సవై మధోపూర్ జిల్లా
సవై మధోపూర్ | |
---|---|
![]() Location of Sawai Madhopur district in Rajasthan | |
Country | India |
State | Rajasthan |
Division | Bharatpur Division |
Headquarters | Sawai Madhopur |
ప్రభుత్వం | |
• District collector | K C Verma |
విస్తీర్ణం | |
• Total | 10,527 కి.మీ2 (4,064 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 1,335,551[1] |
Demographics | |
• Literacy | 65.39 |
• Sex ratio | 897 |
కాలమానం | UTC+05:30 (IST) |
జాలస్థలి | sawaimadhopur |
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో సవై మధోపూర్ జిల్లా ఒకటి. సవై మధోపూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది[2]
భౌగోళికం[మార్చు]
జిల్లా ఉత్తర సరిహద్దులో దౌస జిల్లా, ఈశాన్య సరిహద్దులో కరౌలి జిల్లా, నైరుతీ సరిహద్దులో జైపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో జిల్లాను మధ్యప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులను విడదీస్తూ ప్రవహిస్తున్న చంబల్ నది, నైరుతీ సరిహద్దులో కోట జిల్లా, దక్షిణ సరిహద్దులో బుంది జిల్లా, పశ్చిమ సరిహద్దులో టోంక్ జిల్లాలు ఉన్నాయి.
విభాగాలు[మార్చు]
సవై మధోపూర్ జిల్లాలో 8 రెవెన్యూ ఉపవిభాగాలు, తాలూకాలు ఉన్నాయి.[3]
- సవై మధొపుర్
- ఛొథ్ కా బర్వర
- ఖందర్
- బొన్లి
- మలర్న దుంగర్
- గంగపుర్, సవై మధొపుర్ గంగపుర్ నగరం
- వజిర్పుర్
- బమన్వస్
ఆదాయం[మార్చు]
సబ్డివిజన్ | భూమి పంటల రికార్డ్ సర్కిల్ (ఐ.ఎల్.ఆర్.సి లు) | పత్వర్ సర్కిల్ | గ్రామాలు మొత్తం |
---|---|---|---|
సవై మధోపూర్ | 7 | 48 | 152 |
ఛొథ్ కా బర్వర | 3 | 24 | 64 |
ఖందర్ | 6 | 37 | 128 |
బొన్లి | 4 | 31 | 104 |
మలర్న దుంగార్ | 3 | 24 | 76 |
గంగాపూర్ సిటీ | 3 | 24 | 85 |
వజిర్పుర్ | 3 | 24 | 44 |
బమన్వస్ | 7 | 55 | 150 |
జిల్లా న్యాయస్థానం[మార్చు]
1977లో సవై మధోపూర్ జిల్లా వ్యాయస్థానం స్థాపించబడింది. మధోపూర్ జిల్లా న్యాయస్థానంలో 10 న్యాయాధిపతులు ఉన్నారు..
ఆర్ధికం[మార్చు]
2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సవై మధోపూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[4]
చారిత్రిక జనాభా[మార్చు]
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 2,64,632 | — |
1911 | 2,62,575 | −0.08% |
1921 | 2,36,115 | −1.06% |
1931 | 2,59,852 | +0.96% |
1941 | 2,93,648 | +1.23% |
1951 | 3,29,206 | +1.15% |
1961 | 4,21,063 | +2.49% |
1971 | 5,37,675 | +2.47% |
1981 | 6,88,360 | +2.50% |
1991 | 8,75,752 | +2.44% |
2001 | 11,17,057 | +2.46% |
2011 | 13,35,551 | +1.80% |
source:[5] |
2011 గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,338,114, [6] |
ఇది దాదాపు. | మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[7] |
అమెరికాలోని. | మైనే నగర జనసంఖ్యకు సమం.[8] |
640 భారతదేశ జిల్లాలలో. | 362వ స్థానంలో ఉంది..[6] |
1చ.కి.మీ జనసాంద్రత. | 297 [6] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.79%.[6] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 894:1000 [6] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 66.19%.[6] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
పండుగలు , ఉత్సవాలు[మార్చు]
గణేశ్ చతుర్ధి ఉత్సవం[మార్చు]
గణేశ్ చతుర్ధి ఉత్సవం సవై మాధోపూర్‌లో అత్యంత వైభవంగా జరుగుతుంది. బాధ్రపద శుక్ల చతుర్ధి నాడు రంథాంభోర్ కోటలో ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. రాజస్థాన్‌లో ఈ ఉత్సవం కోలాహలంగా నిర్వహించబడుతుంది. రాజస్థాన్, రాజస్థాన్ వెలుపలి ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. 3 రోజులపాటు నిర్వహించబడే ఈ ఉత్సవాలను చూడడానికి వేలాది భక్తులు వస్తుంటారు.
మౌహాన్ మాతా ఉత్సవం[మార్చు]
జిల్లాకేంద్రం " సవై మాధోపూర్ "కు 25 కి.మీ దూరంలో ఉన్న బరవారా పట్టణంలో ఉన్న చౌహాన్ మాతా ఆలయం ఉంది. మార్గశిరమాసం కృష్ణ పక్ష చతుర్ధి నాడు ఇక్కడ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవానికి రాజస్థాన్, ఇతర ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు వస్తుంటారు.
శివరాత్రి ఉత్సవం[మార్చు]
ఇసేర్దా రైల్వే స్టేషన్‌కు 3 కి.మీ దూరంలో మాధోపూర్ - జైపూర్ రైలు మార్గంలో షివార్ పట్టణంలో ప్రఖ్యాత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన గుష్వేశ్వర మహాదేవాలయం ఉంది. శివరాత్రి పర్వదినంలో శివుని ఆశీర్వాదం కోరడానికి ఇక్కడకు వేలాది భక్తులు వస్తూ ఉంటారు.
రామేశ్వరం ఆలయం[మార్చు]
సవై మాధోపూర్‌కు 60కి.మీ దూరంలో ఉన్న బనాస్ చంబల్ సంగమంలో సుందరమైన రామేశ్వరాలయం ఉంది. శివరాత్రి రోజు ఈ ఆలయంలో నిర్వహించే పూజలను చూసి శివుని ఆరాధించడానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి లక్షలాది భక్తులు వస్తుంటారు.
కల్యాణ్‌జీ ఉత్సవం[మార్చు]
ప్రతిసంవత్సరం వైశాఖ శుక్ల పౌర్ణమి నాటికి గంగాపూర్ వద్ద ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. 7 రోజులపాటు నిర్వహించబడే ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు.
సరిహద్దులు[మార్చు]
![]() |
జైపూర్ జిల్లా | దౌస జిల్లా జిల్లా | కరౌలి జిల్లా | ![]() |
టోంక్ జిల్లా | ![]() |
|||
| ||||
![]() | ||||
బుంది జిల్లా | కోట జిల్లా | షెయోపూర్ జిల్లా , మధ్యప్రదేశ్ |
మూలాలు[మార్చు]
- ↑ "Name Census 2011, Rajasthan data". censusindia.gov.in. 2012. Retrieved 28 Feb 2012.
- ↑ https://web.archive.org/web/20130520123107/http://sawaimadhopur.nic.in/
- ↑ "Official website of district sawai madhopur> Administrative setup". sawaimadhopur.nic.in. Archived from the original on 2013-05-20. Retrieved 2014-11-14.
- ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Mauritius 1,303,717 July 2011 est.
line feed character in|quote=
at position 10 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Maine 1,328,361
line feed character in|quote=
at position 6 (help)
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to సవై మధోపూర్ జిల్లా. |