దీబాంగ్ లోయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Upper Dibang Valley జిల్లా
Arunachal Pradesh లో Upper Dibang Valley జిల్లా స్థానము
Arunachal Pradesh లో Upper Dibang Valley జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంArunachal Pradesh
ముఖ్య పట్టణంAnini
విస్తీర్ణం
 • మొత్తం9,129 కి.మీ2 (3,525 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం7,948[1]
 • పట్టణ
27.55
జనగణాంకాలు
 • అక్షరాస్యత64.8%[1]
 • లింగ నిష్పత్తి808[1]

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం లోని 17 జిల్లాలలో దిబాంగ్ లోయ జిల్లా ఒకటి.[2] ఈ జిల్లాలో డిబాంగ్ నది ప్రవహిస్తున్న కారణంగ దీనికీ పేరు వచ్చింది.[3] మిష్మి ప్రజలు దీనిని టాలన్ అంటారు. 9,128 చ.కి.మీ వైశాల్యం ఉన్న దిబాంగ్ లోయ జిల్లా రాష్ట్రంలో వైశాల్యపరంగా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ భారతదేశంలో అత్యల్ప జనసాంధ్రత ఉన్న జిల్లాలలో ఇది ప్రథమ స్థానంలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

1980లో లోహిత్ జిల్లాలో కొంత భాగం వేరుచేది దీబాంగ్ లోయ జిల్లా రూపొందించబడింది.[4]2011 డిసెంబరు 16న దీబాంగ్ లోయ జిల్లా ఎగువ దీబాంగ్ లోయ జిల్లా మరియు దిగువ దీబాంగ్ లోయ జిల్లాలుగా విభజించబడింది.[4]

భౌగోళికం[మార్చు]

రిపబ్లిక్ చైనాలో జన్మించిన డిబాంగ్ నది ఈ జిల్లాగిండా ప్రవహిస్తుంది కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాకు అనిని కేంద్రంగా ఉంది. ఇది భరదేశ ఉత్తర మరియు ఈశాన్య జిల్లాలలో చివరిది.

విభాగాలు[మార్చు]

దిబాంగ్ లోయ జిల్లాలో అనిని ఒక్కటే అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. ఇది అరుణాచల ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గాంలో భాగంగా ఉంది. .[5]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 7,948, [1]
ఇది దాదాపు. నౌరు దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 640వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.3%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 808:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 64.8%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

ప్రజలు[మార్చు]

దిబాంగ్ లోయ జిల్లాలో మిష్మి (ఇడు) ప్రజలు అధికంగా ఉన్నాయి. మిష్మి ప్రజలలో వారి వలస గురించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ కథలో చీతూ- హులుని ప్రాంతం మరియు మిష్మి ప్రజలు సంచరించిన 12 నదీ ప్రాంతాలు గురించిన వర్ణన ఉంది. వీరు మొదట అహూం రాజ్యంలో నివసించారని ఈ కథనాలు వివరిస్తున్నాయి. మిష్మి ప్రజలు సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తుంటారు.

మతాలు[మార్చు]

  • మొత్తం జనసంఖ్య : 7,272 (2001)
  • హిందువులు :3,639 (50.04%)
  • అనిమిస్ట్ : 2,881 (39.62%)
  • మతరహితం : 350 (4.81%)
  • బౌద్ధుల్య్ : 160 (2.20%)
  • ముస్లిములు : 126 (1.73%)
  • క్రైస్తవులు : 97 (1.33%)
  • సిక్కులు : 19 (0.26%)

భాషలు[మార్చు]

దిబాంగ్ లోయ జిల్లాలో మిష్మి, సిన్జొ-టిబెటన్ భాషలను దాదాపు 25,000 మంది ప్రజలు మాట్లాడుతున్నారు. దీనిని టిబెటన్ మరియు లాటిన్ లిపిలో వ్రాస్తుంటారు. [7]

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

దిబాంగ్ లోయ జిల్లా వన్యసంపదతో సుసంపన్నమై ఉంది. ఇక్కడ మిష్మి టాకిన్ మరియు గాంగ్షణ్ మౌంట్జాక్ వంటి అరుదైన క్షీరదాలున్నాయి. అలాగే స్కల్టర్ మోనల్ వంటి పక్షులు ఉన్నాయి. [8] సైన్సు ప్రపంచంలో సరికొత్తగా కనిపెట్టబడిన ఎగిరే ఉడుత కూడా ఈ జిల్లాలో కనిపిస్తుంది..[9]1991లో ఎగువ దిబాంగ్ లోయ జిల్లా, లో 4,149 చ.కి.మీ వైశాల్యంలో " దిబాంగ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.[10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 1.9 "Dibang Valley District Population Census 2011, Arunachal Pradesh literacy sex ratio and density". Census Organization of India. మూలం నుండి 3 January 2013 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  2. National Portal of India : Know India : Districts of India. India.gov.in.
  3. History : Lower Dibang Valley. Roing.nic.in (16 December 2001).
  4. 4.0 4.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  5. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011. Cite web requires |website= (help)
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Nauru 9,322 July 2011 est. line feed character in |quote= at position 6 (help); Cite web requires |website= (help)
  7. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Mishmi: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  8. Choudhury, Anwaruddin(2008) Survey of mammals and birds in Dihang-Dibang biosphere reserve, Arunachal Pradesh. Final report to Ministry of Environment & Forests, Government of India. The Rhino Foundation for nature in NE India, Guwahati, India. 70pp.
  9. Choudhury,Anwaruddin (2009).One more new flying squirrel of the genus Petaurista Link, 1795 from Arunachal Pradesh in north-east India. The Newsletter and Journal of the RhinoFoundation for nat. in NE India 8: 26–34, plates.
  10. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Retrieved 25 September 2011. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]