లోహిత్ జిల్లా
లోహిత్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | తేజు |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,402 కి.మీ2 (927 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 1,45,538 |
• జనసాంద్రత | 61/కి.మీ2 (160/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 69.9% |
• లింగ నిష్పత్తి | 901 |
Website | అధికారిక జాలస్థలి |
లోహిత్ జిల్లా, భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[1] దీని పరిపాలనా కేంద్రం తేజు. 2011 గణాంకాలను అనుసరించి ఈ జనసాంధ్రతలో రాష్ట్రంలో 3 వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో పపుమ్ పరె జిల్లా, ఛంగ్‌లంగ్ జిల్లా ఉన్నాయి.[2]
పేరువెనుక చరిత్ర
[మార్చు]లోహిత్ జిల్లా ప్రాంతం ఒకప్పుడు మిష్మి హిల్స్ అని పిలువబడేది. తరువాత ఈ జిల్లాకు లోహిత్ జిల్లా అని నామకరణం చేయబడింది. సంస్కృతంలో లౌహిత్య అంటే ఎర్రని మట్టిరంగు అని అర్ధం. ఈ జిల్లా ఉత్తర, దక్షిణ భూభాగంలో నదీ లోయ, కొండలతో నిండి ఉంది.
భౌగోళికం
[మార్చు]జిల్లాలోని ముఖ్య ఉపవిభాగాలలో నంసై ఒకటి. నం అంటే జలం, సై అంటే ఇసుక అని అర్ధం. బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన డిహింగ్ నదీతీరంలో ఉన్నందున ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది. నంసై అస్సాం రాష్ట్రం లోని తిన్‌సుకితో రహదారి మార్గంతో అనుసంధానమై ఉంది. లోహిత్ జిల్లా వైశాల్యం 11,402 చ.కి.మీ. జిల్లా జనసంఖ్య 1,43,478.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న చివరి ప్రాంతాగా భావిస్తున్నారు. 1980 జూన్ దీబాంగ్ లోయ జిల్లా నుండి లోహిత్ జిల్లా ఏర్పాటైంది. తరువాత దిగువ దిబాంగ్ లోయ జిల్లా ఏర్పడింది.[3] 2004 ఫిబ్రవరి 16 న లోహిత్ జిల్లా ఉత్తర భూభాగం వేరుచేసి అంజావ్ జిల్లా రూపొందించబడింది. జిల్లా సరిహద్దులో టిబెట్, మయన్మార్ దేశాల సరిహద్దులు ఉన్నాయి. జిల్లా కేంద్రంగా హవాయ్ పట్టణం ఉంది. అంజావ్ జిల్లాను అరుణాచల్ ప్రదేశ్ " రీ ఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్స్ ఆమెండ్మెంట్ బిల్ల్ " ద్వారా రూపొదించారు.[3]
విభాగాలు
[మార్చు]లోహిత్ జిల్లాలో 4 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి: తేజు, చౌఖం, నంసై, లెకాంగ్. ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. [4]
ప్రయాణసౌకర్యాలు
[మార్చు]ఒకప్పుడు ఈ ప్రాంతం చేరుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. 2094 పరశురాం కుండ్ వద్ద శాశ్వత వంతెన నిర్మించిన తరువాత ఈ ప్రదేశం చేరుకోవడానికి మార్గం సులువైంది. ఇక్కడి నుండి సంవత్సరం అంతా తేజు పట్టణానికి ప్రయాణం చెయ్యవచ్చు. తేజుకు తూర్పున 100 కి.మీ దూరంలో ఉన్న హయులియాంగ్ చిన్న పట్టణం కొత్త జిల్లాకు కేంద్రంగా మారింది. ఈ మార్గంలో వాలాంగ్ ఉంది. చైనాకు దక్షిణంగా ఉన్న వాలాంగ్ 1962 వాలాంగ్ యుద్ధానికి గుర్తుగా ఉంది.
జనాభా గణాంకాలు (2011)
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ జిల్లాలో మొత్తం జనాభా 145,726. వీరిలో 76,221 మంది పురుషులు కాగా, 69,505 మంది స్త్రీలు ఉన్నారు.[5] జిల్లా పరిధిలో మొత్తం 30,005 కుటుంబాలు ఉన్నాయి. లోహిత్ జిల్లా సగటు లింగ నిష్పత్తి 912. జిల్లా మొత్తం జనాభాలో 22.3% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 77.7% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 80.8% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 64.4%. అలాగే లోహిత్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 882 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 921గా ఉంది. లోహిత్ జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 23901, ఇది మొత్తం జనాభాలో 16%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 12159 ఉండగా, ఆడ పిల్లలు 11742 మంది ఉన్నారు. జిల్లా బాలల లింగ నిష్పత్తి 966, ఇది లోహిత్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (912) కంటే ఎక్కువ. లోహిత్ జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 68.18%. లోహిత్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 63.47% ఉండగా. స్త్రీల అక్షరాస్యత రేటు 49.9%గా ఉంది.
ప్రజలు
[మార్చు]లోహిత్ జిల్లాలో ఆది, జెక్రింగ్, ఖంతి, డియోరి, అహోం, సింగ్పొ, చక్మ, మిష్మి మొదలైన గిరిజన ప్రజలున్నారు. 1960లో టిబెటన్ ఆశ్రిత బృందాలుగా స్థిరపడిన ప్రజలు జిల్లాలో ఉన్నారు.
మతాలు
[మార్చు]- జెక్రింగ్ ప్రజలు టీబెటన్ బుద్ధమతాన్ని అనుసరిస్తున్నారు.
- ఖంప్టి, చక్మా, సింగ్పొ ప్రజలు తెరవాడ బుద్ధమతం అవలంభిస్తున్నారు.
- మిష్మి ప్రజలు అనిమిస్టు అవలంబీకులుగా ఉన్నారు.
- చక్మా ప్రజలు నివసిస్తున్న భూమి ఉత్తరదిశలో కమ్లాంగ్, దక్షిణ దిశలో గురి కమ్లాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. చౌకం ప్రజలతో కలవడానికి గురికమ్లాంగ్ నది మీద సరైన వంతెన లేదు.
రెండు నడక వంతెనలు ఉన్నాయి. నీటి మీద వస్తువులను తరలించడం కష్టంగా ఉంటుంది. ప్రజలు స్థిరమైన వంతెన నిర్మించమని ప్రభుత్వాన్ని నిర్భందిస్తున్నా సరైన ఫలితం లేదు.
- అహోం ప్రజలు జిల్లాలోని నంసై, మహాదేవర్ సర్కిల్ వద్ద నివసిస్తున్నారు.
- స్వల్ప సంఖ్యలో ఉన్న సింగ్పొ ప్రజలు విడి విడిగా నివసిస్తుంటారు.
భాషలు
[మార్చు]లోహిత్ జిల్లాలో గాలో, అంతరించిపోతున్న దశలో ఉన్న సినో-టిబెట్ భాషలు ఉన్నాయి. ఈ భాషలను జిల్లా తూర్పు భాభాగంలో దాదాపు 30,000 మంది మాట్లాడుతున్నారు. [6]
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]1989లో లోహిత్ జిల్లాలో 783 చ.కి.మీ వైశాల్యంలో " కమ్లాంగ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. .[7] ఇక్కడ అంతరించి పోతున్న వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. ఈ జిల్లా జాత్రోఫా వ్యవసాయానికి అనుకూలమైనదని అది బయోడీసెల్ తయారీకి ఉపకరిస్తుందని కనిపెట్టారు.
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
- ↑ 3.0 3.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 11 October 2011.
- ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
- ↑ "Lohit District Population Religion - Arunachal Pradesh, Lohit Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 28 September 2011.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.