Jump to content

జైసల్మేర్ కోట

అక్షాంశ రేఖాంశాలు: 26°54′46″N 70°54′45″E / 26.9127°N 70.9126°E / 26.9127; 70.9126
వికీపీడియా నుండి
జైసల్మేర్ కోట
జైసల్మేర్ ఖిల్లా లేదా సోనార్ ఖిల్లా
జైసల్మేర్ రాష్ట్రం, రాజస్థాన్ లో భాగం
జైసల్మేర్ జిల్లా, రాజస్థాన్
జైసల్మేర్ కోట దృశ్యం
జైసల్మేర్ కోట is located in Rajasthan
జైసల్మేర్ కోట
జైసల్మేర్ కోట
భౌగోళిక స్థితి26°54′46″N 70°54′45″E / 26.9127°N 70.9126°E / 26.9127; 70.9126
రకముDesert Fortification
స్థల సమాచారం
నియంత్రణజైసల్మేర్ రాష్ట్రం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
పరిస్థితిసంరక్షించబడిన కట్టడం
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరం1155 AD
కట్టించిందిరావల్ జైసల్
Garrison information
Occupantsజైసల్మేర్ నగరంలోని నాలుగవ వంతు జనాభా
రకంసాంస్కృతిక
క్రైటేరియాii, iii
గుర్తించిన తేదీ2013 (36th session)
దీనిలో భాగంరాజస్థాన్ హిల్ ఫోర్ట్స్
రిఫరెన్సు సంఖ్య.247
రాజస్థాన్భారతదేశం
హిందూఆసియాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా

జైసల్మేర్ కోట, భారత రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరంలో ఉంది.ప్రపంచంలోని అతి కొద్ది "జీవన కోటలలో" ఇది ఒకటి అని నమ్ముతారు (కార్కాస్సోన్, ఫ్రాన్స్ వంటివి). ఎందుకంటే పాత నగర జనాభాలో నాలుగవ వంతు ఇప్పటికీ కోటలోనే నివసించుచున్నారు.జైసల్మేర్ నగరం 800 సం.ల చరిత్రలో చెప్పుకోదగిన విషయంగా ఈ కోటకు గుర్తింపు ఉంది.జైసల్మేర్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోట వెలుపల మొదటి స్థావరాలు 17 వ శతాబ్దంలో వచ్చాయని చెబుతారు.జైసల్మేర్ కోట రాజస్థాన్‌లో ఉన్న పురాతన కోటలలో ఇది రెండవది.దీనిని సా.శ. 1156 లో భాటి రాజపుత్రుడు (పాలకుడు) జైసల్ నిర్మించాడు.జైసల్ నిర్మించినందున దానికి అతనిపేరు వాడుకలోకి వచ్చింది.ముఖ్యమైన వాణిజ్య వ్యాపారాలకు అనువుగా పురాతన సిల్క్ రోడ్డు కూడలి వద్ద ఉంది.

భారీ పసుపు ఇసుకరాయితో నిర్మించిన కోట గోడలు పగటిపూట సింహం రంగుగానూ, సూర్యుడు అస్తమించేటప్పుడు తేనె - బంగారం రంగుగా కనపడతాయి.దీనివలన ఎడారిలో కోట ఉందనే విషయాన్ని మభ్యపెడుతుంది.ఈ కారణంగా దీనిని సోనార్ క్విలా, గోల్డెన్ ఫోర్ట్ అని పిలుస్తారు.[1] త్రికూటా కొండపై ఉన్న గొప్ప థార్ ఎడారి ఇసుక విస్తరణ మధ్య ఈ కోట ఉంది. ఇది నేడు నగరం దక్షిణ అంచున ఉంది. అది కొండప్రాంతం అంతా అవరించి ఉంటుంది. కోట చుట్టూ ఉన్న విస్తారమైన టవర్లు చాలా మైళ్ళ వరకు కనిపించేలా చేస్తాయి.

2013 లో కంబోడియాలోని నమ్ పెన్లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 37 వ సెషన్లో, జైసల్మేర్ ఫోర్ట్, రాజస్థాన్ లోని 5 ఇతర కోటలతో పాటు, రాజస్థాన్ లోని హిల్ ఫోర్ట్స్ గ్రూప్ క్రింద యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.[2][3]

చరిత్ర

[మార్చు]

జైసల్మేర్ కోట భారతదేశంలోని బంగారు రంగుగల థార్ ఎడారిలో ఉన్న ఒక అద్భుతమైన కోట. ఇది భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది మరో రెండు ముఖ్యమైన బిరుదులను కూడా కలిగిఉంది.ఒకటి ఇది ప్రపంచంలోని పురాతన ఎడారి కోటని, రెండవది ఇది రాజస్థాన్ లోని అన్ని కోటలలో పురాతనమైందని గుర్తింపు పొందింది. రాజస్థాన్ పర్యటనలో పర్యాటకులు ఈ కోటను తప్పనిసరిగా దర్శిస్తారు.

జైసల్మేర్ కోట సా.శ. 1156 లో నిర్మించబడింది. నగరాన్ని స్థాపించిన భాటి రాజపుత్రుడు రాజు రావల్ జైస్వాల్ తన పాలనలో ఈ కోటను నిర్మించాడు.ఎందుకంటే ప్రస్తుత జైసల్మేర్ నుండి 16 కి.మీ.దూరంలో లుడెర్వా వద్ద ఉన్నకోట కాల్చని మట్టి ఇటుకలు (Adobe) ద్వారా నిర్మించబడినందున మున్ముందు చాలా హాని కలిగిస్తుందనే ఆలోచనతో అసౌకర్యానికి గురై ఈ కోటను నిర్మించాడు.

కోట చుట్టూ నగరం విస్తరించి ఉంది. ఈ కోట 1500 అ.ల. పొడవు, 750 అ.ల. వెడల్పుతో నిర్మితమై ఉంది.చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతం నుండి ఎవరైనా దాని ఎత్తును చూస్తే సుమారు కోట 250 అ.ల. ఎత్తులో ఉన్నట్లుగా అనిపిస్తుంది.సాహిత్యపరంగా, సందర్శకులు ఈ కోటను 30 మైళ్లు దూరం నుండి చూసినప్పుడు వారు కొంత బంగారు రంగులో ఉన్న కొండను మాత్రమే చూడగలరు.

కోట వెలుపల ఇతర ఆకర్షణీయమైన 99 బురుజులు ఉన్నాయి.ఒక్కొక్క బురుజు  32.8 అడుగుల పొడవు ఉంటుంది. ఏదేమైనా, వాటిలో 92 బురుజులు 1633, 1647 మధ్య నిర్మించబడ్డాయి. ఇస్లామిక్, రాజపుత్రుల సంస్కృతి చక్కటి కలయిక ఈ కోటలో స్పష్టంగా తెలుస్తుంది.[4]

కోటలోకి ప్రవేశించడానికి  అఖై, గణేష్, సూరజ్, హవా అనే నాలుగు ప్రధాన ద్వారాలు (సింహద్వారాలు) ఉన్నాయి.[5] వెలుపల నుండి కోటలోకి వచ్చేవారికి అఖై ప్రధానద్వారం కోటకు దగ్గరి మార్గంగా ఉంటుంది. ఇది 18 వ శతాబ్దంలో అఖై ప్రధానద్వారం బేస్ గోడను ఎడారిలోకి విస్తరించినప్పుడు నిర్మించబడింది. గేట్లను దాటిన తర్వాత కోట మధ్యలో చదరపు ఆకారంలో ఉన్న " దశరా " కూడలికి చేరుకోవచ్చు.మూలాలను విశ్వసిస్తే, 14 వ, 15 వ శతాబ్దాలలో జౌహర్‌కు ఈ దశరా చౌక్ ప్రధాన ప్రదేశం అని చెప్పబడింది. జౌహర్ ఒక మూలాధార ఆచారం. ఇక్కడ కోట మహిళలు బందీలుగా, బానిసలుగా ఉండకుండా ఉండటానికి తమను తాము అగ్నిలో పడవేస్తారు.

కోట లోపల ప్రముఖ ఆకర్షణ మహారావాల్ ప్యాలెస్.అక్కడ పరచిన,గోడలకు వాడిన మహారావాల్ పాలరాయి సందర్శకులకు ఆశ్చరాన్ని కలిగించే ప్రదేశం. కోటలోని ఇతర ఆసక్తికరమైన ప్రదేశాలలో జైన దేవాలయాలు, లక్ష్మీనాథ్ దేవాలయాలు ఉన్నాయి.[5] ఈ కోటలో దేశంలోని ఇతర కోటల మాదిరిగా కాకుండా మ్యూజియంలు, షాపులు, రెస్టారెంట్లు, నివాస వసతులు ఉన్నాయి. జైసల్మేర్ కోటలో 2000 మంది నివాసితులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కోట నమ్మశక్యం కాని వివరాలతో చిత్రీకరించబడింది.ఇక్కడి నుండి సూర్యాస్తమయం చూడటం జీవితకాలపు అనుభవం. ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ విక్రమాదిత్య ప్రకాష్, “రాజ్‌పుట్ కోటలు నిర్మించడం అంత సులభం కాదు” అనే వాఖ్యను ఉటంకించాడు.శతాబ్దాలుగా కోట క్షీణిస్తోంది.ఇది భారతదేశం చివరి “జీవన కోట”గా మారుతుంది.

రాజస్థాన్ పర్యటనలో సందర్శకులకు ధర్శించటానికి ఈ కోట ముఖ్యమైన ప్రదేశం. ఈ కోట ప్రతి రోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు తెరిచి ఉంటుంది. రైలు, రహదారి, వాయు మార్గాల ద్వారా కోటను దర్శించటానికి జైసల్మేర్ నగరం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది.రాజస్థాన్‌లోని వివిధ నగరాల మాదిరిగా, జైసల్మేర్‌లో స్వంత అద్భుతమైన వారసత్వం విభిన్న కోణాలను కోటలో కనపడతాయి. నగరం అంతటా చెల్లాచెదురుగా ఉన్న చారిత్రక కట్టడాలు అన్నీ కనుగొనగలిగినప్పటికీ, జైసల్మేర్ కోట చూసిన ఆనందం ప్రత్యేకంగా ఉంటుంది

మూలాలు

[మార్చు]
  1. "గోల్డెన్‌ ఫోర్ట్‌! - Andhrajyothy". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2019-05-29. Retrieved 2019-12-28.
  2. "Heritage Status for Forts - Eastern Eye | HighBeam Research". 2015-09-24. Archived from the original on 2015-09-24. Retrieved 2020-04-29.
  3. "Iconic Hill Forts on UN Heritage List - Mail Today (New Delhi, India) | HighBeam Research". 2015-09-24. Archived from the original on 2015-09-24. Retrieved 2020-04-29.
  4. "Jaisalmer Fort - Jaisalmer Fort Rajasthan - Sonar Quila Jaisalmer Rajasthan". www.jaisalmer.org.uk. Retrieved 2020-04-29.
  5. 5.0 5.1 "Jaisalmer Fort Rajasthan - History, Timings, Entry Fees, Best Time to Visit | Signaturerajasthan". Signaturerajasthan Blog (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-04-27. Retrieved 2020-04-29.

వెలుపలి లంకెలు

[మార్చు]