బుంది జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుంది జిల్లా
ఎగువ-ఎడమ నుండి సవ్యదిశలో: బుండిలోని గర్హ్ ప్యాలెస్, కేశోరైపటన్‌లోని కేశవరాయ్ ఆలయం, నావల్ సాగర్ సరస్సు, బుండి జిల్లాలోని జలపాతం, డోరియా ఆనకట్ట
రాాజస్థాన్ పటంలో బుంది జిల్లా స్థానం
రాాజస్థాన్ పటంలో బుంది జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
ప్రధానకేంద్రంబుంది
Area
 • Total5,550 km2 (2,140 sq mi)
Population
 (2011)
 • Total11,10,906
 • Density200/km2 (520/sq mi)
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)

భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో బుంది జిల్లా ఒకటి.ఈ జిల్లాకు బుంది పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.జిల్లా వైశాల్యం 5,550 చ.కి.మీ.జిల్లా మొత్తం జనసంఖ్య 88,273.

విభాగాలు[మార్చు]

భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రం.

జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి: బుంది, హిన్ డోలి, నైంవా, కేషోరాజ్‌పతన్, ఇంద్రగర్.

భౌగోళికం[మార్చు]

బుంది జిల్లా ఉత్తర సరిహద్దులో టోంక్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో భిల్వార జిల్లా, తూర్పు సరిహద్దులో కోట జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో చిత్తౌర్‌గఢ్ జిల్లా ఉన్నాయి. జిల్లాలోని ఇంద్రఘర్ పట్టణం, సమీప ప్రాంతాలలో బిజసన్ మాతా, కమలేశ్వర్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.బుంది జిల్లాలోని ఇంద్రగర్‌లో ఉన్న మెట్లబావి వర్షాకాలంలో ఒక పర్యాటక ఆకర్షణ.

ఆర్ధికం[మార్చు]

బుంది జిల్లా ఆర్థికరంగం ప్రధానంగా వ్యవసాయం, వస్త్రాల తయారీ, పర్యాటకం మీద ఆధారపడి ఇంది. హస్థకళాఖండాల తయారీ కూడా ఆర్థికరంగం మీద తగినంత ప్రభావం చూపుతుంది.రాజస్థాన్ లోని హదోతి భూభాగంలో చిన్న పట్టణంగా ఉన్న బుంది కోటలకు, మెట్ల బావులు (కోనేరు), పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధిచెందింది.జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు అధికరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా పాలియస్టర్ ఫైబర్ తయారుచేయబడుతుంది.బుంది జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంకూడా అభివృద్ధి దశలో ఉంది. జిల్లాలో పప్పధాన్యాలు, గోధుమలు, బార్లీ, పత్తి, పొగాకు, ఆవాలు, రాప్ గింజలు, ఇతర నూనె గింజలు పండిస్తారు.ఆరంజ్, దానిమ్మ, నిమ్మ, జామ, మామిడి మొదలైన జాతులకు పండ్లను పండిస్తారు.బహుసుందరమైన బుంది జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. జిల్లాలోని కోటలు, పురాతన ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నాయి. పురాతన భవనాలు, ప్రాంతాలునందు హోటల్స్‌గా ఏర్పడ్డాయి.

గణాంకాలు[మార్చు]

2011 గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం వివరాలను బుంది జిల్లా జనాభా 1,110,906, ఇందులో పురుషులు 577,160 మంది కాగా, స్త్రీలు 533,746 మంది ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం, బుంది జనాభా 962,620, అందులో పురుషులు 504,818, మిగిలిన 457,802 మంది మహిళలు.

2001 నాటికి జనాభాతో పోలిస్తే జనాభాలో 15.40 శాతం మార్పు ఉంది. అంతకుముందు భారతదేశం 2001 జనాభా లెక్కల ప్రకారం, బుంది జిల్లా జనాభా, 1991 తో పోలిస్తే 30.41 శాతం పెరిగింది.[1]

2001 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 1,113,725, [2]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 415వ స్థానంలో ఉంది.[2]
1 చ.కి.మీ జనసాంద్రత. 193 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.7%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 922 [2]
జాతీయ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 62.31%.[2]
జాతీయ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు[మార్చు]

  1. "Bundi District Population Census 2011-2021, Rajasthan literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved 2021-02-24.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567

వెలుపలి లింకులు[మార్చు]