Jump to content

పట్లోళ్ల సంజీవ రెడ్డి

వికీపీడియా నుండి
పట్లోళ్ల సంజీవ రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి
నియోజకవర్గం నారాయణ్‌ఖేడ్

వ్యక్తిగత వివరాలు

జననం 1962
నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పటోళ్ల కృష్ణారెడ్డి
నివాసం H.No.2-3-149/A, హనుమాన్ కాలనీ, నారాయణఖేడ్ గ్రామం , మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం[1]

పట్లోళ్ల సంజీవ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో నారాయణ్‌ఖేడ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ రంగం

[మార్చు]

పట్లోళ్ల సంజీవ రెడ్డి తన తండ్రి పటోళ్ల కృష్ణారెడ్డి అడుగుజాడల్లో రాజకీయాలలోకి వచ్చి మొదటిసరిగా నారాయణ్‌ఖేడ్ ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2015లో ఎమ్మెల్యేగా ఉన్న తన తండ్రి మరణాంతరం 2016లో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.[3]

పట్లోళ్ల సంజీవ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో భారతీయ జనతా పార్టీలో చేరి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఎన్నికల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సంజీవ రెడ్డి 2023 శాసనసభ ఎన్నికల్లో నారాయణ్‌ఖేడ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌ రెడ్డి పై 5766 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India - Patolla Sanjeeva Reddy Affidavit 2023" (PDF). 2023. Archived from the original (PDF) on 25 December 2023. Retrieved 25 December 2023.
  2. News18 తెలుగు (4 December 2023). "అసెంబ్లీలో అధ్యక్షా అననున్న డాక్టర్లు.. ఎమ్మెల్యేలుగా 16 మంది వైద్యులు..!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Hindu (16 February 2016). "TRS wins Narayankhed byelection defeating Cong" (in Indian English). Archived from the original on 25 December 2023. Retrieved 25 December 2023.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.