పటోళ్ల కృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పటోళ్ల కిష్టా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు. ఆయన మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులుగా 2014 ఎన్నికలలో ఎన్నికైనారు.[1] ఆయన నాలుగుసార్లు శాసన సభ్యులుగా గెలుపొందారు.

జీవిత విశేషాలు[మార్చు]

నారాయణఖేడ్ మండలం పంచగావ్ గ్రామంలో కిష్టారెడ్డి జన్మించారు.ఆయన హెచ్.ఎస్సీని నారాయణఖేడ్ లో చదివారు. తరువాత పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ లో నిజాం కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి పట్టాను పొంది జూనియర్ లాయర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు.ఆయన ఎల్.ఎల్.బిలో గోల్డు మెడలిస్టు. ఆయన సంగారెడ్డి జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటరుగా కూడా పనిచేసారు. ఆయన 1981 నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.[2] ఆయనకు నలుగురు కుమారులు.

కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అంకిత భావంతో పనిచేసిన కిష్టారెడ్డి రాజకీయ ప్రస్థానం 1989 లో శాసన సభ్యులుగా అదే సమయంలో టిడి బోర్డు సభ్యుడిగా ఉన్నారు. గ్రామ సర్పంచ్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన శాసన సభ్యులుగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ శాసన సభ్యులుగా 1989, 1999, 2009, 2014లో కిష్టారెడ్డి శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. 1989 మంచికి మారుపేరుగా నిలిచిన ఆయన ప్రజల అభిమానం చూరగొన్నారు అందుకే నాలుగు సార్లు ఆయనను శాసన సభ్యులుగా గెలిపించారు.నారాయణఖేడ్ అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో పాల్పడ్డారు. ఆయన తెలంగాణ పీఏసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.[3]

గత మూడు పర్యాయాలూ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసన సభ్యులుగా ఎన్నికైన ఆయన ప్రస్తుతం మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రాజకీయ జీవితంలో చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన నేత ఆయన. ప్రారంభంలో పంచగామ గ్రామసర్పంచ్ గా ఎన్నికైన ఆయన క్రమంగా శాసన సభ్యులుగా పోటీ చేసి గెలిచే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన తెలంగాణా ప్రజా పద్దుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.[4]

ఆయన పెద్ద కుమారుడు పటోళ్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్ కు ఎం.పి.టి.సిగా పనిచేస్తున్నారు.[5]

మరణం[మార్చు]

ఆగష్టు 25 2015 మంగళవారం నాడు హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్‌లో గుండెపోటుతో ఆయన నిద్రలోనే మృతి చెందారు.[6]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]