వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి
నియోజకవర్గము నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1968-04-05) 1968 ఏప్రిల్ 5 (వయస్సు: 52  సంవత్సరాలు)
సికింద్రాబాదు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానము ఇద్దరు కుమారులు
వెబ్‌సైటు http://www.sunithalaxmareddy.in/

వాకిటి సునీతా లక్ష్మారెడ్డి (Vakiti Sunitha Laxmareddy) మెదక్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు.

జననం[మార్చు]

ఈమె ఏప్రిల్ 5, 1968న జన్మించింది. బీఎస్సీ వరకు అభ్యసించింది.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

సునీతా లక్ష్మారెడ్డీ తొలిసారి 1999లో మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనది. 2004లో ఇదే స్థానం నుంచి రెండోసారి విజయం సాధించింది. 2009లో కూడా వరసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్ సాధించింది.[1] 2009మేలో వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా స్థానం పొందింది. ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కూడా కొనసాగి, 2010 డిసెంబరులో కిరణ్ కుమార్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా నియమితురాలైంది.

2019, ఏప్రిల్ 1న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది.[2][3]

బంధుత్వం[మార్చు]

సునితా లక్ష్మారెడ్డి భర్త వి. లక్ష్మారెడ్డి గోమారం గ్రామ సర్పంచిగా, జడ్పీటీసి సభ్యుడిగా పనిచేశారు.[4]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 02-12-2010
  2. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (1 April 2019). "టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి". Archived from the original on 2 ఏప్రిల్ 2019. Retrieved 2 April 2019. Check date values in: |archivedate= (help)
  3. అంధ్రజ్యోతి, తెలంగాణా తాజావార్తలు (1 April 2019). "టీఆర్ఎస్‌‌లో చేరడానికి కారణాలివే..: సునీతా లక్ష్మారెడ్డి". Archived from the original on 2 ఏప్రిల్ 2019. Retrieved 2 April 2019. Check date values in: |archivedate= (help)
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-04. Retrieved 2013-11-03.