ఝలావర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఝలావర్ జిల్లా
భారతదేశంలోని రాజస్థాన్‌లోని ఝలావర్‌లోని కాళీ సింధ్ నది నుండి గాగ్రోన్ కోట
భారతదేశంలోని రాజస్థాన్‌లోని ఝలావర్‌లోని కాళీ సింధ్ నది నుండి గాగ్రోన్ కోట
రాజస్థాన్ రాష్ట్రంలో ఝలావర్ జిల్లా స్థానం
రాజస్థాన్ రాష్ట్రంలో ఝలావర్ జిల్లా స్థానం
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
ప్రధాన పరిపాలనా కేంద్రంఝలావర్
Area
 • మొత్తం6,928 km2 (2,675 sq mi)
Population
 (2011)
 • మొత్తం14,11,129
 • Density200/km2 (530/sq mi)
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో ఝలావర్ జిల్లా ఒకటి. జిల్లా వాయవ్య సరిహద్దులో కోట జిల్లా, ఈశాన్య సరిహద్దులో బరన్ జిల్లా, తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునా జిల్లా, దక్షిణ సరిహద్దులో రాజ్‌గఢ్ జిల్లా జిల్లా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లా, మంద్‌సౌర్ జిల్లా జిల్లా, నిమచ్ జిల్లాలు ఉన్నాయి.జిల్లా వైశాల్యం 6928 చ.కి.మీ ఉంది. జిల్లా కోట్ విభాగంలో భాగంగా ఉంది. ఝలావర్ పట్టణం ఈ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంది..

పేరువెనుక చరిత్ర[మార్చు]

ఝలావర్ నగరంలోని కోట దృశ్యం

ఈ ప్రాంతంలో ఝలావర్ రాజవంశస్థులు అధికంగా నివసించడం వలన ఇక్కడ ఝలావర్ రాజాస్థానం స్థాపించబడింది. ఝలావర్ రాజాస్థానం జిల్లాగా రూపొందినందున ఈ జిల్లాకు ఝలావర్ జిల్లా అని నామకరణం చేయబడింది.

చరిత్ర[మార్చు]

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు ఈ ప్రాంతం ఝలావర్ రాజాస్థానంలో భాగంగా ఉంది. 1838 ఏప్రిల్ 8 న కోట రాజాస్థానం నుండి ఝలావర్ రాజాస్థానం స్థాపించబడింది.

భౌగోళికం[మార్చు]

జిల్లా రాజస్థాన్‌లోని హదోతి భూభాగంలో మల్వా ప్లాట్యూ చివరి భాగంలో ఉంది. జిల్లా మధ్యభాగం నుండి ఉత్తర దిశగా కాళీసింధ్ నది ప్రవహిస్తుంది.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఝలావర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు[మార్చు]

జిల్లాలో 6 ఉపవిభాగాలు ఉన్నాయి: ఝలావర్, అక్లెర, భవని మంది, పిరవ, ఖంపుర్ అంద్ మనోహర్ థాన.

చారిత్రిక జనాభా[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19012,53,651—    
19113,01,449+1.74%
19212,99,617−0.06%
19313,30,140+0.97%
19413,74,596+1.27%
19514,05,036+0.78%
19614,91,872+1.96%
19716,23,763+2.40%
19817,84,998+2.33%
19919,56,971+2.00%
200111,80,323+2.12%
201114,11,129+1.80%
source:[2]

2011 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,411,327, [3]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 349వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 227 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.57%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 945:1000, [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 62.13%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ప్రజలు మీనాలు: భిల్లులు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. Decadal Variation In Population Since 1901
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301

సరిహద్దులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]