దౌస జిల్లా
రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో దౌస జిల్లా ఒకటి. దౌసపట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2950.జిల్లా జనసంఖ్య 1,316,790. జనసాంధ్రత చ.కి.మీ 384. అక్షరాస్యత 62.75% .
సరిహద్దులు[మార్చు]
దౌస జిల్లా ఉత్తరసరిహద్దులో ఆల్వార్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో భరత్‌పూర్ సరిహద్దులో, ఆగ్నేయ కరౌలి జిల్లా, దక్షిణ సవై మధోపూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో జైపూర్ జిల్లా ఉన్నాయి.
విభాగాలు[మార్చు]
దౌస జిల్లా 5 తాలూకాలుగా విభజించబడ్డాయి : బస్వ, దౌస, లాల్సాట్, మహ్వా, శిఖరి.
భౌగోళికం[మార్చు]
జిల్లాలో సవై నది, బాణగంగా నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా జాతీయరహదారి - 11 మార్గంలో జైపూర్, ఆగ్రా మధ్య ఉంది. ఇది జైపూర్ నుండి తూర్పుగా 55కి.మీ దూరంలో ఉంది. మహ్వా తాలూకాలో ఖెర్ల బుజుంగ్ గ్రామపంచాయితీ ఉంది. ఎం.ఎల్.ఎ ఎన్నికలలో ఇక్కడి నుండి గుజార్ జాతికి చెందిన ముగ్గురు సభ్యులు రాజస్థాన్ అసెంబ్లికి పోటీ చేసారు. ముగ్గురు సభ్యులు మూడు జాతీయ పార్టీల కొరకు పోటీ చేయడం, ముగ్గురూ న్యాయవాదులు కావడం, ప్రత్యేకతలతో ఇది సరికొత్త రికార్డుగా మారింది. చివరికి హరి సింగ్ విజయం సాధించాడు. ఈ వార్తను బి.బి.సి చానల్‌లో ప్రసారం చేయడం ఒక ప్రత్యేకత.
పేరు వెనుక చరిత్ర[మార్చు]
దౌస జిల్లాలో ఉన్న దేవగిరి కొండల కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది.
చరిత్ర[మార్చు]
దౌసలో ఉన్న కొండమీద బద్‌గుజార్ రాజులు ఒక కోటను నిర్మించారు. బద్‌గుజార్ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి పాలకులుగా భావించబడుతున్నారు. తరువాత చౌహాన్ రాజులు ఈ ప్రాంతాన్ని కచ్వహ రాజులకు ఇవ్వబడింది. అయినప్పటికీ పాలనాధికారం అంబర్ వద్ద కేంద్రీకరించబడింది.
1562లో అక్బర్ ఖవజ మొయిద్ధిన్ చిస్టి యాత్ర నిమిత్తం అజ్మీర్కు వెళ్ళినప్పుడు, వారు దౌస వద్ద బసచేసారు. అప్పుడు అక్బర్ దౌస హకిం అయిన రుప్సి బర్గి, భర్మల్ సోదరుని కలుసుకున్నాడు.ఇక్కడి ప్రజలకు వ్యవసాయం ప్రధానవృత్తిగా ఉంది. జిల్లాలో గోధుమలు, బజ్రా, ఆవాలు, వేరుశనగ, రాప్ గింజలు పండించబడుతున్నాయి. 1991 ఏప్రిల్ 10 న సవై మధోపూర్ జిల్లా లోని దౌస, బస్వ, సిక్రై, కరొడి, లాల్సాట్, మహ్వ తాలూకాలను వేరు చేసి దౌస జిల్లా రూపొందించబడింది.
గణాంకాలు[మార్చు]
వైశాల్యపరంగా దౌస జిల్లా రాజస్థాన్ రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా గుర్తించబడుతుంది.
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,637,226, [1] |
ఇది దాదాపు. | గునియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | ఇడాహో నగర జనసంఖ్యకు సమం..[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 305 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 476 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 24.31%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 904:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 69.17%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Guinea-Bissau 1,596,677 July 2011 est.
line feed character in|quote=
at position 14 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Idaho 1,567,582
line feed character in|quote=
at position 6 (help)
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
ఆల్వార్ జిల్లా | ![]() | ||
జైపూర్ జిల్లా | ![]() |
భరత్‌పూర్ జిల్లా | ||
| ||||
![]() | ||||
సవై మధోపూర్ జిల్లా | కరౌలి జిల్లా |
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to దౌస జిల్లా. |