ప్రతాప్‌గఢ్ జిల్లా (రాజస్థాన్)
ప్రతాప్‌గఢ్ జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates (ప్రతాప్‌గఢ్ జిల్లా, రాజస్థాన్): 24°01′48″N 74°46′48″E / 24.03000°N 74.78000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
విస్తీర్ణం | |
• Total | 4,117.36 కి.మీ2 (1,589.72 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 8,67,848 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
• Urban | 71,728 |
Demographics | |
• ఆకాశరాస్యత | 47.12 (in 2011) |
Time zone | UTC+05:30 |
జాతీయ రహదారులు | NH 113 |
ప్రతాప్‌గఢ్ జిల్లా 2008 జనవరి 26 న రాజస్థాన్ రాష్ట్రంలో 33 వ రాష్ట్రంగా సృష్టించబడింది.[1] ఇది ఉదయపూర్ విభాగంలో ఒక భాగం, చిత్తౌర్‌గఢ్, ఉదయపూర్, బాన్స్వరా జిల్లాల పూర్వపు తాలుకాలనుండి నుండి విభజింపబడింది. ప్రతాప్‌గఢ్ పట్టణం జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రం (పిన్ కోడ్ 312605, ఎస్‌టిడి కోడ్ 01478)
చరిత్ర
[మార్చు]'ప్రతాప్‌గఢ్' రాజ్' పాలకులు మేవార్ రాజ్‌పుత్‌ల సిసోడియా వంశానికి చెందినవారు.2008 లో అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్న వసుంధర రాజే ప్రతాప్‌గఢ్ స్వతంత్ర జిల్లాగా ప్రకటించారు.
ప్రతాప్‌గడ్ జిల్లా స్వచ్ఛమైన బంగారం,గాజుతో కప్పబడిన చేతితో తయారు చేసిన ప్రత్యేకమైన 'తేవా' ఆభరణాలకు పేరుపొందింది.ఇది రాజస్థాన్ రాష్ట్రంలో 33 వ జిల్లాగా 2008 జనవరి 26న ప్రతాప్‌గఢ్, చోటీ సద్రి, ధారియావాడ్, ఆర్నోడ్, పీపాల్‌ఖూంట్ అనే ఐదు తహసీల్సు /ఉప విభాగాలతో ఉనికిలోకి వచ్చింది.
ఈ జిల్లాలో పురాతన, చారిత్రక ప్రదేశాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. కానీ భారత పురావస్తు సర్వేశాఖ లేదా రాజస్థాన్ ప్రభుత్వ పురావస్తు సంగ్రహాలయాల విభాగం వివరణాత్మక అధ్యయనం చేసినలాంటి 'రక్షిత స్మారక చిహ్నాలు ' లేవు. ఇప్పటికీ కనిపెట్టబడని కొన్ని ముఖ్యమైన పురావస్తు చారిత్రిక స్థలాలు అవలేశ్వర, ఘోటవర్షిక (ఘోటార్సి), సిధేరియా, గాంధర్వ్‌పూర్ (గాంధేర్) జనగఢ్, వీర్‌పూర్ ఇంకా అనేక ఇతర అంశాలు ఉన్నాయి.సీతా మాతా అభయారణ్యం పూర్వ చారిత్రక శిల్పాలను కలిగి ఉంది.
జిల్లా సృష్టి
[మార్చు]ప్రతాప్‌గఢ్ జిల్లా ప్రజలు చిత్తోర్‌గఢ్ జిల్లా నుండి స్వతంత్ర జిల్లాగా మార్చాలని అడిగారు.గతంలో అందులో ఇది ఒక భాగం. ప్రతాప్‌గఢ్‌ను ప్రత్యేక జిల్లాగా సృష్టించాలనే ఉద్దేశంతో రాజస్థాన్ ప్రభుత్వం 2006 జూలై 6 న ప్రకటించింది. ప్రతాప్‌గఢ్‌ను అధికారికంగా కొత్త జిల్లాగా ప్రకటించే ప్రక్రియకు కొంత సమయం పట్టింది.శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి వసుంధర రాజే 2007 మార్చి 8 న ప్రతాప్‌గఢ్ రాజస్థాన్ 33 వ జిల్లాగా ప్రకటించారు.చిత్తౌర్‌గఢ్ జిల్లాకు చెందిన ప్రతాప్‌గఢ్, ఆర్నోడ్, చోటీ సద్రి, బాన్స్‌వాడ జిల్లాకు చెందిన పీపాల్ ఖూంట్, ఉదయపూర్ జిల్లాకు చెందిన ధారివాడ్ తాలూకాలతో కలపి ఈ కొత్త జిల్లా ఏర్పాటైంది.
ప్రతాప్‌గఢ్‌లో ఇప్పటికే కొన్ని జిల్లా కార్యాలయాలు (జిల్లా సెషన్ కోర్టు (1944 నుండి), జిల్లా ఆసుపత్రి, జిల్లా జైలు మొదలైనవి) చిత్తౌర్‌గఢ్ కంటే భిన్నమైన వాహన నమోదు గుర్తింపు సంఖ్య ఉన్నందున కొత్త జిల్లాగా ఇది సరైన నిర్ణయం అని ప్రకటించారు.2008 తరువాత ఆర్థిక-సామాజిక-సాంస్కృతిక అన్ని రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది.
భౌగోళికం
[మార్చు]- స్థానం
ప్రతాప్‌గఢ్ జిల్లా 24.03 ° N 74.78 ° E వద్ద ఉంది.ఇది సముద్ర మట్టానికి 580 మీటర్లు (1610 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.మౌంట్ అబూ తరువాత రాజస్థాన్‌లో ఇది రెండవ ఎత్తైన ప్రదేశం అని చెబుతారు. అరవాలి పర్వత శ్రేణుల జంక్షన్, మాల్వా పీఠభూమిలో ఉన్న దాని ప్రత్యేక స్థానం ఈ రెండింటి భౌగోళిక లక్షణాలను కలిగి ఉంది.
- ప్రాంతం
ప్రతాప్‌గఢ్ జిల్లా భౌగోళిక విస్తీర్ణం 2009-2010 నాటికి 4,11,736 హెక్టార్లు, వీటిలో అటవీ ప్రాంతం 1,20,976 హెక్టార్లు ఉంది.[2]
- వాతావరణం, నేల, స్థలాకృతి, ఖనిజాలు
జిల్లా సగటు వార్షిక వర్షపాతం 856 మి.మీ ఉంది.జిల్లా ప్రాంతంలోని నేల ప్రధానంగా అగ్నిపర్వతాల శిలాద్రవం తయారు చేసిన నల్ల రేగడి భూములుగా ఉంటాయి. జిల్లాలోని జఖం, మహి, సివానా లేదా శివ నదులు ప్రధాన నదులు.ఇతర కాలానుగుణ నదులుసోమ్,ఎరా,కార్మోయి . జిల్లాలోని ఐదు విభాగాలలో,చోటి సద్రి మినహా నాలుగు ఉప విభాగాలు ప్రకటించిన అటవీ ప్రాంతాలు.ఇక్కడ పెద్ద పరిశ్రమలు లేదా గనుల తవ్వకాలు కార్యకలాపాలు చట్టం ప్రకారం అనుమతించబడవు.ఏదేమైనా, చోటి సద్రి అటవీయేతర ప్రాంతాలలో (ప్రతాప్‌గఢ్ జిల్లా, ధారియావాడ్ ప్రాంతంలో ఒక భాగం), చిన్న తరహా గనుల తవ్వకాల ద్వారా ప్రధానంగా ఎర్ర మట్టి, కాల్సైట్, డోలమైట్, స్ఫటికం, సబ్బు రాయి వెలికి తీస్తారు.మార్బుల్, బిల్డింగ్ స్టోన్, సున్నపురాయి కూడా తక్కువ పరిమాణంలో లభిస్తాయి.
ఉప విభాగాలు
[మార్చు]ప్రతాప్‌గఢ్ జిల్లాలో 5 ఉప విభాగాలు ఉన్నాయి,అవి ఆర్నోడ్, చోటి సద్రి,ధారివాడ్,పీపాల్ ఖూంట్, ప్రతాప్‌గఢ్ .ఆర్నోడ్ తాలూకాలో ఆదాయ గ్రామాల 178, చోటి సారీ తాలూకాలో 141, దరియావాద్ తాలూకాలో 249 కాగా, పీపాల్ ఖూంట్ తాలూకాలో 23, ప్రతాప్‌గఢ్ తాలూకాలో 330 ఉన్నాయి. ప్రతాప్‌గఢ్ జిల్లాలో ధమోతార్, కుల్మిపురా, సిధ్‌పురా, రథంజనా, ధౌలాపానీ, దేవ్‌గఢ్, సలామ్‌గఢ్, పార్సోలా, ఘంటాలి, ఆర్నోడ్, గాంధేర్, అసవ్‌సతా, కుల్తానా, అవలేశ్వర్, రాజోరా, కుని, హతునియా, ప్రతాప్ పురా, మొఖంపుర, బసాద్, వర్మండలం, బజరంగ్‌గఢ్, సుహాగ్‌పురా, రాంపూరియా, చిక్లాడ్, గయాస్‌పూర్, బరవర్ద, బార్డియా, థాడా, పన్మోడి, హన్సాది, గౌతమేశ్వర, దలోట్, ఘంటాలి, పీపల్‌ఖూంట్, రాజ్‌పురియా, బాంబోరి, బాద్‌బాఖ్ గ్రామాలు ప్రధానమైనవి
జిల్లా పరిపాలన
[మార్చు]జిల్లాను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు.
జనాభా
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 93,238 | — |
1911 | 1,14,348 | +22.6% |
1921 | 1,22,648 | +7.3% |
1931 | 1,40,704 | +14.7% |
1941 | 1,66,527 | +18.4% |
1951 | 1,90,269 | +14.3% |
1961 | 2,43,761 | +28.1% |
1971 | 3,23,990 | +32.9% |
1981 | 4,41,507 | +36.3% |
1991 | 5,53,865 | +25.4% |
2001 | 7,06,807 | +27.6% |
2011 | 8,67,848 | +22.8% |
సా. శ.1881లో ప్రతాప్‌గఢ్ జనాభా 79,568 కాగా,1951 లో ఇది 1,10,530కు చేరింది.2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రతాప్‌గఢ్ జిల్లా జనాభా 867,848.[3] ఇది ఖతార్ దేశానికి [4] లేదా అమెరికా రాష్ట్రమైన డెలావేర్కు జనాభాకు సమానం.[5] ఇది భారతదేశంలో జనాభా పరంగా 472 వ ర్యాంకును (640 జిల్లాలలో) ఇస్తుంది.జిల్లాలో జనాభా సాంద్రత చ.కి.మీ.కు 211 మందిని కలిగి ఉంది. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 22.84%కు చేరుకుంది లింగ నిష్పత్తిని ప్రతి 1000 పురుషులకు 982 స్త్రీలును కలిగిఉంది. జిల్లా ఒక అక్షరాస్యత రేటు 56.3%గా ఉంది.
ప్రతాప్‌గఢ్ జిల్లా జనాభా 2011లో ప్రతాప్‌గఢ్‌లో 867,848 జనాభా ఉంది.అందులో పురుషులు 430,104 ఉండగా, స్త్రీలు 437,744, ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం, ప్రతాప్‌గఢ్‌లో 706,807 జనాభా ఉంది. అందులో పురుషులు 359,021 మంది కాగా, మహిళలు 347,786 మంది ఉన్నారు. ప్రతాప్‌గఢ్ జిల్లా జనాభా మొత్తం మహారాష్ట్ర జనాభాలో 1.27 శాతం. 2001 జనాభా లెక్కల ప్రకారం, ప్రతాప్‌గఢ్ జిల్లాకు ఈ సంఖ్య మహారాష్ట్ర జనాభాలో 1.25 శాతంగా ఉంది
2001 నాటికి జనాభాతో పోలిస్తే ప్రతాప్‌గ ఢ్ జిల్లా జనాభా వృద్ధి రేటు 22.78 శాతం పెరుగుదల మార్పు ఉంది.2001 జనాభా లెక్కల ప్రకారం, ప్రతాప్‌గఢ్ జిల్లా 1991 తో పోలిస్తే దాని జనాభాకు 27.09 శాతం పెరిగింది.
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ప్రతాప్‌గఢ్ జిల్లా జన సాంద్రత సెన్సస్ సాంద్రత కిమీ 2కి 195 మంది. 2001 లో ప్రతాప్‌గఢ్ జిల్లా సాంద్రత కిమీ 2కి 172 మంది. ప్రతాప్‌గఢ్ జిల్లా 4,449 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ప్రతాప్‌గఢ జిల్లా లింగ నిష్పత్తి రేటు 2001 జనాభా లెక్కల 969 తో పోలిస్తే ఇది 1000 మంది పురుషులకు 983 గా ఉంది.2011 భారత జనాభా నివేదికల ప్రకారం భారతదేశంలో సగటు జాతీయ లింగ నిష్పత్తి 940గా ఉంది.2001 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది అబ్బాయిలకు 953 మంది బాలికలతో పోలిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది అబ్బాయిలకు 933 మంది బాలికలు ఉన్నారు.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రతాప్‌గఢ జిల్లాలో 0-6 ఏళ్లలోపు ఉన్న పిల్లలు 142,692 మందికి 2011 జనాభా లెక్కల ప్రకారం వ్యతిరేకంగా 0-6 ఏళ్లలోపు పిల్లలు 150,518 మంది ఉన్నారు.
2011 భారతదేశం జనాభా లెక్కలు ప్రకారం, జిల్లాలోని జనాభాలో 77,26% హిందీ, 20,18% బిల్ 1.75% పంజాబీ వారి మొదటి భాషగాఉంది.[6]
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వేరుశనగ, సోయా బీన్స్, ఆవాలు, కొన్ని రకాల పప్పుధాన్యాలు ఈ జిల్లాలోని ప్రధాన పంటలు.
నీటిపారుదల
[మార్చు]జిల్లా ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టు ప్రతాప్‌గఢ్ తాలూకా అనూపురా గ్రామంలో ఉన్న జఖం ఆనకట్ట.ఇది ధారివాడ్ నుండి 32 కి.మీ, జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 35 కి.మీ.దూరంలో ఉంది ఈ ఆనకట్ట జఖం నదిపై నిర్మించబడింది.ఇది చోటి సద్రీ ఉపవిభాగంలో జఖమియా అనే చిన్న గ్రామం నుండి ఉద్భవించింది. జఖం ఆనకట్ట పునాదికి 1968 మే 14 న ముఖ్యమంత్రి మోహన్ లాల్ సుఖాడియా శంకుస్థాపన చేసారు.అయితే, ఆనకట్ట వాస్తవ నిర్మాణ పనులు 1969-70లో ప్రారంభమై ఆనకట్ట 1986 లో పూర్తయింది.కానీ ఈ నీటిపారుదల ప్రాజెక్టును పూర్తిగా నిర్మించటానికి మరో పన్నెండు సంవత్సరాలు 2000 మార్చి వరకు సమయం పట్టింది.ప్రారంభంలో 52,354 హెక్టార్ల భూమికి సాగునీరు ఇవ్వడానికి జఖం ఆనకట్ట పరీవాహక ప్రాంతం 5,015 ఎంసి అడుగులు ఎత్తువరకు నీటి నిలుపుదల సామర్థ్యంలో, ఉపయోగించగల నీటి సామర్థ్యం 4,671 ఎంసి అడుగులుగా 106.03 కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు.ఈ ఆనకట్ట పొడవు 253 మీటర్లు, వీటిలో స్పిల్‌వే పొడవు 90 మీ.ఆనకట్ట చుట్టూ ఉన్న ప్రాంతం కఠినమైన కొండలు, కానీ ఆసక్తికరంగా ఉంటుంది.ప్రధాన ఆనకట్ట నుండి 13 కి.మీ. దూరం ఉంది.ఎడమ ప్రధాన కాలువ (39.90 కిమీ). కుడి ప్రధాన కాలువ (34.12 కిమీ) తో నంగలియా వరకు నిర్మించబడింది.దీని ద్వారా ధారివాడ్ సబ్ డివిజన్‌లోని 118 గ్రామాల్లో నీటిపారుదల సౌకర్యం ఏర్పడింది.
రవాణా
[మార్చు]ప్రతాప్‌గఢ్ జిల్లాకు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నగరాలతో రోడ్డు మార్గం ఉంది. ప్రతిరోజూ బస్సు సర్వీసులు ప్రతాప్‌గఢ్ చిత్తౌర్‌గఢ్ 110 కి.మీ.దూరంతో కలుపుతాయి. బన్స్వారా (80 కి.మీ), ఉదయపూర్ (165 కి.మీ), దుంగార్పూర్ (95 కి. మీ), రాజ్‌సమంద్ (200 కి.మీ), జోధ్పూర్ (435 కి.మీ), జైపూర్ (421 కి.మీ) నీమచ్ (62 కిమీ) రత్లం (85 కి.మీ), మాండ్‌సౌర్ (32 కి.మీ) ఢిల్లీ (705 కి.మీ) నగరాలకు, రాజస్థాన్ లోని ఇతర నగరాలకు ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల నిరంతర ప్రయాణ సదుపాయాలు ఉన్నాయి.రాజస్థాన్ రాష్ట్రంలో రైలుమార్గంతో అనసంధానించబడని ఏకైక జిల్లా ఇది.
పోస్టల్ సేవలు, బ్యాంకింగ్
[మార్చు]ప్రతాప్‌గఢ్ జిల్లాలో ప్రతాప్‌గఢ్, కచ్చాహ్రీ-ప్రతాప్‌గఢ్, ఆర్నోడ్, దలోట్, రాథంజనా, ధారివాడ్, చోటి సద్రి, పీపాల్‌ఖూంట్, ధమోతార్, బంబోరి వద్ద బ్రాంచ్ కార్యాలయాలు, 8 తపాల కార్యాలయాలు ఉన్నాయి.26 వాణిజ్య బ్యాంకులు, 12 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 4 సహకార రంగ బ్యాంకులు, 2 భూ అభివృద్ధి బ్యాంకులు ఉన్నాయి.
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Notication of the Government of Rajasthan No.Rev-Gp–1 F 9 (17) raj-1/07/3 25 January 2008
- ↑ "Pratapgarh's official website".
- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Qatar 848,016 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Delaware 897,934
- ↑ 2011 Census of India, Population By Mother Tongue