దుంగర్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుంగర్‌పూర్
రాజస్థాన్‌ పటంలో దుంగార్‌పూర్ జిల్లా స్థానం
రాజస్థాన్‌ పటంలో దుంగార్‌పూర్ జిల్లా స్థానం
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
పరిపాలనా విభాగంఉదయ్‌పూర్
ప్రధానకేంద్రందుంగర్‌పూర్‌
తహశీల్స్8
Population
 (2011)
 • Total13,88,552
 • Urban
88,473
జనాభా
 • అక్షరాస్యత59.5
 • లింగ నిష్పత్తి(పురుషులు) 1000:994 (స్త్రీలు)
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)

రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో దుంగర్‌పూర్ జిల్లా ఒకటి. దుంగర్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

చరిత్ర[మార్చు]

దుంగర్‌పూర్ రాజ్యాన్ని భీల్ రాజు దుంగరియా 13వ శతాబ్దంలో స్థాపించాడు.

భౌగోళికం[మార్చు]

జిల్లా 23° 8' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 73° 7' డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. వైశాల్యం 3,770 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1,388,906. జిల్లా దాదాపు త్రిభుజాకారంలో ఉంటుంది. జిల్లా పశ్చిమ సరిహద్దులో మహినది ప్రవహిస్తూ బన్‌స్వార జిల్లా మధ్య సరిహద్దును ఏర్పరుస్తుంది, ఉత్తర సరిహద్దులో మహి ఉపనది అయిన సాంనది సరిహద్దును ఏర్పరుస్తుంది, మిగిలిన సరిహద్దులో ఉదయపూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో గుజరాత్ రాష్ట్రం ఉన్నాయి.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దుంగర్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్ర 12 జిల్లాలలో ఈజిల్లా ఒకటి.[1]

చారిత్రిక జనాభా[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19011,00,103—    
19111,59,192+4.75%
19211,89,272+1.75%
19312,27,544+1.86%
19412,74,282+1.89%
19513,08,243+1.17%
19614,06,944+2.82%
19715,30,258+2.68%
19816,82,845+2.56%
19918,74,549+2.51%
200111,07,643+2.39%
201113,88,552+2.29%
source:[2]

2011 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,388,906, [3]
ఇది దాదాపు. స్విడజర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 351వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 368 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.39%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 990:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 60.78%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

రాజస్థాన్‌కు చెందిన వగాడ్ భూభాగంలో దుంగర్‌పూర్, బన్‌స్వార జిల్లా జిల్లాలు ఉన్నాయి. వగాడ్‌లో అధికంగా మధ్య భారతదేశానికి చెందిన భిల్లులు అత్యధికంగా ఉన్నారు.

సంస్కృతి[మార్చు]

ప్రముఖులు[మార్చు]

  • పన్నాలాల్ పటేల్ (1912-1989) రచయిత. ఈయన మండ్లి గ్రామంలో జన్మించాడు.
  • రాజ్ సింగ్ దుంగర్‌పూర్ (1935 డిసెంబరు 19 - 1969 ఆగస్టు 12) క్రికికెట్ కంట్రోల్ బోర్డ్‌కు మాజీ అధ్యక్షుడు.
  • షివేంద్ర సింగ్ దుంగర్‌పూర్ (1969 ఆగస్టు 25) చలన చిత్ర నిర్మాత, దర్శకుడు, చిత్రకళాకారుడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf
  2. Decadal Variation In Population Since 1901
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301

సరిహద్దులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]