పాపుం పరే జిల్లా
పeపుమ్ పరే జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | యుపియా |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,875 కి.మీ2 (1,110 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 1,76,385[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82.1%[1] |
• లింగ నిష్పత్తి | 950[1] |
Website | అధికారిక జాలస్థలి |
పాపుం పరే జిల్లా, భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2] 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంగా ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[3]
చరిత్ర
[మార్చు]పాపుం పరే జిల్లా 1999లో దిగువ సుబన్‌సిరి జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేయుట ద్వారా ఈ జిల్లా రూపొందింది.[4]
భౌగోళికం
[మార్చు]పాపుం పరే జిల్లా కేంద్రం యుపియా. పాపుం పరే జిల్లా 2,875 చ.కి.మీ.[5] రాష్ట్ర రాజధాని ఇటానగర్ కూడా పాపుం పరేలో ఉంది.
పరిపాలనా విభాగాలు
[మార్చు]ఉప విభాగాలు
[మార్చు]జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది.
తాలూకాలు
[మార్చు]పరిపాలనను సులభతరం చేయడానికి, 2 ఉపవిభాగాలుగాను 10 తాలూకాలుగా (తాలూకా/తహసీల్/తహశీల్) గా విభజించారు. ఇవి ఉప-జిల్లాలను సూచించే పరిపాలనా విభాగాలు.వీటిలో బహుళ గ్రామాలు, కొన్ని పట్టణాలను కలిగి ఉంటాయి.
శాసన వ్యవస్థ
[మార్చు]జిల్లాలో 3 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి:- ఇటానగర్, డాయ్‌ముఖ్, సగలీ. ఈ మూడు అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[6]
లోక్‌సభ నియోజకవర్గాలు
[మార్చు]ఈ జిల్లా అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
జనాభా గణాంకాలు (2011)
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపమ్ పరే జిల్లాలో మొత్తం జనాభా 176,573. వీరిలో 89,182 మంది పురుషులు కాగా, 87,391 మంది స్త్రీలు ఉన్నారు.[7] జిల్లాలో మొత్తం 35,730 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 980.
జిల్లా మొత్తం జనాభాలో 54.9% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 45.1% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 84.7% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 73.9%. అలాగే పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 969 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 993.
జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 25170, ఇది మొత్తం జనాభాలో 14%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 12729 ఉండగా, ఆడ పిల్లలు 12441 ఉన్నారు. ఈ విధంగా పిల్లల లింగ నిష్పత్తి 977, ఇది జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (980) కంటే తక్కువ.
జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 79.95%. జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 73.77%, స్త్రీల అక్షరాస్యత రేటు 63.23%.
పాపుం పరే జిల్లాలో న్యిషి గిరిజనులు అత్యధికంగా ఉన్నారు. వీరు సంప్రదాయంగా డొన్యి- పొలో మతాన్ని అనుసరిస్తారు. న్యిషి ప్రజలలో కొందరు క్రైస్తవమతాన్ని అనుసరిస్తారు.[8]
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]1978లో పాపుం పరె జిల్లాలో 140 చ.కి.మీ వైశాల్యంలో " ఇటానగర్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.[9]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in.
- ↑ "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 2 May 2011.
- ↑ "Papum Pare District Population Religion - Arunachal Pradesh, Papum Pare Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2002-11-29. Retrieved 2014-03-06.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.
భౌగోళిక స్థితి
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- Official website Archived 2002-11-29 at the Wayback Machine
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with no coordinates
- అరుణాచల్ ప్రదేశ్ జిల్లాలు
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు పొందుతున్న జిల్లాలు
- 1999 స్థాపితాలు
- పాపుం పరే జిల్లా
- భారతదేశం లోని జిల్లాలు