Jump to content

ఉదయ్‌పూర్ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 24°23′N 73°37′E / 24.383°N 73.617°E / 24.383; 73.617
వికీపీడియా నుండి
ఉదయ్‌పూర్
ఎడమ నుండి సవ్యదిశలో: సిటీ ప్యాలెస్, జైసమంద్ సరస్సు, ఉదయపూర్ వద్ద ఘాట్‌లు, ఆరావళి హిల్స్, జగదీష్ ఆలయం నుండి ఉదయపూర్ దృశ్యం
రాజస్థాన్ పటంలో ఉదయ్‌పూర్ జిల్లా స్థానం
రాజస్థాన్ పటంలో ఉదయ్‌పూర్ జిల్లా స్థానం
Coordinates (ఉదయ్‌పూర్): 24°23′N 73°37′E / 24.383°N 73.617°E / 24.383; 73.617
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
పరిపాలనా విభాగంఉదయ్‌పూర్ విభాగం
పరిపాలనా కేంద్రంఉదయ్‌పూర్
తహశీల్స్1. బద్గావ్ 2. భిందర్ 3. గిర్వా 4. గోగుండా 5. జాడోల్ 6. కానోర్ 7. ఖేవారా 8. కొట్రా 9. లాసాడియా 10. మావ్లి 11. రిషాబ్డియో
విస్తీర్ణం
 • మొత్తం11,724 కి.మీ2 (4,527 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం30,68,420
 • జనసాంద్రత260/కి.మీ2 (680/చ. మై.)
 • Urban
19.83%
జనాభా
 • అక్షరాస్యత61.82%[1]
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)
జాతీయ రహదారులుఎన్ఎచ్ 8, 76
సగటు వార్షిక అవపాతం554 మి.మీ

ఉదయపూర్ జిల్లా, పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జిల్లాల్లో ఇది ఒకటి.[2] ఇది చారిత్రాత్మక నగరం. ఉదయపూర్ ఈ జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం.[1] ఈ జిల్లా రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతంలో ఒక భాగం.[3]

చరిత్ర

[మార్చు]

ఉదయపూర్ జిల్లా స్థాపించబడటానికి ముందు, స్వతంత్ర భారతదేశంలో ఇది మాజీ మేవార్ లేదా ఉదయపూర్ రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేది.[1] ఇది పూర్వ రాష్ట్రంలో సగం కంటే తక్కువ భాగాన్ని కలిగిఉంది.[3] 1948 లో రాజస్థాన్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో,గిర్వా, ఖమ్నోర్, రాజ్‌నగర్, భీమ్, మాగ్రా, ఖేవారా కుంభాల్‌గఢ్ జిల్లాలోని కొన్ని భాగాలతో పాటు, నాథ్వారా, కంక్రోలి, సలుంబర్ (సైరా తహసీల్ మినహా), భిందర్, కానోర్, బన్సీ, బారి సద్రి, అమేట్, సర్దర్‌గఢ్, డియోగఢ్, గోగుండాలను కలిపి ఉదయపూర్ జిల్లాగా ఏర్పడింది.[1]

1951-61 దశాబ్ద కాలంలో, జిల్లాలో నాథ్ద్వార, గోగుండా అనే రెండు కొత్త తాలూకాలు సృష్టించబడ్డాయి.[3] 1991లో, ఉదయపూర్ జిల్లాలోని భీమ్, డియోగఢ్, అమేత్, కుంభల్‌గఢ్, రాజ్‌సమంద్, నాథ్ద్వారా, రైల్‌మగ్రా ఏడు తాలూకాలు కొత్తగా ఏర్పడిన రాజ్‌సమంద్ జిల్లాలో కలిపారు.[1] అప్పటి నుండి, ఇప్పటికే ఉన్న తహసీల్‌లను పునర్నిర్మించడం లేదా విభజించడం ద్వారా జిల్లాలో సృష్టించబడిన ఇటువంటి కొత్త తాలూకాలు ఉన్నాయి.అటువంటివాటిలో 2008 లో సృష్టించబడిన రిషబ్‌డియో, లాసాడియా, 2012 లో బాడ్‌గావ్ [4] 2017 లో భిందార్,[5] 2018 లో కానోర్ వంటి కొత్త తాలూకాలు ఉన్నాయి.[6]

భౌగోళికం

[మార్చు]

ఉదయపూర్ జిల్లా వైశాల్యం 11,724 చదరపు కిలోమీటర్లు ఉంది.[7] జిల్లాలో పశ్చిమ, దక్షిణాన కొండలుతో ఉన్న భూభాగం, ఉత్తరాన ఎత్తైన పీఠభూమి, తూర్పున మైదానాలు ఉన్నాయి.[3][8] జిల్లా పశ్చిమ భాగంలో సబర్మతి, వకాల్, సెయి నదులు, ఆగ్నేయ భాగంలో జఖం, గోమతి, సోమ్ నదులు ఉన్నాయి.

ఉదయపూర్ జిల్లా వాయవ్య దిశలో అరవల్లి రేంజ్ సరిహద్దులో ఉంది.వీటిలో సిరోహి, పాలి జిల్లాలు ఉన్నాయి.[9] ఇది ఉత్తరాన రాజ్‌సమంద్ జిల్లా, తూర్పున చిత్తౌర్‌గఢ్ జిల్లా, ప్రతాప్‌గఢ్ జిల్లా, దక్షిణాన దుంగార్‌పూర్ జిల్లా, నైరుతిలో గుజరాత్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.

ఖండాంతరాలలో పుట్టిన నదులు, అరవల్లి పర్వత శ్రేణుల ద్వారా, జిల్లాగుండా ప్రవహిస్తుంటాయి. జిల్లాలోని ఈశాన్య భాగంలోని బంగాళాఖాతంలోకి, నైరుతి భాగంలోని ఖంబాట్ గల్ఫ్‌కు పారుతుంటాయి.[10] జిల్లా విస్తీర్ణంలో 47% మాహి నది ప్రాంతంలో 30% సబర్మతి నది ప్రాంతంలో, 23% బనాస్ నది ప్రాంతంలోఉంది. జిల్లాలో సగటు వార్షిక వర్షపాతం 637 మి.మీ ఉంది.[8]

జనాభా

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19013,47,896—    
19114,30,225+23.7%
19214,56,868+6.2%
19315,22,826+14.4%
19416,23,505+19.3%
19517,33,014+17.6%
19619,09,566+24.1%
197111,85,788+30.4%
198115,74,876+32.8%
199119,52,388+24.0%
200124,81,201+27.1%
201130,68,420+23.7%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఉదయపూర్ జిల్లా 3.068.420 మంది జనాభాను కలిగిఉంది.[11] ఇది సుమారు ఒమన్ దేశానికి సమంగా ఉంది.[12] లేదా అమెరికా సంయుక్త రాష్ట్రం అయోవాకు సమంగా ఉంది.[13] ఇది భారతదేశంలో 2011 నాటికి ఉన్న640 జిల్లాలలో జనాభా పరంగా ఇది 118 వ ర్యాంకులో ఉంది.జిల్లా జనాభా సాంద్రత చ.కి.మీ.కు 242 గాను (630 చ.మై)గా ఉంది. 2001 జనాభా లెక్కలుతో పోల్చగా 2011 నాటికి (దశాబ్దంలో) దాని జనాభా వృద్ధి రేటు 23.66%కు పెరిగింది. ఉదయపూర్ జిల్లా లింగ నిష్పత్తిని ప్రతి 1000 మంది పురుషులకు 958 మహిళలు ఉన్నారు. జిల్లా అక్షరాస్యత రేటు 62,74%గా ఉంది.

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 77.68% మంది హిందీ, 19.23% మంది భిలి, 1.06% మంది పంజాబీ, 0.67% మంది ఉర్దూ, 0.45% మంది, సింధీ మొదటి భాషగా మాట్లాడేవారు ఉన్నట్లుగా గణాంకాల ద్వారా తెలుస్తుంది.[14]

ఈ ప్రాంతాల్లో పెద్ద గిరిజన జనాభా ఉన్నందున జిల్లాలోని అనేక ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా వర్గీకరించారు.[15] జిల్లాలో ఎక్కువ మొత్తంలో షెడ్యూల్డ్ ప్రాంతాలు తాలూకాలు ఉన్నాయి.వాటిలో కోత్రా, జాడోల్, లాసాడియా, సాలంబర్, శారద, ఖేవారా, రిషభ్డియో, గోగుండా, గిర్వా, మావ్లి, వల్లభానగర్.జిల్లాలోని 2,479 గ్రామాలలో 1,945 గ్రామాలు (78%) గిరిజన ఉప ప్రణాళిక కింద రూపొందించబడ్డాయి.[16]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
ఉదయపూర్ జిల్లా మ్యాప్

ఉదయపూర్ జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది.జిల్లాలో 61.7 శాతం మంది కార్మికులు వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ సాగుదారులుగా ఉన్నారు.[1]

ఉదయపూర్ జిల్లా ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉంది. మిగతా రాష్ట్రాల కన్నా ఖనిజాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.[1] జిల్లాలోకాపర్, సీసం, జింక్, వెండి మొదలగునవి లభించే ముఖ్యమైన లోహ ముడి ఖనిజాలు. జిల్లాలో లభించే ముఖ్యమైన లోహేతర ఖనిజాలు రాక్ ఫాస్ఫేట్, ఆస్బెస్టాస్, సున్నపురాయి, పాలరాయి మొదలగునవి.[17]

విభాగాలు, ఉపవిభాగాలు, తాలూకాలు

[మార్చు]

ఉదయపూర్ జిల్లాలో ఎనిమిది ఉపవిభాగాలు ఉన్నాయి: గిర్వా, ఖేర్వాడ, మావ్లి, వల్లభనగర్, కొట్టా, జాడోల్, రిషభదేవ్ సాలంబర్.[1] ఈ ఉపవిభాగాలను 15 తాలూకాలుగా విభజించారు.[18] గిర్వా ఉప విభాగంలో కలిగి గిర్వా గోగుండా అనే రెండు తాలూకాలు ఉన్నాయి.ఖేర్వాడ ఉపవిభాగంలో ఖేర్వాడ, రిషభదేవ్ అనే రెండు తాలూకలు ఉన్నాయి. మావ్లి, వల్లభనగర్, కొట్టా జాడోల్ ఉపవిభాగాలు ప్రతిదీ ఒకే పేరుతో ఒక తాలుకాగా మాత్రమే ఉన్నాయి.సాలంబర్ ఉపవిభాగంలో లాసాడియా, సలుంబర్, శారద అనే మూడు తాలుకాలుగా ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 District Census Handbook Udaipur, Village and Town Directory Part XII-A. Series-09, Part XII-A. Directorate of Census Operations Rajasthan. 2011.
  2. "Statistical Data of Rajasthan State Pertaining to Census-2011". www.rajcensus.gov.in. Retrieved 2018-09-07.
  3. 3.0 3.1 3.2 3.3 Agarwal, B.D. (1979). Rajasthan District Gazeteers Udaipur. Jaipur: Directorate of District Gazeteers.
  4. "Badgaon bani tehsil". Udaipur News. 18 June 2012. Retrieved 18 April 2019.
  5. "Saat jilo mein nau nai tehsilo ka gathan". Dainik Bhaskar. 8 November 2017. Retrieved 18 April 2019.
  6. "Notification No. P9(1) Raj / Group -1 / 2018". Revenue Board. Government of Rajasthan. 16 July 2018. Retrieved 18 April 2019.
  7. जिला एक दृष्टी मैं, जिला उदयपुर (District at a Glance, Udaipur District) (PDF). Udaipur: Office of Deputy Director Economic and Statistics. 2016.
  8. 8.0 8.1 Ground Water Scenario, Udaipur District, Rajasthan (PDF). Jaipur: Central Ground Water Board. 2013.
  9. "Rajasthan Administrative Divisions 2011" (PDF). Census of India. Retrieved 7 September 2018.
  10. Study on Planning of Water Resources of Rajasthan. Tahal Group. 2014. Retrieved 24 May 2019.
  11. "District Census Handbook Udaipur, Village and Town Wise Primary Census Abstract Part XII-B". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  12. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Oman 3,027,959
  13. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Iowa 3,046,355
  14. 2011 Census of India, Population By Mother Tongue
  15. "Gazette of India". Government of India. 19 May 2019. Retrieved 13 April 2019.
  16. "TSP mein jude Udaipur ke 342 gaon, pahle 1612 the, ab 1954 hue". Dainik Bhaskar. 12 July 2018. Retrieved 20 April 2019.
  17. "Brief Industrial Profile of Udaipur District" (PDF). Dcmsme.gov.in. Government of India - Ministry of MSME. Archived from the original (PDF) on 26 నవంబరు 2013. Retrieved 21 July 2015.
  18. "Telephone Directory". Official Website of Udaipur. Retrieved 18 April 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]