తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్

వికీపీడియా నుండి
(తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌
రకంతెలంగాణ ప్రభుత్వ సంస్థ
కేంద్రీకరణమహిళల అభ్యున్నతి
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు, ఉర్దూ
ముఖ్యమంత్రికేసీఆర్
శాఖామంత్రిసత్యవతి రాథోడ్
చైర్‌పర్సన్‌వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌, తెలంగాణ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్. మహిళల స్థితిగతులను మెరుగుపరచడానికి, మహిళలకు జరిగే అన్యాయాలపై విచారణ చేయడానికి, మహిళలకు సంబంధించిన విషయాల కోసం ఈ కమిషన్ ఏర్పాటు చేయబడింది. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి 2021, జనవరి 8న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ తొలి చైర్‌పర్సన్‌గా భాద్యతలు చేపట్టింది.[1][2][3]

కమిషన్ సభ్యులు[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ గడువు 2018 జూలైలో ముగిసింది. కమిషన్ ను నియమించాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో 2020, డిసెంబరు 27న కమిషన్ సభ్యులను నియమిస్తూ (జీవో నెం. 20) ప్రకటన జారీచేసింది. 2021 జనవరి 8న కమిషన్ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషన్ ఐదేళ్ళపాటు కొనసాగుతుంది.[4]

  • చైర్‌పర్సన్‌: వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
  • సభ్యులు: షాహీన్‌ ఆఫ్రోజ్‌, గద్దల పద్మ, కుమ్ర ఈశ్వరీబాయి, సుదాం లక్ష్మి, కొమ్ము ఉమాదేవి యాదవ్‌, కటారి రేవతీరావు

విధులు[మార్చు]

  • మహిళల జీవితాలను మెరుగుపరచడం, మహిళా హక్కులను పరిరక్షించడం
  • మహిళల పట్ల వివక్షను తొలగించడం
  • ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం
  • స్థానిక స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు, వివిధ అంతర్జాతీయ వేదికలలో రాష్ట్ర మహిళల ప్రాతినిధ్యం పెంచడం
  • తెలంగాణలో జెండర్ సెన్సిటైజేషన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళల శ్రేయస్సు కోసం సాధికారతను సాధించడం

నూతన భవనం[మార్చు]

2021, జూన్ 27న సికింద్రాబాద్‌ బుద్ధభవన్‌లో రాష్ట్ర మహిళా కమిషన్‌ నూతన కార్యాలయం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు, అధికారులు తదితరలు పాల్గొన్నారు.[5]

పరిష్కరించిన కేసుల వివరాలు[మార్చు]

2022, జనవరి 19 వరకు ఈ ఏడాదికాలంలో 466 మంది బాధితులు కమీషన్ ను ఆశ్రయించగా, ఇందులో 255 కేసులు పూర్తిగా పరిష్కరించబడ్డాయి. 211 కేసులు పరిష్కార దశలో ఉన్నాయి. వివిధ దేశాల్లోని 15 మంది ఎన్ఆర్ఐలు తమకు న్యాయం చేయాలని కమిషన్ ను ఆశ్రయించగా పదిమంది సమస్యలు పరిష్కారించబడ్డాయి.[6]

మూలాలు[మార్చు]

  1. The Hans India (9 January 2021). "Sunitha Lakshma Reddy takes over as chairperson of Women's commission". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2021. Retrieved 2022-01-19.
  2. Zee News Telugu (8 January 2021). "Telangana తొలి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి భాద్యతలు". Zee News Telugu. Retrieved 2022-01-19. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. TV9 Telugu, TV9 (28 December 2020). "కేసీఆర్ ను కలిసిన తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వి.సునీతా లక్ష్మారెడ్డి - chairperson meets CM KCR". TV9 Telugu. Retrieved 2022-01-19. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  4. "Telangana: తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు.. చైర్‌పర్సన్‌ ఎవరంటే." News18 Telugu. 2020-12-27. Archived from the original on 2022-01-19. Retrieved 2022-01-19.
  5. "మహిళలకు అన్నివిధాలా అండగా." Sakshi. 2021-06-28. Archived from the original on 2021-06-28. Retrieved 2022-01-19.
  6. "అబలలకు అండగా మహిళా కమిషన్‌". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-18. Archived from the original on 2022-01-19. Retrieved 2022-01-19.