవి ఉప-జిల్లాలను సూచించే పరిపాలనా విభాగాలు. సర్కిల్‌లు బహుళ గ్రామాలు, కొన్ని పట్టణాలను కలిగి ఉంటాయి.[6][7]

శాసన వ్యవస్థ

[మార్చు]

శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]

జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి:- బోర్డంస, మియావొ, నంపాంగ్, దక్షిణ చంగ్‌లంగ్, ఉత్తర చంగ్‌లంగ్.

లోక్‌సభ నియోజకవర్గాలు

ఈ జిల్లా అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గంలోభాగంగా ఉంది.[8]

ప్రయాణవసతులు

[మార్చు]

ఈ ప్రాంతంలో చక్కని రహదారి వసతి ఉంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ నిర్మించిన రోడ్డు మార్గం కొన్ని దశాబ్ధాలుగా ప్రజల ప్రయాణాలకు వసతి కల్పిస్తుంది.

జనాభా గణాంకాలు (2011)

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
196118,227—    
197141,474+8.57%
198162,211+4.14%
199195,530+4.38%
20011,25,422+2.76%
20111,48,226+1.68%
ఆధారం:[9]

2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లాలో మొత్తం జనాభా 148,226. వీరిలో 76,948 మంది పురుషులు, 71,278 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో మొత్తం 29,521 కుటుంబాలు ఉన్నాయి. చాంగ్లాంగ్ జిల్లా సగటు లింగ నిష్పత్తి 926. మొత్తం జనాభాలో 13% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 87% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 84.9% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 55.8%. అలాగే చాంగ్లాంగ్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 803 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 946.

చాంగ్లాంగ్ జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 25869, ఇది మొత్తం జనాభాలో 17% మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 13075, ఆడ పిల్లలు 12794 ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 979, ఇది చాంగ్లాంగ్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (926) కంటే ఎక్కువ. మొత్తం అక్షరాస్యత రేటు 59.8%. చాంగ్లాంగ్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 57.22%. స్త్రీల అక్షరాస్యత రేటు 40.89%.

భాషలు

[మార్చు]

చంగ్‌లంగ్ జిల్లాలో వాడుకలో ఉన్న సినో- టిబెటన్ భాష అంతరించిపోతున్న భాషలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ భాషను 30,000 మంది మాట్లాడుతున్నారు.[10] చంగ్‌లంగ్ జిల్లాలో అత్యధికంగా గిరిజన ప్రజలు ఉన్నారు. వీరిలో తుత్స, తంగ్స, నొక్టే, చక్మ, సింగ్పొ, లింసు ప్రజలు ప్రధానులు. వీరంతా టిబెటన్ సంతతి ప్రజలు., [11] హజాంగ్, బొడో. మియావొ వద్ద టిబెటన్ ప్రజాసమూహాలు కేంద్రీకృతమై ఉన్నారు. వీరు 1976లో ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. వీరి సంఖ్య దాదాపు 2,200 ఉన్నారు.[12]

సంస్కృతి

[మార్చు]

పర్యాటకం

[మార్చు]

చంగ్‌లంగ్ జిల్లాలో చూడదగిన ప్రదేశాలలో జైరాంపూర్ లోఉన్న రెండవ ప్రపంచ యుద్ధం సమాధులు, ఇండో-మాయన్మార్ సరిహద్దు పట్టణం నంపాంగ్, పగసౌపాస్ ప్రధానమైనవి. ఇతరప్రదేశాలలో తాయీలు, సింపో ప్రజల సుసంపన్నమైన సంస్కృతి ప్రతిబింబించే బోడంస ముఖ్యమైంది.

ఆరోగ్య సేవలు

[మార్చు]

అరుణాచల్ ప్రదేశ్లో ఈప్రాంతం ప్రాముఖ్యత కలిగిఉన్నా ఇక్కడ ఆసుపత్రులు అందుబాటులో లేవు. అస్సాంలో మంచి ఆసుపత్రి సేవలు లభించడం పెద్ద సవాలుగా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in.
  2. "Districts list of Arunachal Pradesh". web.archive.org. 2023-04-17. Archived from the original on 2023-04-17. Retrieved 2023-09-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  5. "Island Directory Tables:Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Lombok 4,625km2
  6. 6.0 6.1 "Administrative Setup | Changlang District, Government of Arunachal Pradesh | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
  7. "Changlang District Population Religion - Arunachal Pradesh, Changlang Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
  8. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
  9. Decadal Variation In Population Since 1901
  10. M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  11. Tibetans in Miao Elect Settlement Officer Archived 2007-03-11 at the Wayback Machine. Tibet.net (24 October 2003).
  12. "Choepheling Tibetan Settlement, Miao, Arunachal Pradesh, India". Archived from the original on 2005-11-04. Retrieved 2014-07-15.

భౌగోళిక స్థితి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]