Jump to content

కోట్‌పుట్లీ బెహ్రోర్ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 27°53′12″N 76°17′00″E / 27.8867°N 76.2834°E / 27.8867; 76.2834
వికీపీడియా నుండి
Kotputli-Behror[1]
Raath[2][3]
Clockwise from top-left: Buddhist Shrines Bairath, Neemrana Fort, Neemrana Baori
Nickname(s): 
Sabi Kantha , Rath,[3] Kotbehror, Kot, Bairath
Kotputli-Behror[1] is located in Rajasthan
Kotputli-Behror[1]
Kotputli-Behror[1]
Coordinates (Kotputli-Behror district): 27°53′12″N 76°17′00″E / 27.8867°N 76.2834°E / 27.8867; 76.2834
Country India
StateRajasthan
DivisionJaipur
HeadquartersKotputli, Behror ,[1]
TehsilsKotputli, Behror, Bansur, Neemrana, Paota, Viratnagar, Mandhan, Narayanpur
Government
 • District MagistrateShubham Chaudhary IAS
Time zoneUTC+5:30 (IST)
Major highwaysNational Highway 48 (NH-48), National Highway 148B (NH-148B)

కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక జిల్లా.[4] ఈ జిల్లా పూర్వపు జైపూర్ జిల్లా, అల్వార్ జిల్లాల నుండి వేరు చేయబడింది. ఇది అధికారికంగా 2023 ఆగస్టు 7న ఏర్పడింది.[5]ఇది రాజస్థాన్ ఈశాన్య భాగంలో ఉంది. ఈ జిల్లా మూడు వైపులా ఆరావళి శ్రేణులతో చుట్టుముట్టబడి, సాబీ నది ప్రవహిస్తుంది. ఇది కోట్‌పుల్టి, బెహ్రోర్, నీమ్రానా, బన్సూర్, మంధన్, పవోటా, విరాట్‌నగర్, నారాయణపూర్ తహసీల్‌లను కలిగి ఉంది. అశోక చక్రవర్తి పేరును పియదాసి జిల్లా లోని బబ్రూ రాతి శాసనాల నుండి కనుగొనబడింది.ఈ ప్రాంతాన్ని సబి-కాంత అని కూడా పిలుస్తారు, అంటే సబీనది ఒడ్డున ఉన్న ప్రాంతం అని అర్థం. సబీ నది జిల్లాను రెండు భాగాలుగా విభజిస్తుంది. బెహ్రోర్, నీమ్రానా, బన్సూర్, మంధన్ తహసీల్‌లతో కూడిన జిల్లాలోని ప్రధాన భాగాన్ని రథ్ ప్రాంతంగా సూచిస్తారు.రాత్ ప్రాంతంలోని ముండావర్ తహసీల్ ఖైర్తాల్ ప్రత్యేక జిల్లాలో భాగంగా చేయబడింది. [3]

పరిపాలనా విభాగాలు

[మార్చు]

తహసీల్‌లు

1. కోట్‌పుల్టీ

2. బెహ్రోర్

3. నీమ్రానా

4. బన్సూర్

5. విరాట్‌నగర్

6. పావోటా

7. నారాయణపూర్

8. మంధన్ [6]

స్థల నామ ప్రాముఖ్యత

[మార్చు]
Map of Kotpulti Behror District
కోట్ బెహ్రోర్ జిల్లా పటం

జిల్లాలోని రెండు ముఖ్యమైన నగరాలైన కోట్‌పుట్లీ, బెహ్రోర్‌ల పేరును కలపడం వల్ల ఈ జిల్లా పేరు వచ్చింది. ఇతర సూచనలలో దీనిని సబి-కాంత అని కూడా సూచిస్తారు. కాంత పదం సబర్మతి నది చుట్టూ ఉన్న గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో ఉన్నట్లుగా నది చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. కోట్‌పుట్లీ బెహ్రోర్ జిల్లా సబీనది ఒడ్డున ఉంది. దీనిని సబి-కాంత అని కూడా పిలుస్తారు.

భౌగోళికం

[మార్చు]

స్థలాకృతి

[మార్చు]

ఆరావళి శ్రేణి ఉత్తరపు అంచున ఉన్న ఈ జిల్లా ప్రధానంగా సారవంతమైన మైదానాలతో కలిగి ఉంటుంది.దాని పొడవునా సాహిబీ నది ద్వారా ప్రయాణిస్తుంది. ఆరావళి కొండలు సహజ సరిహద్దులుగా పనిచేస్తాయి, జిల్లాను రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాల నుండి వేరుచేస్తాయి. ఈ కొండలు ఉత్తరాన ఢిల్లీ వైపు తప్ప జిల్లాను మూడు వైపులా చుట్టుముట్టాయి.

దక్షిణ వైపున, ఆరావళి కొండలు జైపూర్ జిల్లా షాపురాతో సరిహద్దుగా ఉన్నాయి. సున్నపురాయి లేదా ఇసుకరాయి కొండలశ్రేణి ఈ జిల్లాలోని బన్సూర్ తహసీల్,అల్వార్ జిల్లా మధ్య సమాంతర అడ్డంకిని ఏర్పరుస్తుంది. ఆగ్నేయంలో, సరిస్కా టైగర్ రిజర్వ్ ఆరావళి కొండల గొలుసులతో వేరు చేయబడింది. వాయువ్యంలో థార్ ఎడారి ఉంది.దీనిని ఆరావళి కొండల శ్రేణి విభజించింది. ఇది సారవంతమైన మైదానాలపై దాని ఆక్రమణను నిరోధించింది. పరిమిత ఉపరితల నీటి వనరులు, సాహిబీ నది పరివాహక ప్రాంతం క్షీణించడం, భూగర్భ జలవనరులను అధికంగా ఉపయోగించడం వల్ల జిల్లా నీటి కొరత సమస్యలను ఎదుర్కొంటుంది. [7] [8] [9]

వాతావరణం

[మార్చు]

సెప్టెంబరు నుండి అక్టోబరు వరకు కొన్ని నెలలలో వర్షపాతం కేంద్రీకృతమై ఉంటుంది. మిగతా కాలంలో వాతావరణం ఎక్కువగా పొడి గాలులు వీస్తాయి. ఆ కాలంలో చెట్లు ఆకులు రాల్చుతాయి.ఎక్కువ కాలం వేడిగాలులతో, పొడిగా ఉంటుంది, తరచుగా గాలులు వీస్తాయి.శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థాయికి పడిపోవచ్చు.

నదులు, ఆనకట్టలు

[మార్చు]

సికార్,జైపూర్‌తో జిల్లా సరిహద్దులో విస్తరించి ఉన్న ఆరావళి కొండల నుండి ఉద్భవించే సాహిబీ లేదా సాబి జిల్లాలోని ప్రధాన అతిపెద్ద నది.ఇది 300 కి.మీ పొడవు, అశాశ్వతమైన,వర్షాధార నది హర్యానా,ఢిల్లీ వైపు ప్రవహిస్తుంది. ఢిల్లీ సమీపంలోని యమునాలోకి ప్రవహిస్తుంది.[10] సోటా నది, బాబరియా కట్టపై ఉన్న బుచారా ఆనకట్ట మినహా సరస్సుల వంటి ప్రధాన ఉపరితల నీటి వనరులు లేవు. సోటానది మరొక ప్రధాన నది.దీని ఉపనది బెహ్రోర్ తెహసిల్‌లోని సోతనాల సమీపంలో సాహిబీ నదిలో ప్రవహిస్తుంది. నారాయణపూర్ నాలా బన్సూర్ తహసీల్ వాయువ్య దిశలో మురుగు నీరు సాహిబీనదిలో కలుస్తాయి. అజబ్‌గఢ్ నాలా లేదా కాళీనది, పర్తాబ్‌గఢ్ నాలాలు బన్సూర్, తనగాజీలో ఉద్భవించాయి.జైపూర్‌లోని బల్దేఘర్ సమీపంలో బంగంగా ప్రవాహంలోకి మారుతాయి.[11]

నీటి బుడగలు, జంతుజాలం

[మార్చు]

బన్సూర్ తహసీల్ సమీపంలోని తల్వృక్ష్‌లో వేడి నీటిబుగ్గ పెరుగుతుంది. కొన్ని చల్లని నీటిబుగ్గలు ఉన్నాయి. [11] ప్రధానమైన చెట్ల జాతులు వేప, ధాక్, కికర్, ఖేజ్రీ, నిమ్మగడ్డి, సబి, సోటా నదుల ఒడ్డున పుష్కలంగా ఉంటాయి. ప్రధాన వన్యప్రాణి జంతు జాతులు నీల్గై, చిరుతపులి, పులి, నక్క, హైనా, ఇంకా వివిధ జాతులు ఉన్నాయి. జిల్లాలో నల్లరాయి, కంకర ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి, అయినప్పటికీ అవి పర్యావరణ పరంగా సున్నితమైన ఆరావళి శ్రేణులలో ఎక్కువగా కనిపిస్తాయి.

కొత్త జిల్లా ఏర్పాటు

[మార్చు]

కోట్‌పుట్లీ, బెహ్రోర్ ప్రాంతాలలో జిల్లాల కోసం చాలా కాలంగా నుండి వత్తిడిలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన కారణం, ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యాలయం దూరంలో ఉందనేది ఒక కారణం. ప్రస్తుత జిల్లా కార్యాలయం బెహ్రోర్ నుండి 60 కి.మీ, నీమ్రానా నుండి 80 నుండి కి.మీ. కోట్‌పుల్టీ నుండి 100 కి.మీ.దూరంలో ఉందనేది ప్రధాన కారణం. 2023 బడ్జెట్ సమయంలో రాజస్థాన్ శాసనసభ కొత్త 19 జిల్లాలను సృష్టించింది, వాటిలో ఒకటి కొట్ప్తులి-బెహ్రోర్ (రాత్) జిల్లా.[1]

వ్యవసాయం

[మార్చు]

బెహ్రోర్-నీమ్రానా ఆవాలు, గోధుమల ఉత్పత్తిలో ముందుంది. ఇది కాకుండా, పత్తి ఉత్పత్తిలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.కోట్‌పుట్లి, బెహ్రోర్‌లో ఒక మండి ఉంది. [1]

ఆసక్తికరమైన ప్రదేశాలు

[మార్చు]

విరాట్‌నగర్ స్థూపాలు

[మార్చు]

బిజాక్ కి పహారీలో ఉన్న ఈ బౌద్ధ సముదాయాలు చారిత్రకంగా సంపన్నమైన గత ప్రాంతాలకు సాక్ష్యంగా ఉన్నాయి.అవి అశోకుడి కాలంలో నిర్మించబడ్డాయి. వాటి సమీపంలో అశోకుని చిన్న శిలా శాసనాలు, బైరాత్, కలకత్తా-బైరత్ మైనర్ రాక్ శాసనాలు కనుగొనబడ్డాయి. ఇది తొలి వృత్తాకార బౌద్ధ క్షేత్రం, అందువల్ల బైరత్ ఆలయం భారతదేశ వాస్తుశిల్పానికి ముఖ్యమైన గుర్తుగా చెప్పకోవచ్చు. [12]

నీమ్రానా కోట

[మార్చు]
నీమ్రానా కోట

నీమ్రానా కోట భవన సముదాయం 10 కి.మీ. దూరంలో ఉన్న అతి ముఖ్యమైన మైలురాయిగా ప్రసిద్ధి చెందింది. నీమ్రానా కోట 16వ శతాబ్దంలో నిర్మించబడింది.1947 వరకు చౌహాన్ గుర్జర్చే ఆక్రమించబడింది. [13]

నీమ్రానా బావోరి

[మార్చు]
స్టాంప్ ఆఫ్ ఇండియా - 2017 - కోల్నెక్ట్ - నీమ్రానా స్టెప్‌వెల్

నీమ్రానాలో చారిత్రక మెట్ల బావి. ప్రతి అంతస్తు సుమారు 20 అడుగుల ఎత్తుతో,మొత్తం 9 అంతస్తులు నేల స్థాయిలో 86 స్థూపాకార ఓపెనింగ్‌లతో నిర్మించబడింది. ఇక్కడ నుండి సందర్శకులు 170 మెట్లను ఉపయోగించి భూమి దిగువన ఉన్న నీటి కొలనులోకి ప్రవేశిస్తారు. దీనిని రాజా తోడర్మల్ నిర్మించారు. [14] [15]

బన్సూర్ కోట

[మార్చు]

పట్టణం మధ్యలో ఒక చిన్నకొండపై ఉన్న కోట నిర్మాణం బహుళ కోణాలను కలిగి ఉంటుంది. వ్యూహాత్మక దృక్కోణంలో 16 వ శతాబ్దం చివరి నుండి 17 వ శతాబ్దం మొదటి సగం వరకు నిర్మించబడింది.

జనాభా శాస్త్రం

[మార్చు]

హిడూయిజం ప్రధాన మతం, ఇతర మతాలు జైనులు, ముస్లింలు సమాజాలకు చెందినవారు ఉన్నారు.

భాషలు

[మార్చు]

జిల్లాలోని ప్రధాన ప్రాంతాలలో అహిర్వతి అత్యంత సాధారణ భాష. హిందీ అధికార భాష. [16] ఇది బంగ్రూచే ఎక్కువగా ప్రభావితమవుతుంది. [17]

రవాణా

[మార్చు]

భారతదేశ జాతీయ రహదారి-48 అత్యంత రద్దీగా ఉండే హైవేలలో ఒకటి జిల్లాలో దాటుతుంది. జిల్లా రెండు ప్రధాన కార్యాలయాలను కలుపుతుంది, ఇది జిల్లాను రాష్ట్ర రాజధాని జైపూర్, దేశ రాజధాని న్యూఢిల్లీకి కలుపుతుంది. ట్రాన్స్ హర్యానా ఎక్స్‌ప్రెస్ వే (జాతీయ రహదారి 152-డి) జిల్లా ప్రధాన కార్యాలయాన్ని చండీగఢ్‌కు కలుపుతుంది, అయితే నిర్మాణంలో ఉన్న పనియాలా-బరోడామియో ఎక్స్‌ప్రెస్ వే జిల్లాను అల్వార్ జిల్లా, కైర్తల్ జిల్లా, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలకు కలుపుతుంది. [18]

మంధన్ తహసీల్‌లోని కతువాస్‌లో ఒక చిన్న స్ట్రిప్ మినహా మొత్తం జిల్లాలో రైల్వే మార్గం లేదు. సమీప రైల్వే స్టేషన్ రేవారి-ఫులేరా మార్గంలో నార్నాల్, రేవారి-అల్వార్ రైలు మార్గంలో బవాల్ రైల్వే స్ఠేషన్లు ఉన్నాయి.

సమీప అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండూ బెహ్రోర్ ప్రధాన కార్యాలయం నుండి 120 కి.మీ.దూరంలో ఉన్నాయి.[1] సమీప దేశీయ ఎయిర్‌స్ట్రిప్ బెహ్రోర్ ప్రధాన కార్యాలయం నుండి 25 కి.మీ., కోట్‌పుట్లీ ప్రధాన కార్యాలయం నుండి 50 కి.మీ దూరంలో బచోడ్ ఎయిర్‌స్ట్రిప్ ఉంది..

సంస్థలు

[మార్చు]
నిట్ యూనివర్సిటీ నీమ్రానా

జిల్లాలోప్రసిద్ధ సి.బి.ఎస్.ఇ. పాఠశాలలు అలాగే ఆర్.బి.ఎస్.ఇ.కి చెందిన పాఠశాలలు ఉన్నాయి. రాఫెల్స్ విశ్వవిద్యాలయం, నిట్ విశ్వవిద్యాలయం, సెయింట్ మార్గరెట్ ఇంజనీరింగ్ కళాశాల, ప్రైవేట్, ప్రభుత్వ మహిళా కళాశాల, కో-ఎడ్యుకేషన్ కళాశాల, అనేక బి.ఇడి. కళాశాలలు, ఎల్.బి.ఎస్. కళాశాల జిల్లాలో కొన్ని ఉన్నత విద్యా సంస్థలు. జిల్లాలో వైద్య కళాశాల లేదు, సమీప వైద్య కళాశాల 120 కి.మీ దూరంలో ఉంది. రాజస్థాన్‌లోని మొదటి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ 2023 జూన్ 22న సిడిసి. మద్దతుతో పిబిడిఎం వైద్యశాల కోట్‌పుట్లీలో స్థాపించబడింది [19] [20]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "कोटपूतली-बहरोड़ होगा नया जिला: क्षेत्र के लोगों को मिलेगी सुविधा, 17 सालों से चली आ रही थी मांग". Dainik Bhaskar (in హిందీ). 2023-03-17. Retrieved 2023-03-27.
  2. "राजस्थान के विभिन्न क्षेत्रों के भौगोलिक नाम -RajasthanGyan". www.rajasthangyan.com. Retrieved 2023-03-27.
  3. 3.0 3.1 3.2 "राजस्थान का रण : अलवर जिले के इस क्षेत्र से तय होगी राजनीति की दिशा, इस क्षेत्र पर प्रदेश में सभी की रहती है नजर | Rajasthan Ka Ram : Rath Area Will Play A Vital Role In 2018 elections". Patrika News (in హిందీ). 2018-09-29. Retrieved 2023-03-27. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "In poll year, Ashok Gehlot announces 19 new districts, 3 divisions". The Indian Express (in ఇంగ్లీష్). 2023-03-18. Retrieved 2023-03-31.
  5. "कोटपूतली-बहरोड़ जिले का स्थापना दिवस: मुख्यमंत्री गहलोत ने किया वर्चुअल उद्घाटन, हवन और सर्वधर्म प्रार्थना की". Dainik Bhaskar. 7 August 2023. Retrieved 13 August 2023.{{cite news}}: CS1 maint: url-status (link)
  6. "कोटपूतली-बहरोड़ जिले में 7 उपखंड और 8 तहसील". Dainik Bhaskar. 7 August 2023. Retrieved 13 August 2023.{{cite news}}: CS1 maint: url-status (link)
  7. "Rajasthan Elections: एनसीआर का फंदा, पानी पहुंचा पाताल... युवाओं को रोजगार नहीं मिलने का मलाल | Rajasthan Assembly Election 2023 Special Story And Ground Report Of Sri Ganganagar To Alwar". Patrika News (in హిందీ). 2023-05-21. Retrieved 2023-08-13.
  8. The Imperial Gazetteer of India, 1908. Vol. 5. Oxford: Clarendon Press. 1909. p. 261.
  9. Rajasthan State Gazetteer: History and culture. p. 6.
  10. The Imperial Gazetteer of India, 1908. Vol. 5. Oxford: Clarendon Press. 1909. p. 261.
  11. 11.0 11.1 "Flipbook Content | INDIAN CULTURE". indianculture.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.
  12. (2012). "Evolution of Buddhism in Rajasthan".
  13. Gite, Veidehi (2023-03-25). "Tracing the legacy of the legendary Prithviraj Chauhan III at Neemrana Fort". CEOWORLD magazine (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-03-31.
  14. "The Abandoned Stepwell of Neemrana". Atlas Obscura (in ఇంగ్లీష్). Retrieved 2023-03-31.
  15. "Neemrana Baoli (step well) in Rajasthan - a great monument of National imprortance". Retrieved 2023-03-31.
  16. "Mewati". Ethnologue. Retrieved 14 September 2019.
  17. . "Alwar Ki Bhogolik evam Ithehasik Prishthbhoomi".
  18. Livemint (2022-08-10). "Ambala-Kotputli Expressway: Gadkari shares images of new six-lane modern highway". mint (in ఇంగ్లీష్). Retrieved 2023-03-31.
  19. Marko, Mahima (2023-06-22). "देश की पहली इंटीग्रेटेट पब्लिक हैल्थ लैब कोटपुतली जिला अस्पताल में प्रांरभ". jantaserishta.com (in హిందీ). Archived from the original on 2023-08-13. Retrieved 2023-08-13.
  20. "CDC Experts Help India Scale-up Laboratory Systems in Response to COVID-19's Second Wave | Division of Global Health Protection | Global Health | CDC". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-02-14. Retrieved 2023-08-13.

వెలుపలి లంకెలు

[మార్చు]