అజ్మీర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ajmer District in Rajasthan

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో అజ్మీర్ జిల్లా ఒకటి. అజ్మీర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 8,481. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,180,526.జిల్లాలో హిందువులు 1,869,044, ముస్లిములు 244,341, జైనులు 47,812ఉన్నారు. జిల్లా రాజస్థాన్ మధ్యభాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో నగౌర్ జిల్లా, తూర్పు సరిహద్దులో జైపూర్ జిల్లా, తోంక్జిల్లా, దక్షిణ సరిహద్దులో భిల్వారా జిల్లా, పశ్చిమ సరిహద్దులో పాలి జిల్లాలు ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

జిల్లా తూర్పు భూభాగం చదునుగా ఉంటుంది. పశ్చిమ భాగంలో ఆరవల్లి పర్వతావళి ఉంది. జిల్లా అనేక లోయలు భరతదేశంలోని థార్ ఎడారిలో భాగంగా ఉన్న ఇసుక ఎడారులుగా ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం కొన్ని వర్షాధార భూములు మరికొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. నాగ్పత్తర్ సర్పెంట్ రాళ్ళ గోడల మద్య ఒక కృత్రిమ సరోవరం ఉంది. అజ్మీర్ జిల్లాలో నదులు లేవు. జిల్లా సరిహద్దులో బనాస్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో 4 సెలయేర్లు ఉన్నాయి: సాగర్మతి, సరస్వతి, ఖరి, డై.

  • జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి: అజ్మీర్, బీవార్, కెక్రి, కిషన్‌గర్.
  • జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి :- అజ్మీర్, బీవార్, నసీరాబాదు, మసుద, కెక్రి, కిషన్ నగర్.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,584,913.[1]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 161 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 305 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.48%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 950:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 70.46%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]