తూర్పు కమెంగ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూర్పు కమెంగ్ జిల్లా
అరుణాచల ప్రదేశ్ పటంలో తూర్పు కమెంగ్ జిల్లా స్థానం
అరుణాచల ప్రదేశ్ పటంలో తూర్పు కమెంగ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల ప్రదేశ్
ముఖ్య పట్టణంసెప్పా
విస్తీర్ణం
 • మొత్తం4,134 km2 (1,596 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం78,413[1] (2,011)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత62.5%[1]
 • లింగ నిష్పత్తి1012[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి
ఝుమ్ అగ్ని
నైషి ప్రజలు

అరుణాచల ప్రదేశ్ రాష్ట్ర 17 జిల్లాలలో తూర్పు కమెంగ్ జిల్లా ఒకటి. జిల్లా ఉత్తరసరిహద్దులో టిబెట్, దక్షిణ సరిహద్దులో అస్సాం రాష్ట్రం, ఇతర సరి హద్దులలో పశ్చిమ కమెంగ్, పపుమ్‌ పరె, కురుంగ్ కుమె జిల్లాలు ఉన్నాయి. 2000 ఏప్రిల్ 1 న ఈ జిల్లాను దిగువ సుబన్‌సిరి లోని కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. చైనా ఆధ్వర్యంలో ఉన్న సమయంలో తూర్పు కమెంగ్ ప్రాంతం టిబెట్ కు చెందిన షన్నన్ ప్రిఫెక్చర్ కు చెందిన కువానా న్యాపరిధిలో ఉంది.

చరిత్ర[మార్చు]

కమెంగ్ నది పరిసర ప్రాంతాలు పలుమార్లు మాన్ సామ్రాజ్యం, టిబెట్, అహుం ఆధ్వర్యంలో ఉంటూవచ్చింది. ప్రధాన రాజకీయ శక్తుల ప్రాబల్యం లేని సమయాలలో ఈ ప్రాంతంపై అక, నిషి రాజప్రతినిధుల ఆధిక్యం ఉంటూ వచ్చింది. కమెంగ్ సరిహద్దు విభాగానికి కమెంగ్ జిల్లా అని పేరుపెట్టారు. రాజకీయ అధికరి స్థానంలో డెఫ్యూటీ కమీషనర్ ఆఫ్ కమెంగ్ నియామకం జరిగింది. రాజకీయాల కారణంగా 1980 జూన్ 1న కమెంగ్ జిల్లా తూర్పు కమెంగ్, పశ్చిమ కమెంగ్ జిల్లాలుగ విభజించబడింది.[2]

భౌగోళికం[మార్చు]

తూర్పు కమెంగ్ జిల్లా వైశాల్యం 4,134 చ.కి.మీ.[3] జిల్లా వైశాల్యపరంగా అలాస్కాలోని ఉనిమాక్ ద్వీపం వైశాల్యానికి సమానం.[4] పశ్చిమ కమెంగ్ జిల్లాలోలా తూర్పు కమెంగ్ జిల్లా ఉత్తర భూభాగంలో వాతావరణం పొడారిన చల్లదనం ఉంటుంది. అస్సాం సరిహద్దులో ఉన్న దక్షిణ భూభాగంలో ఉప ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంది.

ఆర్ధికం[మార్చు]

జిల్లాలోని గిరిజనులలో అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ భూమిని సిద్ధం చేసుకున్న తరువాత బార్లి, వరి వంటి పంటలు, పండ్ల తోటలు సాగుచేయబడుతున్నాయి. 1965-66 నుండి మొదలైన చేపల పరిశ్రమ 1980 నాటికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. చేపల పెంపకానికి " డిస్ట్రిక్ ఫిషరీ డెవెలెప్మెంట్ ఆఫీసర్ " ఆధ్వర్యం వహిస్తున్నాడు. అయినప్పటికీ దీనికి ఇంకా నిధుల కొరత ఉంది. గ్రామీణాభివృద్ధికి, వరి-చేపల కొరకు నిధులు అందించబడుతున్నాయి. ఆధునిక సాంకేతిక కారణంగా హార్టి కల్చర్ ఆధారంగా ఆఫిల్, ఆరెంజు పండ్లు పండించబడుతున్నాయి. ప్రస్తుతం ఉప ఉష్ణమండల పండ్లతోటలను రసాయనిక ఎరువులతో పండిస్తున్నారు.

విభాగాలు[మార్చు]

తూర్పు కమెంగ్ జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది : సెప్ప, చయంగ్తజో.

  • ఉప విభాగాలను అదనంగా 13 అడిమింస్ట్రేటివ్ డివిజన్లుగా విభజించారు :- చయంగ్తజో, సవ, ఖెనెవ, బమెంగ్, లడ, గ్యావే పురంగ్, పిపు, సెప్ప, రిచుక్రాంగ్, పిజిరాంగ్, పక్కె-కెస్సంగ్, సెయిజొస, డిస్సింగ్ పస్సొ.
  • జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :- బమెంగ్, చయ్ంగ్తజొ, తూర్పు సెప్ప, పశ్చిమ సెప్ప, పక్కే - కసంగ్. ఇవి మొత్తం పశ్చిమ అరుణాచల ప్రదేశ్ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[5]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 78,413,[1]
ఇది దాదాపు. డోమినిక దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 624వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 19 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 37.14%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 1012:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 62.48%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

ప్రజలు[మార్చు]

తూర్పు కమెంగ్ జిల్లాలో ఒకే జాతికి చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అలాగే వివిధ సంప్రదాయాలకు చెందినవారు, మతాలకు చెందిన వారు కూడా కలిసి జీవిస్తున్నారు. జిల్లాలోని నిషి ప్రజలు డొన్యి-పొలో మతాన్ని అవలంబిస్తున్నారు. ఇతర గిరిజనులలో మిజి, సులంగ్, అక ప్రజలు ప్రధానంగా కమెంగ్ నదీ తీరంలో నివసిస్తూ ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జిల్లాలోని అత్యధిక మంది ప్రజలను జిల్లా కేంద్రం సెప్పాకు తరలించారు. ఆధునికత ప్రవేశించిన తరువాత అక ప్రజల సరోక్, నిషి ప్రజల న్యోకుం, జంగ్లం - పొంక్లం, మిజి ప్రజల చిండాంగ్, గొంకుం-గుంపా ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటారు.

కొరొ[మార్చు]

ఈస్ట్ కమెంగ్ జిల్లాలో కొరొ భాష టిబెటో-బర్మన్ కుటుంబానికి చెందిన భాషను దాదాపు 800-1200 మంది అకా (హ్రుసొ) మాట్లాడుతున్నారు. అయునప్పటికీ మూలభాషలోని పదాలకంటే వారు వ్యత్యాసమైన పదాలను వాడుతున్నారు.[7][8] ఈ భాష తాని భాషను పోలి ఉంటుంది. ఇది టిబెటో-బర్మన్ భాషకంటే వేరుగా ప్రత్యేకంగా ఉంటుంది.[9] కొరొ భాష టిబెటో-బర్మన్ శాఖలాగా కాక కంటే ప్రత్యేకంగా ఉంట్జుంది.[10] పరిశోధకులు అభిప్రాయం అనుసరించి ఒకజాతి ప్రజలలో వాడుకలో ఉండి ఈ ప్రాంతానికి తీసుకురాబడిందని భావిస్తున్నారు. [11] 2010లో లింగ్స్టిక్ టీం ఆఫ్ డేవిడ్ హరిషన్, గ్రెగోరీ అండర్సన్, గనేష్ ముర్ము కొరొ భాషకు ప్రత్యేక అంతస్తు ఇచ్చింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఎండ్యూరింగ్ ప్రాజెక్ట్ కొరకు కొరొ భాషతో హ్రుసొ భాషలైన మిజి, అక భాషలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్చబడింది.[7] ఈ భాషను ఆరంభకాల పరిశోధకులు కూడా గుర్యించారని భావిస్తున్నారు. [12]

సంస్కృతి[మార్చు]

పర్యాటకం[మార్చు]

తూర్పు కమెంగ్ జిల్లాలో కొన్ని పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. వీటిలో " పఖుయి టైగర్ రిజర్వ్ " ఒకటి. ఇక్కడ విస్తారమైన వన్యమృగాలు ఉన్నాయి. సెప్పా గ్రామంలో అందమైన గిరిజనుల నృత్యాల ఉత్సవం పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ప్రకృతి సహజ సౌందర్యానికి ఈ నృత్యాలు మరింత మెరుగులు పెడుతుంది. బమెంగ్, చయంగ్‌తజో, పక్కె-కెస్సంగ్ హిల్ స్టేషన్ల నుండి హిమాలయ శిఖరాలు కనిపిస్తుంటాయి.

వృక్షజాలం , జంతుజాలం[మార్చు]

1977లో తూర్పు కమెంగ్ జిల్లాలో 862 చ.కి.మీ వైశాల్యంలో " పఖుయి విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. [13]

సెజోసా[మార్చు]

కమెంగ్ జిల్లాలోని ఒక సర్కిల్ సెజోసా. దీనికి ప్రస్తుతం అదనపు దెఫ్యూటీ కమీషనర్ నియామకం జరుగింది. ఇక్కడ ప్రధానంగా నిషి ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ " ది పక్కే విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఉంది. సెజోసా పక్కే నదీతీరంలో ఉంది. ప్రతి గురువారం అస్సాం లోని ఇటకోలా మొదలైన ప్రాంతాల నుండి కూరగాయలు, వస్త్రాలు అమ్మడానికి మొదలైనవి ప్రజలిక్కడికి వస్తుంటారు. అస్సాం, సెజోసా ప్రజలు పరస్పరం సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తరచుగా అస్సాం బంధ్ పిలుపు కారణంగా రహదారులు లింకు రోడ్లు మూసివేయడం వలన తరచుగా ప్రజలు ఇబ్బందులకు గురౌతుంటారు. నిర్వహణాలోపం కారణంగా సెజోసా ఇత్నాగర్ రహదారి చాలా సమస్యాత్మకమైనది, శ్రమతోకూడినదిగా ఉంది. రహదారిలో ఏర్పడుతున్న అసంఖ్యాకమైన గుంటలు వర్షపు నీటితో నిండి ప్రజలను మరింత ఇబ్బందులకు గురుచేస్తుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "districtcensus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  3. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Unimak Island 4,119km2
  5. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Dominica 72,969 July 2011 est.
  7. 7.0 7.1 Morrison, Dan "'Hidden' Language Found in Remote Indian Tribe". National Geographic Daily News, 5 October 2010. Retrieved 5 October 2010
  8. Schmid, Randolph E. "Researchers find previously undocumented language hidden in small villages in India" Archived 2010-10-07 at the Wayback Machine. Sync Retrieved on 5 October 2010
  9. "In Search for 'Last Speakers', a Great Discovery". National Public Radio. 5 October 2010. Retrieved 6 October 2010.
  10. Khan, Amina (6 October 2010). "Linguists uncover 'hidden' language in north India". Los Angeles Times. Retrieved 6 October 2010.
  11. Weise, Elizabeth (6 October 2010). "Linguists discover new language in India". USA Today. Retrieved 6 October 2010.
  12. Ethnologue, "Hruso".[1] (Some sound files)
  13. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.

వెలుపలి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాల జాబితా[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]