అర్జున్ సింగ్ (మధ్యప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్జున్ సింగ్
అర్జున్ సింగ్ (మధ్యప్రదేశ్)


వ్యక్తిగత వివరాలు

జననం (1930-11-05)1930 నవంబరు 5
ఛుర్హాట్
మరణం 2011 మార్చి 4(2011-03-04) (వయసు 80)
న్యూ ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ స్వతంత్ర (1957-1960)
కాంగ్రెస్ (1960-1996, 1998-2011)
ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ (తివారీ) (1996-1998)
జీవిత భాగస్వామి సరోజ్ కుమారి
సంతానం అజయ్ సింగ్
అభిమన్యు సింగ్
వీణ సింగ్
పూర్వ విద్యార్థి అలాహాబాద్ యూనివర్సిటీ

అర్జున్ సింగ్ (5 నవంబర్ 1930 - 4 మార్చి 2011[1]) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1980లలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు[2], పంజాబ్ గవర్నర్‌గా, 2000 నుంచి 2011 వరకు లోక్‌సభ & రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై పివి నరసింహారావు & మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో రెండుసార్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అర్జున్ సింగ్ 1980 & 1985 మధ్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన రాష్ట్రంలో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఒక రోజు తర్వాత పంజాబ్ గవర్నర్‌గా నియమితుడయ్యాడు. అర్జున్ సింగ్ 1985లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పివి నరసింహారావు మంత్రివర్గంలో వాణిజ్య, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా తిరిగి 1991లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పని చేశాడు.

ఆయన 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత పివి నరసింహారావుకు వ్యతిరేకంగా మరి ఆ తరువాత ఎన్.డి తివారీ నాయకత్వం 1994లో అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) పేరుతో తిరుగుబాటు కాంగ్రెస్‌ను స్థాపించాడు. అర్జున్ సింగ్ రావు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజీవ్ గాంధీ హయాంలో పార్టీకి ఉపాధ్యక్షుడిగా పని చేశాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]

మరణం

[మార్చు]

అర్జున్ సింగ్ అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరి చికిత్స పొందుతూ 2011 మార్చి 4న మరణించాడు.[4] ఆయన అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన చుర్హాట్‌లో జరిగాయి. ఆయనకు భార్య సరోజ్ కుమారి, ఇద్దరు కుమారులు అజయ్ సింగ్ (ఎమ్మెల్యే), అభిమన్యు & కుమార్తె వీణ ఉన్నారు.[5]

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (5 March 2011). "Congress veteran Arjun Singh dead". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  2. India TV News (5 November 2014). "Arjun Singh, the missing MP Chief Minister during Bhopal Gas tragedy" (in ఇంగ్లీష్). Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  3. CV at Indian Parliament website Archived 28 ఫిబ్రవరి 2008 at the Wayback Machine.
  4. India Today (4 March 2011). "Veteran Congress leader Arjun Singh dead" (in ఇంగ్లీష్). Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  5. DNA India (21 November 2013). "Veteran Congress leader Arjun Singh dies aged 81" (in ఇంగ్లీష్). Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.