Jump to content

భారతదేశంలో సమాఖ్యవాదం

వికీపీడియా నుండి
(భారతదేశంలో ఫెడరలిజం నుండి దారిమార్పు చెందింది)

భారత రాజ్యాంగం భారత ప్రభుత్వ నిర్మాణాన్ని, సమాఖ్య (ఫెడరల్) ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలతో సహా నిర్దేశించింది.

భారత రాజ్యాంగంలోని 11వ భాగం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య శాసన అధికారాలు, పరిపాలన, కార్యనిర్వాహక అధికారాలను నిర్దేశిస్తుంది.[1] శాసన అధికారాలను కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల కింద వర్గీకరించారు. అవి వరుసగా, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలు, వాటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్న ఉమ్మడి అధికారాలు.

ఈ సమాఖ్యవాదం (ఫెడరలిజం) సమరూపంగా ఉంటుంది, దీనిలో రాజ్యాంగ విభాగాల అధికారాలు ఒకే విధంగా ఉంటాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధనతో చారిత్రాత్మకంగా, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం స్పష్టమైన, ఇంకా ఇతర రాష్ట్రాల కంటే భిన్నమైన హోదాను పొందింది. అయితే దీనిని 2019లో పార్లమెంటు రద్దు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు, ఏకీకృతం, నేరుగా కేంద్ర ప్రభుత్వం పాలనలో ఉంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1) అదనంగా ఎన్నికైన స్థానిక ప్రభుత్వంతో రెండు స్థాయిలలో పాలనను నిర్దేశిస్తుంది. ఢిల్లీ, పుదుచ్చేరిలకు వరుసగా ఆర్టికల్ 239AA, 239A కింద శాసన సభలు ఏర్పాటు చేసారు.[1]

లక్షణాలు

[మార్చు]
  • ప్రభుత్వంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలు ఉన్నాయి.
  • ఒకే ప్రాంతంలో పౌరులను పరిపాలిస్తున్నప్పటికీ ప్రతి స్థాయిలో ప్రభుత్వం చట్టం, పన్నులు, పరిపాలనలో దానికి స్వంత అధికార పరిధి ఉంటుంది.
  • రాజ్యాంగం ప్రభుత్వంలోని ప్రతి శ్రేణిలో అధికారాలు విధులు నిర్దేశిస్తుంది, హామీ ఇస్తుంది.
  • సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం ఉంది.

కుమార సింగం భారతదేశ సమాఖ్య విధానంలో మూడు విశిష్ట లక్షణాలు ఉన్నాయి ఈ విధంగా పేర్కొన్నాడు. అవి - మొదటిది సమాఖ్య వ్యవస్థకు విభజన, రాచరిక రాష్ట్రాలలో మూలాలు ఉన్నాయి. రెండవది, సరిహద్దులపై దానికున్న రాజ్యాంగ అధికారం. మూడవది, మొదటి దశాబ్దంలో విభిన్న సాంస్కృతిక అంశాలతో ప్రారంభంలోనే రాజీ.[2]

శాసన అధికారాలు

[మార్చు]

రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర శాసన అధికారాలను నిర్వచించి మూడు జాబితాలుగా విభజింఛాయాయి:[3]

యూనియన్ అధికారాల జాబితా

[మార్చు]

యూనియన్ అధికారాల జాబితాలో 100 అంశాలు ఉన్నాయి (పూర్వం 97). వీటిపై చట్టాన్ని రూపొందించడానికి పార్లమెంటుకు ప్రత్యేక అధికారం ఉంటుంది. ఇందులో రక్షణ, సాయుధ దళాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, అణుశక్తి, విదేశీ వ్యవహారాలు, యుద్ధం, శాంతి, పౌరసత్వం, అప్పగింత, రైల్వేలు, షిప్పింగ్, నావిగేషన్, విమానయానం, తపాలా, టెలిగ్రాఫ్‌లు, టెలిఫోన్‌లు, వైర్‌లెస్ ప్రసారం, కరెన్సీ, విదేశీ వాణిజ్యం, అంతర్-రాష్ట్ర వాణిజ్యం, వాణిజ్యం, బ్యాంకింగ్, బీమా, పరిశ్రమల నియంత్రణ, గనుల నియంత్రణ, అభివృద్ధి, ఖనిజ, చమురు వనరుల అభివృద్ధి, ఎన్నికలు, ప్రభుత్వ ఖాతాల తనిఖీ, రాజ్యాంగం, అత్యున్నత న్యాయస్తానం, ఉన్నత న్యాయస్థానాలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎగుమతి సుంకాలు, ఎక్సైజ్ సుంకాలు, కార్పొరేషన్ పన్ను, ఆస్తుల మూలధన విలువపై పన్నులు, ఎస్టేట్ సుంకం, టెర్మినల్ పన్నులు మొదలగునవి.[4]

రాష్ట్ర అధికారాల జాబితా

[మార్చు]

రాష్ట్ర జాబితాలో 61 అంశాలు ఉన్నాయి (గతంలో 66 అంశాలు). ఈ జాబితాలోని అంశాల్లో ఏకరూపత ఉండాలి కానీ తప్పనిసరి కాదు: శాంతిభద్రతలను నిర్వహించడం, పోలీసు బలగాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, భూ విధానాలు, రాష్ట్రంలో విద్యుత్, గ్రామ పరిపాలన మొదలైనవి. ఈ విషయాలపై చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభకు ప్రత్యేక అధికారం ఉంది. నిర్దిష్ట పరిస్థితులలో, రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై పార్లమెంటు చట్టాలు చేయవచ్చు, కానీ జాతీయ ప్రయోజనాల కోసం చట్టాలు చేయడానికి రాజ్యసభ (రాష్ట్రాల మండలి) మూడింట రెండు వంతుల ఆధిక్యతతో తీర్మానాన్ని ఆమోదించాలి.[1] రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించి చట్టాలు చేయడానికి రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నప్పటికీ, ఆర్టికల్ 249, 250, 252 253 ప్రకారం కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసే పరిస్థితులను పేర్కొన్నాయి.[4]

ఉమ్మడి జాబితా

[మార్చు]

ఉమ్మడి జాబితాలో 52 (పూర్వం 47) అంశాలు ఉంటాయి. ఈ జాబితాలోని అంశాలలో ఏకరూపత ఉండాలి కానీ అవసరం లేదు. జాబితాలో పేర్కొన్నవి: వివాహం, విడాకులు, వ్యవసాయ భూమి కాకుండా ఇతర ఆస్తి బదిలీ, విద్య, ఒప్పందాలు, దివాలా, ధర్మకర్తలు, ట్రస్ట్‌లు, సివిల్ ప్రొసీజర్, కోర్టు ధిక్కారం, ఆహార పదార్థాల కల్తీ, మందులు, విషాలు, ఆర్థిక, సామాజిక ప్రణాళిక, కార్మిక సంఘాలు, కార్మిక సంక్షేమం, విద్యుత్, వార్తాపత్రికలు, పుస్తకాలు, ముద్రణాలయాలు, స్టాంప్ డ్యూటీలు.[4]

ఇతర (మిగిలిన) అంశాలు

[మార్చు]

మూడు జాబితాలలో దేనిలోనూ చేరని విషయాలను మిగిలిన (రెసిడ్యూరీ సబ్జెక్ట్‌)లు అంటారు. అయితే, రాజ్యాంగంలోని అనేక నిబంధనల ప్రకారం ఈ జాబితాలకు వెలుపల ఉన్న విషయాల గురించి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ శాసనం చేయడానికి అనుమతిస్తాయి. ఆర్టికల్ 245 ప్రకారం ఈ జాబితాల వెలుపల ఉన్న రాజ్యాంగంలోని నిబంధనలను మినహాయిస్తే, అటువంటి విషయాలపై చట్టం చేసే అధికారం, ఆర్టికల్ 248 ప్రకారం ప్రత్యేకంగా పార్లమెంటుకు ఉంటుంది [5] రాజ్యాంగ సవరణలుగా ఆర్టికల్ 368 విధానాన్ని అనుసరించి మిగిలిన విషయాలపై పార్లమెంటు చట్టం చేస్తుంది.

పైన పేర్కొన్న జాబితాలను విస్తరించడం లేదా సవరించడం కోసం, అధిక రాష్ట్రాలచే ఆమోదించబడిన ఆర్టికల్ 368 అనుసరించి పార్లమెంటు తన రాజ్యాంగ అధికారం ప్రకారం చట్టం చేయాలి. ఫెడరలిజం అనేది భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగం, ఇది సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు లేకుండా పార్లమెంట్ రాజ్యాంగ అధికారాలకు లోబడి రాజ్యాంగ సవరణల ద్వారా మార్చబడదు లేదా నాశనం చేయబడదు.

కార్యనిర్వాహక అధికారాలు

[మార్చు]

కేంద్రం (యూనియన్), రాష్ట్రాలకు తమ ప్రభుత్వాధీనంలో ఉండే స్వతంత్ర కార్యనిర్వాహక సిబ్బందిఉంటుంది. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రకటించినప్పుడు మినహా రాష్ట్ర ప్రభుత్వం శాసన, పరిపాలనా విషయాలలో రాజ్యాంగ హక్కులు, అధికారాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయదు. ఆర్టికల్ 355, ఆర్టికల్ 256లను అనుసరించి రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని నిర్ధారించడం యూనియన్ విధి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిపాలనా వ్యవహారాల్లో కేంద్ర చట్టాలను ఉల్లంఘించకూడదు. ఒక రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు, ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. ఆర్టికల్ 357 ప్రకారం పార్లమెంట్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో సమ్మతితో రాష్ట్ర పరిపాలనను రాష్ట్రపతి చేపట్టవచ్చు.

ఆర్థిక అధికారాలు

[మార్చు]

ఆర్టికల్ 282 అనేది రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయడానికి ఆర్థిక స్వయంప్రతిపత్తిని కల్పిస్తుంది.[6] ఆర్టికల్ 293 కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా కూడా రాష్ట్రాలు అపరిమితంగా రుణాలు తీసుకునే అవకాశం ఇస్తుంది. ఆయినప్పటికీ, భారతదేశం కన్సాలిడేటెడ్ ఫండ్‌కు లేదా ఫెడరల్-గ్యారంటీతో కూడిన రుణానికి ఒక రాష్ట్రం బకాయిపడినప్పుడు, కేంద్ర ప్రభుత్వం తమ రుణ నిబంధనలను పాటించాలని పట్టుబట్టవచ్చు.[7]

భారత రాష్ట్రపతి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక ఆర్థిక కమిషన్‌ను ఏర్పాటు చేసి యూనియన్ రాబడులను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేయడానికి సిఫార్సు చేస్తారు. ఆర్టికల్ 360 ప్రకారం, దేశం ఆర్థిక స్థిరత్వం లేదా గౌరవానికి లేదా దాని భూభాగంలోని ఏదైనా భాగానికి ముప్పు ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఆర్థిక అత్యయిక పరిస్థితిని ప్రకటించవచ్చు. ఏదేమైనా, దేశం లేదా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం లేదా పంచాయతీ లేదా పురపాలక సంఘం లేదా కార్పొరేషన్ కోసం "ఆర్థిక అత్యవసర పరిస్థితి"ని ఏ మార్గదర్శకాలు నిర్వచించలేదు.

ఇలాంటి అత్యయిక పరిష్టితిని సాధారణంగా రెండు నెలల్లో ఆధిక్యతతో పార్లమెంటు ఆమోదించాలి. కానీ ఎన్నడూ ప్రకటించలేదు. రాష్ట్రపతి రద్దు చేసే వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి నిరవధికంగా అమలులో ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా అన్ని ప్రభుత్వ అధికారుల జీతాలను రాష్ట్రపతి తగ్గించవచ్చు. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన అన్ని ద్రవ్య బిల్లులు ఆమోదం కోసం రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఆయన ఆర్థిక చర్యలను గమనించమని రాష్ట్రాన్ని నిర్దేశించగలడు.

వివాదాల పరిష్కారం

[మార్చు]

రాష్ట్రాల మధ్య ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలతో లేదా కేంద్రపాలిత ప్రాంతం లేదా కేంద్ర ప్రభుత్వంతో వివాదం తలెత్తినప్పుడు, ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీం కోర్టు తీర్పునిస్తుంది. అయితే, ఆర్టికల్ 262 అనేది రాష్ట్రాల మధ్య నదీ జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణ వంటి విషయాలలో వచ్చే వివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు అధికార పరిధి లేకుండా చేసింది (మినహాయించింది).

ఆర్టికల్ 263 అనుసరించి రాష్ట్రపతి రాష్ట్రాలు, కేంద్రం (యూనియన్) మధ్య వివాదాలను సమన్వయం చేయడానికి లేదా పరిష్కరించడానికి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్రాలకు వారి స్వంత అధికార పరిధి ఉంటుంది.

కేంద్రపాలిత ప్రాంతాలు

[మార్చు]

రాజ్యాంగంలోని V (ది యూనియన్), VI (ది స్టేట్స్) భాగాలు వివరించిన విధంగా భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని ఆర్టికల్ 1 (1)పేర్కొంటుంది. ఆర్టికల్ 1 (3) ప్రకారం భారతదేశ భూభాగాలు అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర స్వాధీనం చేసుకున్న భూభాగాలు. ఏడవ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతం అనే భావన ఏర్పడింది.[8]

ఆర్టికల్ 370 సవరణ

[మార్చు]

భారత రాజ్యాంగం తాత్కాలిక ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక చట్టం ఉంది, ఇది జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి, 1954 ఆదేశాలను అనుసరించి (అనుబంధం I, II) ఉంది. (అయితే 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసారు) జమ్మూ కాశ్మీర్ రక్షణ, విదేశీ సంబంధాలు, కమ్యూనికేషన్లకు సంబంధించిన విషయాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉన్నాయి. భారత పార్లమెంటు ద్వారా రూపొందించబడిన (రాజ్యాంగానికి సవరణలతో సహా) మిగిలిన భారతదేశానికి వర్తించే చట్టాలు జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర అసెంబ్లీచే ఆమోదించబడినంత వరకు అక్కడ చెల్లవు.[9] భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. కొన్ని పరిస్థితులలో గవర్నర్ పాలన విధించవచ్చు. రాష్ట్రానికి వర్తించే భారత రాజ్యాంగం కాకుండా దాని స్వంత రాజ్యాంగం ఉంది.[10] జమ్మూ కాశ్మీర్, రాష్ట్ర రాజ్యాంగంలోని XIIవ విభాగం - రాష్ట్ర అసెంబ్లీ ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో దాని రాజ్యాంగాన్ని సవరించడానికి నిర్దేశించింది. ఆర్టికల్ 152 ఇంకా ఆర్టికల్ 308 ప్రకారం ఆలు జరిగే భారత రాజ్యాంగం VI (రాష్ట్రాలు), పార్ట్ XIV (సేవలు) జమ్మూ కాశ్మీర్‌కు వర్తించవు.

2019 ఆగస్టు 5న, భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాల ద్వారా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత పార్లమెంటులో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా జమ్మూ కాశ్మీర్ ఇంకా లడఖ్గా రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది [11]

యూనియన్ ప్రభుత్వ లక్షణాలు

[మార్చు]

రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1) ప్రకారం భారతదేశం రాష్ట్రాల సమ్మేళనం (యూనియన్‌). ఆర్టికల్ 3 (1956లో) సవరణ, రాష్ట్రపతి ముందస్తు సమ్మతితో యూనియన్ ప్రభుత్వ అధికారాన్ని (ఎ) ఏదైనా రాష్ట్రం, భూభాగాన్ని వేరు చేయడం ద్వారా లేదా దాని ద్వారా కొత్త రాష్ట్రం/కేంద్ర పాలితప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. ఇంకా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాలు లేదా రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాల భాగాలను ఏకం చేయడం లేదా ఏదైనా భూభాగాన్ని ఏదైనా రాష్ట్రం/కేంద్ర పాలితప్రాంతంలో ఒక భాగానికి ఏకం చేయడం ద్వారా (బి) ఇంతకు ముందు ఉనికిలో లేని కొత్త రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాన్ని (ఇవి గతంలో భారతదేశ భూభాగంలో లేవు) ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది.

గవర్నర్ల పాత్ర, నియామకం

[మార్చు]

రాష్ట్రపతి గవర్నర్ల నియామకం చేస్తారు. ఈ నియామకం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గవర్నర్లు సాధారణంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉండరు.

రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విచ్ఛిన్నమైతే, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అత్యవసర పరిస్థితిలో రాష్ట్రపతి పాలనను ఏర్పాటు చేసే అవకాశము ఆర్టికల్ 356 కలగచేస్తుంది. కేంద్రంలో ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయలేరు. ఇందిరా గాంధీ హయాంలో ఆర్టికల్ 356 దుర్వినియోగం తరువాత దశాబ్దాలలో ప్రబలంగా ఉంది.[12][13][14][15] 1991లో సర్వోన్నత న్యాయస్థానం దుర్వినియోగం జరిగిన ఈ విషయాలను అంగీకరిస్తూ ఒకచారిత్రాత్మకమైన తీర్పును జారీ చేసింది, రాష్ట్రాలలో అత్యవసర పరిస్థితిని అమలు చేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన సూత్రాలను జారీ చేసింది.

భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నర్‌లను అధికారులుగా నియమిస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్లు స్థానిక ప్రభుత్వ విధానాలను పార్లమెంటు సమ్మతి తీసుకున్న తర్వాత మాత్రమే అధిగమించగలరు.[16]

ఆర్థిక సమాఖ్యవాదం

[మార్చు]

రాష్ట్రాలు ఆర్థిక అత్యవసర పరిస్థితికి దారితీయనంత వరకు తమ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛను ఆర్టికల్ 360 కలిగిస్తుంది. భారత ప్రభుత్వం భారతదేశం అంతటా ఒకే విధంమైన పన్ను విధించేందుకు ప్రయత్నిస్తోంది వ్యక్తిగత రాష్ట్రాలపై దాని ప్రభావం పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాల పన్ను వసూళ్ల యంత్రాంగాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.[17][18] సాధారణ అమ్మకపు పన్ను (జిఎస్‌టి) సూత్రానికి విరుద్ధమైన ఎంట్రీ ట్యాక్స్ విధించే రాష్ట్రాల రాజ్యాంగ హక్కును సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది.[19]

1935 చట్టం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉన్న పరిశ్రమల నియంత్రణ యూనియన్ జాబితాకు బదిలీ చేయబడింది. 1952లో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్, బీహార్ (ప్రస్తుత జార్ఖండ్‌తో సహా), మధ్యప్రదేశ్ (ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌తో సహా), ఒరిస్సాతో సహా అనేక భారతీయ రాష్ట్రాలకు నష్టం కలిగించే సరుకు రవాణా సమీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది. కర్మాగారాలు ఇప్పుడు భారతదేశంలో ఎక్కడైనా పనిచేయగలవు కాబట్టి ఈ రాష్ట్రాలు ఖనిజ వనరులను కలిగి ఉన్న పోటీ ప్రయోజనాన్ని కోల్పోయాయి. స్వాతంత్ర్యానికి పూర్వం టాటాలు, దాల్మియాలు వంటి వ్యాపార సంస్థలు ఈ రాష్ట్రాల్లో పరిశ్రమలను స్థాపించినప్పుడు ఇంజనీరింగ్ పరిశ్రమ చాలా వరకు పశ్చిమ బెంగాల్‌లో ఉంది. 1990ల ప్రారంభంలో ఈ విధానం ముగిసిన తరువాత, ఈ రాష్ట్రాలు మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమంకాలేకపోయాయి. 1996లో, పశ్చిమ బెంగాల్ వాణిజ్యం & పరిశ్రమల మంత్రి "సరకు రవాణా సమీకరణ లైసెన్సింగ్ విధానాలను తొలగించడం అనేదానివలన ఇప్పటికే జరిగిన హానిని భర్తీ చేయలేము" అని ఫిర్యాదు చేశారు.[20]

జాతీయ చట్టాలు ఒక ప్రైవేట్/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి అంతర్గతంగాను, బయట నుండి కూడా తన సామర్థ్యానికి అనుగుణంగా రుణాలను సేకరించేందుకు అనుమతిస్తాయి. రాష్ట్రాలు రుణాలు తప్పనిసరి చేయనప్పుడు/ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు కూడా "ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 2003" రాష్ట్ర రుణాలను పరిమితం చేస్తుంది. రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండానే అనేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, ఫించన్ ల ఖర్చు మొత్తం రాష్ట్ర ఆదాయాన్ని మించిపోయింది. రాష్ట్ర విధానంలోని ఆదేశిక సూత్రాల ఆర్టికల్ 47 ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పానీయాలను నిషేధిస్తుంది, కానీ అమలు తప్పనిసరి చేయలేదు. బదులుగా అనేక రాష్ట్రాలు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తాయి, పన్ను విధించాయి.

భారత ప్రభుత్వ చట్టం (1935) / భారత రాజ్యాంగం (1950)

[మార్చు]
భారత ప్రభుత్వ చట్టం (1935)[21]
భారత రాజ్యాంగం (1950 తరువాత)[22]
భారతదేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా నిర్వచిస్తుంది భారతదేశాన్ని రాష్ట్రాల ఐక్యత (యూనియన్‌)గా

నిర్వచిస్తుంది

రాజరికపు ప్రాంతాలకు "ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్"

ద్వారా ఫెడరేషన్‌లోచేరడానికి లేదా బయట ఉండడానికి ఎంచుకోవచ్చు

రాష్ట్రాలకు విడిపోయే హక్కు లేదు. "ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్"
2019 ఆగస్టు 5 వరకు ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే 

వర్తించింది. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

రాజరికపు రాష్ట్రాలు తమ స్వంత రాజ్యాంగాన్ని కలిగి

ఉండవచ్చు

జమ్మూ కాశ్మీర్ కి మాత్రమే దాని స్వంత రాజ్యాంగం ఉంది

( 2019 ఆగస్టు 5 న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం రద్దు చేయబడింది).

అనేక రాష్ట్రాలు అనుబంధ నాణేలను ముద్రించడానికి,

రాష్ట్ర జెండాలను, స్వతంత్ర పౌర, క్రిమినల్ కోడ్‌లను ఉపయోగించుకునే హక్కులుకలిగి ఉన్నాయి. రాష్ట్రాలు పారామిలిటరీ బలగాలను నిర్వహించాయి.

జమ్మూ కాశ్మీర్ మినహా ( 2019 ఆగస్టు 5 వరకు), ఏ రాష్ట్రమూ

ప్రత్యేక క్రిమినల్ కోడ్ అనుసరించదు. గోవాలో మాత్రమే భిన్నమైన సివిల్ కోడ్ ఉంది. పారామిలటరీ బలగాలను కేంద్ర ప్రభుత్వం మాత్రమే నియంత్రిస్తుంది. ఏ రాష్ట్రమూ కరెన్సీని ముద్రించదు.

భారతదేశ చక్రవర్తి, భారత గవర్నర్ జనరల్ అరాజకీయ

దేశాధినేతలు

భారత రాష్ట్రపతి పరోక్షంగా ఎన్నికైన దేశాధినేత.
ప్రావిన్షియల్ గవర్నర్‌లను గవర్నర్-జనరల్, రాజకీయాలకు

సంబంధం లేకుండా నియమిస్తారు

కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారు.
ప్రావిన్సుల గవర్నర్లు రాష్ట్ర నివాసితులు కానవసరం లేదు రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్ర నివాసితులు కానవసరం లేదు.
ప్రావిన్సులను సృష్టించే, సవరించే లేదా రద్దు చేసే హక్కు

పూర్తిగా భారత గవర్నర్-జనరల్ చేతుల్లో ఉంటుంది

రాష్ట్రాలను సృష్టించే, సవరించే లేదా రద్దు చేసే హక్కు పూర్తిగా

భారత పార్లమెంటు చేతుల్లోనే ఉంటుంది.

అధికారాలు ఫెడరల్, ఉమ్మడి, ప్రొవిన్షియల్ జాబితాలుగా

విభజించబడ్డాయి.

అధికారాలు యూనియన్, ఉమ్మడి రాష్ట్ర జాబితాలుగా

విభజించబడ్డాయి.

అవశేష అధికారాలు భారత గవర్నర్ జనరల్‌కు ఉంటాయి అవశేష అధికారాలు భారత పార్లమెంటుకు ఉంటాయి.
ప్రావిన్షియల్ అత్యయిక పరిస్థితిని గవర్నర్-జనరల్

ప్రకటించారు. ఈ కాలంలో గవర్నర్ మాత్రమే ప్రావిన్స్ కోసం చట్టాలను రూపొందించగలరు. ప్రావిన్షియల్ అసెంబ్లీ రద్దు చేయబడింది.

కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి రాష్ట్ర అత్యవసర

పరిస్థితిని ప్రకటిస్తారు. ఆ సమయంలో రాష్ట్రానికి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయబడింది.

సెంట్రల్ ఎమర్జెన్సీని గవర్నర్ జనరల్ ప్రకటిస్తారు.

ఈ కాలంలో అతను మాత్రమే ఫెడరేషన్ కోసం చట్టాలు చేయగలడు. కేంద్ర శాసన సభ రద్దయింది.

సెంట్రల్ లేదా యూనియన్ అత్యయిక పరిస్థితి అనే భావన

లేదు. పార్లమెంటు ఎప్పుడూ పని చేసేలా ఉండాలి.

క్షమాభిక్ష, పిటిషన్లు వంటి న్యాయపరమైన విషయాలను

న్యాయ మండలి సలహా మేరకు గవర్నర్ జనరల్ నిర్ణయిస్తారు

న్యాయపరమైన విషయాలను కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు

రాష్ట్రపతి నిర్ణయిస్తారు.

రైల్వేలు, పరిశ్రమలు ఉమ్మడి జాబితాలోని అంశాలు రైల్వేలు, పరిశ్రమలు యూనియన్ జాబితాలో సబ్జెక్ట్ విషయాలు.
బ్రిటీష్ సామ్రాజ్యం అంతటా ఉద్యమ స్వేచ్ఛ, ఆస్తిని

సొంతం చేసుకునే హక్కు, సంబంధిత ప్రావిన్సులలో మాత్రమే స్థిరపడుతుంది

భారతదేశం అంతటా తిరిగే స్వేచ్ఛ, జమ్మూ కాశ్మీర్ మినహా

భారతదేశంలో ఎక్కడైనా ఆస్తిని కలిగి ఉండటానికి, స్థిరపడే హక్కు ఉంటుంది. (కానీ 2019 ఆగస్టు 5 తర్వాత, భారతదేశం అంతటా జమ్మూ కాశ్మీర్ తో సహా స్వేచ్ఛ ఉంది.)

యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటు చేస్తే తప్ప చట్టంలో

సవరణ సాధ్యం కాదు

పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీతో

రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్‌కు సవరణలు చేయవచ్చు. కొన్ని ఆర్టికల్స్‌కు సగం రాష్ట్ర శాసనసభల ఆమోదం కూడా

అవసరం.

అమెరికా, ఐరోపా దేశాలతో భారత్ పోలిక

[మార్చు]

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA), యూరోపియన్ యూనియన్ (EU)తో భారతీయ సమాఖ్య వాదం పోలిక

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
యూరోపియన్ యూనియన్
భారతదేశం
యూనియన్ నుంచి రాష్ట్రాలు ఏకపక్షంగా

విడిపోవడానికి వీల్లేదు.

ఏ సభ్య దేశమైనా ఏ సమయంలోనైనా ఒకే

వాణిజ్యం నుండి నిష్క్రమించవచ్చు. దీని కోసం, సాధారణంగా, ఉపసంహరణ ఒప్పందం చర్చలు జరపాలి. కొంత మధ్య కాలం ఉండవచ్చు.

ప్రాదేశిక సమగ్రత అనేది రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో

భాగం కాదు. 9వ, 100వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ భూభాగం బంగ్లాదేశ్‌కు అప్పగించబడింది. భారత రాజ్యాంగంలోని ఒకటి నుండి నాలుగు ఆర్టికల్స్ ప్రకారం, యూనియన్ నుండి ఏ రాష్ట్రమూ విడిపోకూడదు.

అమెరికా కాంగ్రెస్ ప్రభావిత రాష్ట్రాల సమ్మతితో

మినహా రాష్ట్రాల విలీనం లేదా విభజన అనుమతించబడదు.

సభ్యదేశాల విలీనం లేదా విభజన సంబంధిత

సభ్య దేశ పౌరుల సమ్మతితో మాత్రమే సాధ్యమవుతుంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు - రాష్ట్రాల విలీనం

లేదా విభజనను అవకాశం ఉంటుంది. అటువంటి అధికారం భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉంటుంది.

యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిని పౌరులు ఎలక్టోరల్

కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. అమెరికా ఒక అధ్యక్ష రిపబ్లిక్.

యూరోపియన్ యూనియన్ అధికారాన్ని యూరోపియన్

కౌన్సిల్ సమష్టిగా ఉపయోగిస్తుంది, ఇది యూరోపియన్ యూనియన్ మొత్తం ప్రాధాన్యతలు, రాజకీయ దిశలను నిర్వచించే సైద్ధాంతికమైన సంస్థ. ఇందులో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల దేశాధినేతలు, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. (తరువాతి ఇద్దరికి ఓటింగ్ అధికారం లేదు)

భారత రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి

సాధారణంగా మెజారిటీ పార్టీ లేదా లోక్‌సభలో అతిపెద్ద పార్టీ నాయకుడు ఒక నిర్దిష్ట లోక్‌సభ నియోజకవర్గం పౌరులచే నేరుగా ఎన్నుకోవచ్చు లేదా పరోక్షంగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకోవచ్చు.

వ్యక్తిగత రాష్ట్రాల పౌరులు నేరుగా తమ

గవర్నర్‌ను ఎన్నుకుంటారు.

దేశాధినేత ఎన్నిక సభ్యదేశాన్ని బట్టి సభ్యదేశానికి

మారుతూ ఉంటుంది.

రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ సలహాతో రాష్ట్రాల గవర్నర్లను

నియమిస్తారు. ముఖ్యమంత్రులు సాధారణంగా మెజారిటీ పార్టీ లేదా రాష్ట్ర శాసనసభలలో (విధానసభ) అతిపెద్ద పార్టీ నాయకులుగా ఉంటారు, వీరు ఒక నిర్దిష్ట శాసనసభ నియోజకవర్గం నుండి పౌరులచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు లేదా పరోక్షంగా సభ్యునిగా ఎన్నుకోబడతారు. రాష్ట్ర శాసన మండలి (విధాన పరిషత్).

రాష్ట్రాల మధ్య కార్మికులు వస్తువుల ఉచిత

తరలింపు అనుమతించబడుతుంది.

యూరోపియన్ యూనియన్ ముఖ్య ఉద్దేశం సభ్య

దేశాల మధ్య కార్మిక వస్తువుల స్వేచ్ఛా కదలిక.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 301, 303 ప్రకారం రాష్ట్రాల

మధ్య కార్మికులు, వస్తువుల ఉచిత తరలింపు అనుమతించబడుతుంది. వలస కార్మికుల ప్రయోజనాలు "ఇంటర్‌స్టేట్ మైగ్రెంట్ వర్క్‌మెన్ యాక్ట్ 1979" ద్వారా రక్షించబడతాయి.

ఫెడరల్ ప్రభుత్వ నియంత్రణలో ఒకే కరెన్సీ,

విదేశాంగ విధానం సాయుధ దళాలు ఉన్నాయి.

యూరోజోన్‌లో భాగమైన అన్ని యూరోపియన్

యూనియన్ సభ్య దేశాలకు ఒకే కరెన్సీ ఉంది; విదేశాంగ విధానం, సాయుధ దళాలు వ్యక్తిగత సభ్య దేశాల బాధ్యత.

భారత ప్రభుత్వ నియంత్రణలో ఒకే కరెన్సీ, విదేశాంగ

విధానం సాయుధ దళాలు ఉన్నాయి.

ప్రతి రాష్ట్రానికి పన్నులు విధించడం అప్పులు

పెంచడం రాజ్యాంగ హక్కు.

యూరోపియన్ యూనియన్ స్వయంగా పన్నులు

పెంచడానికి రుణాన్ని పెంచడానికి అధికారం లేదు, కానీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పరోక్షంగా ఆర్థిక విధానాన్ని ప్రభావితం చేయగలదు.

ప్రతి రాష్ట్రానికి కొన్ని పన్నులు విధించి అప్పులు పెంచే

రాజ్యాంగ హక్కు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో కొంత భాగం ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్రాలకు కేటాయించబడుతుంది.

సాధారణంగా, ప్రజలు ఒక భాష మాట్లాడతారు.

లౌకిక రాజ్యాంగం క్రింద బహుళ మతాలను అనుసరిస్తారు.

సాధారణంగా, బహుభాషా వ్యక్తులు లౌకిక రాజ్యాంగాల

ప్రకారం ఒక మతాన్ని అనుసరిస్తారు.

లౌకిక రాజ్యాంగం క్రింద బహుభాషా వ్యక్తులు బహుళ

మతాలను అనుసరిస్తారు.

అత్యంత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశం. అత్యంత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య

దేశాల యూనియన్.

అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశం.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "The Constitution of India". Lawmin.nic.in. Archived from the original on 2 April 2012. Retrieved 21 March 2012.
  2. Kumarasingham, Harshan (2013). A political legacy of the British Empire: power and the parliamentary system in post-colonial India and Sri Lanka. I.B. Tauris. pp. 91–92. ISBN 9781780762289.
  3. Robert L. Hardgrave and Stanley A. Koachanek (2008). India: Government and politics in a developing nation (Seventh ed.). Thomson Wadsworth. p. 146. ISBN 978-0-495-00749-4.
  4. 4.0 4.1 4.2 Fadia, Babulal (1984). State politics in India Volume I. Radiant publishers, New Delhi. pp. 92–122.
  5. "Pages 311 & 312 of A. K. Roy, Etc vs Union Of India And Anr on 28 December, 1981". Indiankanoon.org. Retrieved 23 August 2014.
  6. "Supreme Court Judgement: Bhim Singh vs U.O.I & Ors on 6 May, 2010". Indiankanoon.org. Retrieved 21 March 2012.
  7. "Article 293 and its application" (PDF). Fincomindia.nic.in. Retrieved 21 March 2016.
  8. "The Constitution (Seventh Amendment) Act, 1956". Archived from the original on 1 May 2017. Retrieved 17 September 2017.
  9. "Central acts applicable to J&K state" (PDF). Jklaw.nic.in. Archived from the original (PDF) on 22 June 2014. Retrieved 23 August 2014.
  10. "Constitution of J&K state" (PDF). Jklegislativeassembly.nic.in. Archived from the original (PDF) on 3 September 2014. Retrieved 23 August 2016.
  11. "Central acts applicable to J&K state". livemint.com. 5 August 2019. Retrieved 5 August 2019.
  12. Singh, Prabhat (11 February 2015). "Has Article 356 been the Centre's AK-56?". Livemint.com. Retrieved 18 October 2017.
  13. "Fact-Check on the Use and Abuse of President's Rule in India". Thequint.com. April 2016. Retrieved 18 October 2017.
  14. Hegde, Sanjay. "The Judiciary Can Stop the Misuse of Article 356, If It Chooses to Act – The Wire". Thewire.in. Retrieved 18 October 2017.
  15. "Article 356: Its Use and Misuse". Jagranjosh.com. 1 April 2016. Retrieved 18 October 2017.
  16. "Supreme Court refuses to stay order declaring L-G Jung Delhi's boss". Hindustantimes.com. 9 September 2016. Retrieved 18 October 2017.
  17. "Gujarat opposes GST regime". Timesofindia.indiatimes.com. Retrieved 21 March 2016.
  18. "There is merit in Jayalalithaa's arguments against GST bill says Subramanian Swamy". 2016-06-15. Retrieved 20 June 2016.
  19. "Supreme Court rules states have right to levy entry tax on goods coming in". Dnaindia.com. 2016-11-11. Retrieved 13 November 2016.
  20. Sinha, Aseema (2005). The Regional Roots Of Developmental Politics In India: A Divided Leviathan. Indiana University Press. pp. 114–. ISBN 978-0-253-34404-5. Retrieved 15 February 2013.
  21. Government Of India (18 October 2017). "The Government Of India Act 1935". Internet Archive. Retrieved 18 October 2017.
  22. "THE CONSTITUTION OF INDIA" (PDF). Lawmin.nic.in. Archived from the original (PDF) on 16 April 2016. Retrieved 18 October 2017.